twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి'‌: ముక్తాంబగా నిత్యా మేనన్‌ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర బృందం వరుసగా పోస్టర్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం 'ముక్తాంబ' పాత్రలో నటిస్తున్న నిత్యా మేనన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీరు వాటినికి ఇక్కడ చూడవచ్చు.

    NityaMenon as Princess "Mukthamba"For full figure still visit- official page of Gunaa Teamworks#Rudhramadevi #EpicDrama

    Posted by Rudhramadevi on 21 July 2015

    నిత్యా మీనన్ ఫుల్ ఫిగర్ ని ఇక్కడ చూడవచ్చు..

    NityaMenon as Princess "Mukthamba"For close-up still visit- Rudhramadevi page #Rudhramadevi #EpicDrama

    Posted by Gunaa Teamworks on 21 July 2015

    అలాగే...సోమవారం 'అనామిక' పాత్రలో నటిస్తున్న కేథరిన్‌ త్రెసా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్ ని ఇక్కడ మీరు చూడవచ్చు.

    Catherine Tresa as Princess Anaamika For close up still, visit the official page of Gunaa Teamworks!#Rudhramadevi #EpicDrama

    Posted by Rudhramadevi on 20 July 2015

    అలాగే.. క్లోజ్ అప్ ఫొటోని ఇక్కడ చూడవచ్చు.

    Catherine Tresa as Princess "Anaamika"For full figure still visit Rudhramadevi page #Rudhramadevi #EpicDrama

    Posted by Gunaa Teamworks on 20 July 2015

    ఇందులో భాగంగా ఇప్పటికే ..రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడి పాత్రలో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, మహామంత్రి శివదేవయ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌లు నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. త్వరలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మీరు ఈ పోస్టర్ ని చూడండి.

    Here's another one ! The Emperor "Ganapathi Deva Chakravarthy" with his Mahamantri " Shivadevayya ".#Rudhramadevi #EpicDrama #RebelStar #Krishnamraju #PrakashRaj

    Posted by Gunasekhar on 18 July 2015

    భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు.

    చిత్రం బిజినెస్ విషయానికి వస్తే..

    ఇండస్ట్రీలో ఒకప్పుడు దిల్ రాజు సినిమా హక్కులు తీసుకున్నాడంటే హిట్ గ్యారెంటీ అనే నానుడి ఉండేది. ఇప్పుడు అది మారింది. వారాహీ చలన చిత్రం బ్యానర్ నిర్మాత కొర్రిపాటి సాయి ...ఓ సినిమా ని తీసుకున్నాడంటే ఖచ్చితంగా హిట్ అంటున్నారు. దాంతో మిగతా ఏరియాలు బిజినెస్ కూడా స్పీడుగా జరిగిపోతోంది. తాజాగా ఆయన 'రుద్రమదేవి' చిత్రం కృష్ణా ఏరియా రైట్స్ తీసుకున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఆ ఏరియాకు ఆయన రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించటం, రానా, అనుష్క లు కూడా ఈ సినిమాలో ఉండటం ప్లస్ అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    NityaMenon as Princess Mukthamba

    మరో ప్రక్క గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

    సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

    'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

    గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

    NityaMenon as Princess Mukthamba

    ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

    ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.

    మరో ప్రక్క ... ఈ చిత్రం నిర్మాతలు...బాహుబలి తరహాలోనే సీరిస్ ఆఫ్ పోస్టర్స్ ని విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. అయితే మరి బాహుబలి కు అంతర్జాతీయ స్ధాయిలో ప్రమోషన్ చేసారు. మరి ఇక్కడ కూడా చేస్తారో లేదో చూడాలి.

    అలాగే ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే విజువల్ ఎఫెక్టు పనుల వల్లే లేటు అని చెప్పుతున్నారు. ఈ నేపధ్యంలో రుద్రమదేవి...ఆగస్టు తర్వాత మాత్రమే రిలీజ్ కు సమయం దొరికేటట్లు ఉంది.

    సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

    English summary
    NityaMenon as Princess "Mukthamba" poster released today. Gunasekhar, the director and produced of recorded motion picture ‘Rudhramadevi’, is leaving no stone unturned to make the film a visual dining experience. A propelled innovation named EDS-Enhanced Depth Solutions, is being utilized for the film. This innovation gives the audience a 3D vibe without glasses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X