twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధికారంతో చుక్కలు చూపిస్తున్న విశాల్, మరో సంచలనం!

    శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న, పెద్ద చిత్రాలకు రేటు విషయంలో తేడా చూపుతున్న టీవీ చానళ్లకు వ్యతిరేకంగా విశాల్ తీసుకున్న నిర్ణయం ఇపుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్...... అధికారం వచ్చాక సంచలన నిర్ణయాలతో దూసుకెలుతున్నారు. చిన్న సినిమాలను, చిన్న సినిమాల నిర్మాతలకు కాపాడటమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న, పెద్ద చిత్రాలకు రేటు విషయంలో తేడా చూపుతున్న టీవీ చానళ్లకు వ్యతిరేకంగా విశాల్ తీసుకున్న నిర్ణయం ఇపుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    ఉచితంగా ఇవ్వొద్దు

    ఉచితంగా ఇవ్వొద్దు

    టీవీ చానళ్లకు తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు.

    మీ ఆదాయంలో మాకు వాటా ఇవ్వండి

    మీ ఆదాయంలో మాకు వాటా ఇవ్వండి

    సినిమాల ట్రైలర్స్, పాటలు, క్లిప్పింగ్స్ ద్వారా టీవీ ఛానల్స్ కు ఆదాయం వస్తుంది కాబట్టి అందులో కొంత షేర్ నిర్మాతలకు ఇవ్వాలని, ఇది న్యాయమైన కోరికే అని విశాల్ అంటున్నారు. మరి విశాల్ నిర్ణయం ఎంత వరకు అమలవుతుందో చూడాలి.

    తొలి నిర్ణయం ఫెయిల్

    తొలి నిర్ణయం ఫెయిల్

    ఇటీవల నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్ .... తమిళనాట ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు నిర్మాతలు వ్యతిరేకించారు. నష్టాల్లో ఉన్న తాము రైతుల కోసం టికెట్‌లో ఒక రూపాయి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో విశాల్ కూడా ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

    హీరో విశాల్ గెలుపు: తండ్రిలాగా అడుక్కునే స్థితి రాకుండా చర్యలు!

    హీరో విశాల్ గెలుపు: తండ్రిలాగా అడుక్కునే స్థితి రాకుండా చర్యలు!

    విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేయడం వెనక ఒక కసి ఉంది. తన తండ్రికి నిర్మాతగా జరిగిన అన్యాయమే ఆయన్ను ఎన్నికల వైపు నడిపించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    Read more about: vishal విశాల్
    English summary
    The newly elected office bearers of the powerful Tamil Film Producers' Council (TFPC) have issued an advisory to producers of Tamil films urging them not to give away any songs, clippings, trailers and letters of consent to television channels free of cost.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X