twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంగీత్ లో రజనీకాంత్ డాన్స్ చేయటంపై మంచు లక్ష్మి

    By Srikanya
    |

    హైదరాబాద్ :''తమ్ముడి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకొంటున్నా. సంగీత్‌ కార్యక్రమం నా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. రజనీకాంత్‌ సంగీత్‌లో డాన్స్‌ చేస్తారని ఏవేవో వార్తలొస్తున్నాయి. రజనీ అంకుల్‌ పెళ్లికి వస్తున్నారు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన తప్పకుండా వస్తారు. అందులో వింతేం లేదు.'' అంటూ రూమర్స్ ని కొట్టిపారేసింది మంచు లక్ష్మి. గత కొద్ది రోజులుగా...మంచు మనోజ్ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ..రజనీకాంత్ డాన్స్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె ఇలా స్పందించింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే...మనోజ్‌ని ఇంతకు ముందు 'పెళ్లి చేసుకోరా.. మేమంతా హాయిగా సెటిలైపోయాం చూడూ..' అని సతాయించేదాన్ని. 'అప్పుడే ఎందుకు అక్కా?' అనేవాడు. ఇప్పుడు పెళ్లి దగ్గర పడింది. 'చిన్నపిల్లాడికి పెళ్లేంటి' అనిపిస్తోందిప్పుడు (నవ్వుతూ). అదే విషయం వాడితో చెబితే.. 'అదేంటి మీరంతా చేసుకొని సెటిలైపోయారు. నేను చేసుకోవద్దా..' అని వాదిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది.

    No, Rajnikanth Isn't Dancing: Manchu Laxmi

    లక్ష్మీ ప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం 'దొంగాట'. ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ''అన్ని విధాలా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. ప్రేక్షకులకూ తప్పకుండా నచ్చుతుంది' అంటున్నారు లక్ష్మీప్రసన్న.

    ''దొంగాట' క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగిన సినిమా. 'ఏ' క్లాస్‌ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీశారా? అని అంతా అడుగుతున్నారు. అదేం కాదు. మా సినిమా అందరూ చూడాలి. అందరికీ నచ్చేలానే తీశాం. తొలిసారి ఇలాంటి జోనర్‌లో ఓ సినిమా చేశా. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో కనిపించా. కామెడీ చేయడం చాలా చాలా కష్టం. మరీ ముఖ్యంగా సెట్లో బ్రహ్మానందం అంకుల్‌ ఉంటే మరింత కష్టం. ఆయనతో తొలిసారి నటించిన చిత్రమిది. నేనైతే చాలా ఆస్వాదిస్తూ పనిచేశా అని చెప్పుకొచ్చారామె.

    English summary
    Lakshmi Manchu said... 'It's me who is taking care of Sangeeth party. There is nothing like Rajni uncle dancing there', she confirms. 'He is my dad's best friend and is there at my wedding and Vishnu's wedding too. He will be attending Manoj's wedding also but not like dancing at Sangeeth. These kinds of rumours never erupted during our sangeet functions, but I don't know why they kept coming now', Lakshmi further added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X