twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా చూడొద్దు: ఎన్టీఆర్ (వర్కింగ్ స్టిల్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జనతా గ్యారేజ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళం ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. వివిధ టీవీ ఛానల్స్ కు వరుస ఇంటర్వూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

    సిటీల్లో ఉండటం వల్ల మనమంతా ఒక కాంక్రీట్ జంగల్లో ఉండిపోతున్నాము. ఈ కాంక్రీట్ జంగల్లో కూడా ఒక గ్రీన్ రివల్యూషన్ తీసుకురావచ్చు. ప్రకృతి గురించి ఒకళ్లు చెబితే మనకు అర్థం కాదు. మనకు మనంగా ఫీలవ్వాలి.. మన బాధ్యతగా ఫీలవ్వాలి అన్నారు.

    'జనతా గ్యారేజ్' చిత్రాన్ని ఒక సినిమాగా కాకుండా ఒక నైతిక బాధ్యతగా ప్రతిఒక్కరూ తీసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మొక్కలు నాటే విషయంలో అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

    జనతా గ్యారేజ్ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని, ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే వారికి, సాటి మనుషులను ప్రేమించే వారు ఈ సినిమాను చాలా భాగా ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. స్లైడ్ షోలో జనతాగ్యారేజ్ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, ఎన్టీఆర్ చెప్పిన మరిన్ని విశేషాలు..

    మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ...

    మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ...

    మోహన్ లాల్ గారి నుండి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

    ఉన్నదాంట్లోనే

    ఉన్నదాంట్లోనే

    మోహన్ లాల్ గారు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడిపోయే వ్యక్తి ఎన్టీఆర్ తెలిపారు.

    అర్హత లేదు

    అర్హత లేదు

    మోహన్ లాల్ నటన గురించి మాట్లాడే అంత వయసు, అనుభవం నాకు లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు' అని యంగ్ టైగర్ అన్నాడు.

    సమంత గురించి

    సమంత గురించి

    సమంతతో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసారు. మరోసారి ఆమెతో చేయడం ఆనందంగా ఉందన్నారు.

    నిత్యా మీనన్ గురించి

    నిత్యా మీనన్ గురించి

    నిత్యా మీనన్ మంచి నటి అని, సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఎన్టీఆర్ తెలిపారు.

    కొరటాల శివ

    కొరటాల శివ

    కొరటాల శివ లేకుంటే ఈ రోజు జనతా గ్యారేజ్ సినిమా లేదని, ఆయన కష్టానికి ఫలితమే ఈ సినిమా అన్నారు.

    కష్టపడ్డాం

    కష్టపడ్డాం

    ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ నాది అనే భావనతో కష్టపడ్డామని ఎన్టీఆర్ తెలిపారు.

    మైత్రీ మూవీస్

    మైత్రీ మూవీస్

    మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

    దేవిశ్రీ

    దేవిశ్రీ

    దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల కు సిద్ధం అవుతోంది.

    హైలీ ఎమోషన్

    హైలీ ఎమోషన్

    పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు

    ఇతర నటులు

    ఇతర నటులు

    సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.

    English summary
    NTR interview about Janatha Garrage movie. Directed by Koratala Siva and music composed by Devi Sri Prasad. Watch #JanathaGarageMaking exclusively on Mythri Movie Makers. #JanathaGarage movie is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and CV Mohan. This movie also stars Devayani, Saikumar and Ajay in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X