twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక వీళ్ళు మారరా..?? మళ్ళీ మొదలైన ఎన్టీఆర్, పవన్ అభిమానుల వార్....

    |

    "మేము మేమూ కలిసే ఉంటాం దయచేసి మీరు గొడవలు పెట్టుకొని మీ జీవితాలు పాడు చేసుకోకండీ..!" ఇద్దరు స్టార్ హీరోలు మూడు రోజుల గడువు లోనే తమ అభిమానులకి చెప్పారు. ఒక రకంగా అభ్యర్థించారు. కానీ వీళ్ళు వినరు. తమ అభిమానం తక్కువ కాదు అని నిరూపించుకునే ప్రయత్నం లో తమ స్టార్లనే ఇరుకున పెడుతున్నమన్న స్పృహ వీళ్ళలో తగ్గిపోతిఓంది. అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు., ఎన్టీఆర్ ఒక ఉత్తరమే రాసాడు కానీ వీళ్ళిద్దరూ కోరుకున్నట్టు పరిస్థితి ఏమీ ఉండటం లేదు.

    ఫ్యాన్ వార్ దానంతట అది జరుగుతూనే ఉంది.టాలీవుడ్‌లో ఇద్ద‌రు హీరోల మ‌ధ్య పోటీ ఎలా ఉంటుందో...వారి అభిమానుల మ‌ధ్య కూడా అదే స్థాయిలో వార్ ఉంటుంది. త‌మ హీరో సినిమాయే హిట్ అవ్వాల‌ని...త‌మ హీరో సినిమాయే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని వారు కోరుకుంటుంటారు. ఇక టాప్ పొజిష‌న్‌లో ఉన్న ఇద్ద‌రు అగ్ర హీరోల అభిమానుల మ‌ధ్య అయితే వార్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.స్టార్ స్టేట‌స్ ఉన్న హీరోల అభిమానులైతే ప్ర‌తి చిన్న విష‌యానికి అవ‌త‌లి హీరో మీద ఏదో ఒక విష‌యంలో ర‌చ్చ ర‌చ్చ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

    మళ్ళీ మామూలే

    మళ్ళీ మామూలే

    హద్దుల్లేని అభిమానమే ఒక హీరో అభిమాని ప్రాణం తీస్తే ఇంకో హీరో అభిమాని ని నేరస్తున్ని చేసి జైలుకు పంపబోతోంది. ఇప్పుడా రెండు కుటుంబాల పరిస్థితేమిటి..?? అన్న ప్రశలు ఆ రెండు రోజులూ కొంత ఆలోచింపజేసినా. తర్వాత మళ్ళీ మామూలే. ఇక ఇప్పుడు మళ్ళీ జనతా గ్యారేజ్ హిట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ జోష్ లోకి వచ్చారు.... ఫ్యాన్స్ రచ్చ మళ్ళీ సోషల్ మీడియాలో మొదలయ్యింది....

    సమస్య అదే

    సమస్య అదే

    తమ హీరో మీద ఉన్న అభిమానం ఎంతైనా ఫరవాలేదు కానీ ఆ అభిమానం మరో నటుడి మీద ద్వేషం వరకూ వెళ్లటమే సమస్య. జనతా గ్యారేజ్ హిట్ జోష్ లోఉన్న ఫ్యాన్స్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేసారు. ఎమోషనల్ సీన్స్ రక్తి కట్టించడంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడనీ చెబుతూ ఒక ఫొటో పోస్ట్ చేసారు. అయితే ఇందులో ఎలాంటి సందేహం లేదు జూనియర్ మంచి నటుడే..

     విమర్శించే స్థాయికి వెళ్లడమే

    విమర్శించే స్థాయికి వెళ్లడమే

    కానీ అంతటితో ఆగితే బాగుండేది. అభిమానుల అత్యుత్సాహం పక్క హీరోల నటనను విమర్శించే స్థాయికి వెళ్లడమే ఇక్కడ అసలు సమస్య. అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్‌లో పవన్ ఏడ్చే సీన్లోని ఇంకో స్టిల్ ని కూడా జత చేసి, జనతాగ్యారేజ్‌లో ఎన్టీఆర్ నటనను పోలుస్తూ పెట్టిన ఓ ఫోటో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కళ్యాన్ లూజ్ మోషన్ అయినట్టు గా మొహం పెట్టాడు అంటూ అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యని జత చేయటం తో వివాదం రేగింది.

    హీరోలు తిట్లుతినే పరిస్థితి వచ్చింది

    హీరోలు తిట్లుతినే పరిస్థితి వచ్చింది

    ఇక పవర్స్టార్ అభిమానులు మాత్రం ఊరుకుంటారా..? మాహీరోనే అంత మాట అంటారా అంటూ కోపం తో ఊగిపోయిన పవన్ సేన కూడా ఎన్టీఆర్ ని విమర్షిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. 50 కోట్ల మార్క్‌ కూడా చేరుకోలేని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా స్పందించారు. వీళ్ళ వీళ అభిమానాలూ.., ఆగ్రహాలకు ఇప్పుడు హీరోలు తిట్లుతినే పరిస్థితి వచ్చింది. అదీ వారు తెలిసీ ఏ తప్పూ చేయకుండానే.

    మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య కూడా

    మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య కూడా

    అయితే ఈ ధోరణి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు గతం లో నూ మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య కూడా ఇలాంటి యుద్దమే నడిచింది. ఒకరి హీరోను మరొకరు విమర్షిస్తూ సోషల్ మీడియా సాక్షిగా ఇద్దరు హీరోల పరువునీ తీసేసారు. కొన్ని కామెంట్లైతే మామూలు మనుషులు చూడలేని విధంగా ఉండేవి. అయితే ఎప్పుడూ అటు మహేష్ గానీ ఇటు పవన్ గానీ ఇలాంటి దోరణి వద్దని చెప్పినట్టు గానీ, తాము బాగానే ఉంటామని గానీ చెప్పలేదు. ఆఖరికి ఇద్దరి సినిమా క్లిప్పింగ్ లని వాడిమరీ ఒకరినొకరు వాళ్ళే సవాల్ చేసుకుంటున్నట్టున్న వీడియోలు కూడా వచ్చాయి.

    ప‌వ‌న్ అభిమానులు మ‌హేష్‌పై సెటైర్లు

    ప‌వ‌న్ అభిమానులు మ‌హేష్‌పై సెటైర్లు

    సైమా అవార్డుల్లో ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన శ్రీమంతుడు సినిమాకు గాను ఉత్త‌మ న‌టుడు అవార్డు అందుకున్నప్పుడు మ‌హేష్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న‌ను ‘బెస్ట్ యాక్టర్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకుగాను, థ్యాంక్స్ సైమా' అంటూ ట్వీట్ పెట్టాడు. దీన్ని చూసిన ప‌వ‌న్ అభిమానులు మ‌హేష్‌పై సెటైర్లు వేశారు. ట్రోఫీ అనే ప‌దాన్ని కేవ‌లం క్రీడ‌ల‌కు మాత్ర‌మే వాడ‌తారు..మ‌హేష్‌కు ఆ మాత్రం కూడా తెలియ‌దా అని వారు సెటైర్ల‌తో సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోయారు.

    సోషల్ మీడియా హోరెత్తిపోయింది

    సోషల్ మీడియా హోరెత్తిపోయింది

    దీనికి కౌంట‌ర్‌గా మ‌హేష్ అభిమానులు ట్రోఫీ అనే పదాన్ని సినిమాల్లో కూడా ఉపయోగిస్తారు. ఆస్కార్ అవార్డుని ఆస్కార్ ట్రోఫీ అని కూడా పిలుస్తారు. ఆ విష‌యం మీకు తెలియ‌దా ఇంటర్ చదువుకున్న మీ హీరోకంటే మహేష్ కి బాగానే తెలుసు ముందు మీ హీరోకి ఇంగ్లిష్ నేర్పుకోండి" అని వారు కౌంట‌ర్ ఇచ్చారు. అంతే కౌంటర్లూ..., రీ కౌంతర్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.

    పోలీసుల లాఠీ చార్జ్

    పోలీసుల లాఠీ చార్జ్

    మూడేళ్ల క్రితం కూడా పవన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలలు పగలగొట్టుకున్నారు. 2011 లో నల్లగొండ జిల్లా కోదాడ లోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థియేటర్ వద్ద పవన్ అభిమానులు ''తాతల నాటి చరిత్ర చెప్పుకునే ఆలోచన మాది కాదని, చరిత్ర సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత'' అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం తెలిపారు.దాంతో పోలీసుల లాఠీ చార్జ్ వరకూ వెళ్ళింది వ్యవహారం.

    పవన్, ప్రభాస్ ఫ్యాన్స్

    పవన్, ప్రభాస్ ఫ్యాన్స్

    ఇక పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం లో జరిగిన గొడవ అయితే రెండు సామజిక వర్గాల మధ్య గొడవగా మారి చివరికి రాజకీయ రంగు పులుముకొని రాష్ట్ర వ్యాప్త సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. పోస్తర్ చించేయటం తో మొదలైన గొడవ కాస్తా ముదిరి ముదిరి ముఠాలు గా ఏర్పడి దాడులు చేసుకునే వరకూ వెళ్ళింది. అప్పుడు కూడా పవన్ కళ్యాన్ స్పందించి కొంత వరకూ సాముదాయించే ప్రయత్నం చేసినా అప్పటికే అది వర్గాల మద్య గొడవగా మారే వరకూ వెళ్లటం తో అదే స్థితి కొనసాగింది. చిర్రెత్తుకొచ్చిన పవన్ "ఇలా చేసే వాళ్ళు నా ఫ్యాన్స్ కానే కాదు" అంతూ చిరాకు పడ్డాడు కూడా.

    ఎందుకు

    ఎందుకు

    అభిమానం ఇలా పిచ్చిగా ఎందుకు మారుతోంది? ఒకప్పుడు కూడా హీరోలున్నారు వాళ్ళకీ వీరాభిమానులున్నారు వాళ్ళకీ సంఘాలున్నాయి. స్టార్లు కలిసి ఒకే సినిమాలో ఏ భేషజం లేకుండా సినిమాలు చేసారు. అలాగే అభిమానులూ కలిసే సినిమాలు చూసారు. ఏదైన విపత్తు వచ్చినప్పుడు అందరు హీరోల అభిమాన సంఘాలూ కలిసే పని చేసాయి.

    మల్టీ స్టారర్లు తగ్గిపోయాయి

    మల్టీ స్టారర్లు తగ్గిపోయాయి

    కానీ ఇప్పుడా పరిస్థితే లేదు. ఈగోలతో మల్టీ స్టారర్లు తగ్గిపోయాయి. వెంకటేష్ తప్ప ఇంకో హీరోతో సమానం గా స్క్రీన్ ని పంచుకోవటాని ఏ స్టార్ హీరో గానీ ఆఖరికి కుర్ర హీరోలు గానీ ఇష్తపడటం లేదు. వీళ్లలాగానే ఇప్పుడు ఫ్యాన్స్ కూదా సోలో గా మిగిలి పోయారు. తమ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఆ ఉక్రోషాన్ని ఇంకో హీరో మీదా., అతని తాలూకు ఫ్యాన్స్ మీద చూపించే ఉన్మాద స్థాయికి చేరుకుంటున్నారు.

     హీరోల కటౌట్లకి రక్తాభిషేకాలు చేస్తున్నారు

    హీరోల కటౌట్లకి రక్తాభిషేకాలు చేస్తున్నారు

    ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోబన్ బాబు ల కాలంలో తమ హీరోల సినిమా విడుదలైతే... పేదలకు అన్న దానం చేసే వాళ్ళు.., పేదలకు దుప్పట్లు పంచే వాళ్ళు, సినిమాకి వచ్చిన ప్రేక్షకులకి అసౌకర్యం కలగ కుమండా చూసే వాళ్ళు. ఆతర్వార రెండో తరం లో కటౌట్లూ, బ్యానర్లూ, పాలాభిషేకలూ మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఏకంగా మేకలనీ కోళ్ళనీ బలిచ్చి హీరోల కటౌట్లకి రక్తాభిషేకాలు చేస్తున్నారు....

    English summary
    Tollywood fan war among est two people took sad turn recently when one ended up killing the other even after that there is no change in Pwan and NTR Fans
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X