twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దెబ్బలు తగిలాకే మారా, చెప్పి చెప్పి విసుగొచ్చేసింది,మాడు మగిలింది : ఎన్టీఆర్

    By Srikanya
    |

    హెదరాబాద్: నేను వండేది నా కోసం కాదు కదా. ప్రేక్షకులకు నచ్చాలి. వాళ్లకు నచ్చితే మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటాం. లేదు మేం ఇలాంటి సినిమాలే చేస్తుంటాం... మీరు చూడండి అంటే చెంపదెబ్బలు పడతాయి. అలాంటి దెబ్బలు నాకూ తగిలాయి. అప్పుడే కదా నేనూ మారాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

    మాకేదో స్టార్‌డమ్‌ ఉంది... మేం స్టార్‌ హీరోలం అని మేం అనుకొంటుంటాం. నిజానికి అలాంటిదేం లేదు. కానీ దాన్ని కూడా మనమే నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవాలంటే మంచి కథలు ఎంచుకోవాలి. 'నాన్నకు ప్రేమతో' సినిమా అదే కదా? అది నా సినిమాలా ఉండదు. కానీ నేనేం ప్రేక్షకుల్ని ముందుగా ప్రిపేర్‌ చేయలేదు. 'కష్టపడి తీశాం... ఎలాగున్నా మీరు చూడాల్సిందే' అనలేదు. వాళ్లకు నచ్చింది, చూశారు అన్నారు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారెజ్' సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని మరో రేపు థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రక్కన కొరటాల శివ, మరో ప్రక్క ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యాంశాలు అందిస్తున్నాం.

    స్లైడ్ షోలో ఎన్టీఆర్ ఇంటర్వూలో ని ముఖ్యాంశాలు

    హ్యాండిల్ చేయలేకపోయా

    హ్యాండిల్ చేయలేకపోయా

    సినిమాలన్నీ తీసి పక్కన పెట్టేస్తే 17 ఏళ్ల సమయంలో హిట్టు చూశా. 20 ఏళ్లకు సింహాద్రిలాంటి సినిమా వచ్చింది. అప్పుడు చిన్న పిల్లాడ్ని. ఆ విజయాల్ని సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయా. దాంతో దేవుడు, సమాజం ఒక్కసారి తలపై మొట్టికాయలు మొడితే... అర్థం చేసుకొన్నా అంటున్నారు ఎన్టీఆర్.

    వివరణ ఇష్టం లేదు

    వివరణ ఇష్టం లేదు

    అలాగే...జరిగిపోయిన దాని గురించి వివరణ ఇచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఈరోజులో ఉండడమే నాకిష్టం. ఆశ అనే చిన్న గీతపై బతుకుతున్నాం.

    అప్పుడే హాయిగా

    అప్పుడే హాయిగా


    ‘ఇక చాలు' అనుకొన్నప్పుడు హాయిగా చనిపోవాలి. ఇదేం వేదాంతం కాదు. నా జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు, నేర్చుకొన్న పాఠాలూ ఇవే చెప్పాయి అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

    స్టార్ ని కాదు

    స్టార్ ని కాదు


    ఓ కథ వింటున్నప్పుడు నేను స్టార్‌ అనే విషయం నాకు గుర్తుండదు. ఇన్ని స్టార్లు ఉంటే ఇంత గొప్ప హీరో అంటూ కొలతలు ఎందుకు? నటులకే వివిధరకాలైన పాత్రలు పోషించే అవకాశం వస్తుంది. మేం కూడా ఆ స్థాయికి వెళ్లాలి. కనీసం ఆ ప్రయత్నాలు చేయాలి. నా వరకూ నేను ఆ దారిలో నడుస్తున్నా.

    పాడైపోయింది అనుకోకూడదు

    పాడైపోయింది అనుకోకూడదు

    టెంపర్‌, నాన్నకు ప్రేమతో... ఇప్పుడు జనతా గ్యారేజ్‌ అలాంటి కథలే కదా? భవిష్యత్తులోనూ నా కథల ఎంపిక ఇలానే ఉంటుంది. ఎన్టీఆర్‌ చేసినందుకే ఈ సినిమా పాడైపోయింది అనుకోకూడదు. ఎన్టీఆర్‌ చేశాడు కాబట్టే ఇంత బాగుంది అనుకోవాలి. అది నా స్వార్థం.

    అనవసరమైన ఒత్తిడి

    అనవసరమైన ఒత్తిడి

    ఈ నెంబర్‌ గేమ్‌, వసూళ్ల గోల అనవసరమైన ఒత్తిడి పెంచేస్తోంది. మంచి కథ చేయాలి అనే ఆలోచనను చంపేసి.. బాగా డబ్బులొచ్చే సినిమా చేయాలి అనే దిశగా అడుగులేస్తున్నామేమో అనిపిస్తోంది''

    విసుగొచ్చేసింది

    విసుగొచ్చేసింది

    తెలుగు దేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నానా, దూరంగా ఉన్నానా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. అప్పట్లో పార్టీ కోసం ప్రచారం చేశా. నా బాధ్యత అయిపోయింది. సినిమాల్లో పడిపోయా. చెప్పా కదా... నాకు అన్నింటికంటే నటనే ముఖ్యమని. నటుడిగా కొనసాగడమే నాకిష్టం.

    మాడు పగిలింది

    మాడు పగిలింది

    చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయాలనే ఉంది. కానీ లోపల ఓ భయం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో యమదొంగ చేశా. మంచి ఫలితమే వచ్చింది. మధ్యలో మరోసారి ట్రై చేస్తే మాడు పగిలిపోయింది (నవ్వుతూ). మంచి కథ దొరికినప్పుడు, చేస్తే బాగుంటుందన్న నమ్మకం కుదిరినప్పుడు చేస్తా.

    తాతగారి జీవిత చరిత్ర

    తాతగారి జీవిత చరిత్ర

    బయోపిక్‌ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి తాతగారు. నాకు చాలా చాలా స్ఫూర్తినిచ్చారు. చేస్తే... ఆయన పాత్రే చేయాలి. కానీ చేయను. ఇప్పుడే కాదు, ఓ పదేళ్ల తరవాత మీరు ఈ ప్రశ్న అడిగినా ఇదే చెప్తా.

    వక్కంతం వంశీతో సినిమా గురించి..

    వక్కంతం వంశీతో సినిమా గురించి..

    అది చర్చల దశలో ఉంది. ఇంకా ఏం అనుకోలేదు. ‘జనతా..' తరవాత కొంత విరామం తీసుకొంటా. ఆ తరవాతే.. కొత్త సినిమా గురించి ఆలోచిస్తా.

    గౌరవించండి

    గౌరవించండి

    ప్రకృతిని ప్రేమించకపోయినా ఫర్వాలేదు. కనీసం గౌరవించండి. మనకంటే విద్వత్తు ఎక్కువ ఉన్న వ్యక్తి ఎదురైతే ఏం చేస్తాం? గౌరవిస్తాం. మరి ప్రకృతి మనకంటే ఎన్ని రెట్లు గొప్ప? ఈ సృష్టిలో మూడొంతుల నీళ్లు, ఒక్క వంతు మాత్రమే భూమి ఉన్నాయి.

    అదే చెప్తూంటా

    అదే చెప్తూంటా

    నీళ్లొచ్చి భూమిని మింగేయడానికి ఎంత టైమ్‌ కావాలి? భూమి విలువ, నీటి విలువ, మొక్కల విలువ మనకు తెలియాలి. ప్రకృతితో ఎలా బతకాలో అర్థం చేసుకోవాలి. అది మన సామాజిక బాధ్యత. చిన్నపిల్లలకు తెలియజెప్పాలి. నేనైతే అభయ్‌కి వీలున్నప్పుడల్లా ఈ విషయాలు చెబుతుంటా''

    English summary
    Ntr talked..."The beauty of Janatha Garage is no actor can dominate the film. Neither me, nor Mohanlal. We are all actors doing our parts for the larger concept called Janatha Garage. It’s a place where anything and everything is repaired, from vehicles to relationships."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X