twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుపతిలోనే బాహుబలి ఆడియో వేడుక, ఇదిగో ఏర్పాట్లు (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఆడియో లాంచ్ తేదీ, వేదిక ఖరారైంది. ఈ చిత్ర ఆడియో వేడుక తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో ఈ వేడుక ప్లాన్ చేసారు.

    వాస్తవానికి ఈ ఆడియో వేడుక మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్‌లో జరుగాల్సి ఉంది. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా ఆడియో వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక వాయిదా వేసి అభిమానులకు కారణం వివరించి క్షమాపణలు చెప్పారు రాజమౌళి, ప్రభాస్.

    OFFICIAL: Baahubali Audio Launch On June 13

    చివరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్ లో ఆడియో వేడుక ప్లాన్ చేసారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లభించడంతో గ్రౌండ్ లో చిన్న పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ పూజలో రాజమౌళి తనయుడితో పాటు నిర్మాత ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు.

    OFFICIAL: Baahubali Audio Launch On June 13

    ‘బాహుబలి' ఆడియో వేడుకలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం. 250 కోట్ల ఖర్చుతో...రెండు భాగాలుగా తెరకెక్కుతోది. తొలి భాగం జులై 10న ‘బాహుబలి - ది బిగినింగ్' పేరుతో తెరకెక్కుతుంది. రెండో భాగం 2016లో విడుదల కానుంది.

    English summary
    Finally, the much awaited audio release of Rajamouli's magnus opus, Baahubali is going to happen soon. Accommodating thousands of fans at one place, the audio launch function will take place at Tirupati on June 13.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X