Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇదే ప్యామిలీతో మరో సినిమా చేయాలని ఉంది: నాగ చైతన్య
హైదరాబాద్: నాగ చైతన్య హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం' చిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిదంటూ ఆ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య, పూజా హెడ్గే, విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్, సుమన్, సత్యం రాజేస్, మధునందన్, అమిత్ కుమార్, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల, కెమెరామెన్ ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ...‘ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది లవ్ స్టోరీయే కాదు. మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ రావాలంటే మంచి ఫ్యామిలీ ఉండాలి. థాంక్యూ టు ‘ఒక లైలా కోసం' ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ 25వ చిత్రానికి ఇలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం. ఇదే ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చేయాలని ఉంది' అన్నారు.
హీరోయిన్ పూజ హెడ్గే మాట్లాడుతూ...‘ఒక బ్యూటిఫుల్ మూవీలో అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద బేనర్లో చెయ్యడం మరింత ఆనందాన్ని కలిగించింది. ఇండస్ట్రీని అందరి నుండి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాని ఆరు సార్లు చూసాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో అంతా చాలా ఎంజాయ్ చేసాం. నాగ చైతన్య మంచి కోస్టార్' అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ...‘నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు దాటి పోయింది. కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇలాంటి బేనర్లో నటించాలని అందరికీ ఉంటుంది. ఏదో ఒక సినిమా తీసేద్దాం అని కాకుండా మంచి సినిమాలు తీయాలని ఈ బేనర్ పెట్టారు. ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు' అన్నారు.
అలీ మాట్లాడుతూ..‘ఈ సినిమాకి నాగార్జున గారు, కొండా విజయ్ కుమార్ గారు, అనూప్ రూబెన్స్, కెమెరామెన్ ఆండ్రూ నాలుగు స్తంబాల్లా ఉండి ఇంత మంచి సినిమా చేసారు. నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, ఇపుడు నాగ చైతన్యతో కలిసి నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి థాంక్స్' అన్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముందుగా నాగార్జున గారికి, చైతుకి థాంక్స్ చెబుతున్నాను. ఈ రోజుల్లో ఐటం సాంగ్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా మొత్తం ఫ్యామిలీ చూడగలిగే మంచి స్క్రిప్టు చెప్పగానే చాలా బాగుంది విజయ్ మనం చేస్తున్నాం అని ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ సినిమా విజయానికి పాటు పడిన ప్రతి ఒక్కరికీ థాంక్స్' అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ...ఈ సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరి సపోర్టుతో ఈ ఆడియో చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.