»   » నాగచైతన్య, సిద్ధార్థ, సునీల్ హన్సిక OKOK

నాగచైతన్య, సిద్ధార్థ, సునీల్ హన్సిక OKOK

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఉదయనిధి స్టాలిన్, హన్సిక నటీనటులుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం OKOK(ఒరుకల్ ఒరు కన్నాణి). ఏప్రిల్‌లో విడుదలైన ఈచిత్రం మంచి విజయం సాధించడంతో తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి 'ఓకే ఓకే' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోస్ నాగచైతన్య, సిద్ధార్థ, సునీల్, దర్శకులు వివి వినాయక్, నందినీ రెడ్డి, మల్టీ డైమన్షన్ రామ్మోహన్‌ రావు, నిర్మాత బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వివి వినాయక్ తొలి సీడీని ఆవిష్కరించి నాగచైత్యకు అందించారు.

ఈ చిత్రం హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేస్తున్నాం. తమిళంలో సక్సెస్ అయినట్లుగానే తెలుగులోనూ మంచి హిట్టవుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు. వివి వినాయక్ మాట్లాడుతూ... దర్శకుడు రాజేష్ సినిమాలు చాలా ఫన్నీగా బాగుంటాయి. హారిష్ జైరాజ్ ఏ చిత్రం తీసినా మ్యూజికల్‌గా ఫెయిల్ కాలేదు. హీరో ఉదయ్‌కి ఈచిత్రం తెలుగులో మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జూనియర్‌ 'ఖుష్బూ'గా పేరు తెచ్చుకున్న హన్సిక తమిళనాట మంచి క్రేజ్ సంపాదించింది. అనతి కాలంలోనే అక్కడ నాలుగు సినిమాలు చేసి ఊహించనంత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 'ఓకెఓకె' చిత్రంతో హిట్‌ అందుకుని హీరోయిన్ల రేసులో నంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగేసింది. మరి తెలుగులో హన్సిక ఓకే ఓకే అదృష్టం ఎలా ఉందో చూడాలి.

English summary
The audio release of Udhayanidhi Stalin, Hansika-starrer OKOK (Oru Kal Oru Kannadi) has been launched in a grand way in Novotel, Hyderabad. OKOK, which was released in April this year, was a big hit in Tamil and now the film is being dubbed into Telugu by Bellamkonda Suresh.
Please Wait while comments are loading...