twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ డాన్స్ కు ముసలావిడ ఇరగతీసే స్టెప్స్ (ఫన్నీ వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ అంటేనే స్టెప్స్ ఇరగతీస్తాడు. ఆ స్టెప్స్ కు ఊగిపోని వాళ్లు ఎవరు ఉంటారు. అయితే యూత్ లో అలాంటి సెన్సేషన్ కలిగిందంటే సహజం. అయితే ఇక్కడ వీడియోలో మీరు చూడబోయే మామ్మగారు ఈ వయస్సులోనూ అల్లు అర్జున్ డాన్స్ లను టీవీలో చూస్తూ స్టెప్స్ వేస్తోంది. అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం రేసు గుర్రంలోని సినిమా చూపిస్తమామా పాటకు ఆవిడ ఇలా డాన్సింగ్ పోగ్రాం పెట్టుకుంది. ఈ వీడియో వాట్సప్ లో హల్ చల్ చేస్తోంది. దానిపై టీవి నైన్ వాళ్లు పోగ్రాం చేసారు. ఇప్పటికీ మీరు దాన్ని చూడకపోతే... ఫన్నీగా, సరదాగా ఉండే ఈ పెద్దావిడ డాన్స్ ని ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి విషయానికి వస్తే...

    అల్లు అర్జున్ నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాన్ని వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మరో వారం లేటుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం గోపీచంద్ నటించిన ‘జిల్'చిత్రం ఈ నెల 27న విడుదల కావడమే అని టాక్.

    గత కొద్ది రోజులుగా కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు.దాంతో ఈ సినిమాకు సంభందించినంత వరకూ దాదాపు అల్లు అర్జున్ పని పూర్తిగా పూర్తైనట్లే. అతి కొద్ది రోజుల్లో మిగతా నటీనటుల డబ్బింగ్ పనులు కూడా దాదాపు పూర్తవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది.

    Old women funny dance for allu arjun song

    ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ''జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' దానికి నాలుగు రెట్లు విజయం సాధిస్తుంది''అన్నారు.

    సమంత చెబుతూ ''ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. అల్లు అర్జున్‌తో తొలిసారి నటించాను. హార్డ్‌వర్క్‌ అనే పదానికి నిర్వచనం ఆయన'' అంది. ఉపేంద్ర మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత మళ్లీ తెలుగులో నటించా. చాలా మంచి పాత్ర దక్కింది. బన్నీ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. తనదైన స్త్టెల్‌తో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకొన్నాడ''న్నారు.

    ''నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలు'' అన్నారు త్రివిక్రమ్‌.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదు.. అని హరీష్‌ శంకర్‌ ఓ డైలాగ్‌ రాశాడు. త్రివిక్రమ్‌ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్‌ ఉన్నవాడికి మ్యాజిక్‌తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయ''న్నారు.

    సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    Watch: 90 Year Old Woman moves to Allu Arjun Race Gurram Song watch here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X