twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున, రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్... (ఓ నమో... ఆడియో వేడుక)

    అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం ఆడియో వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం ఆడియో వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది.

    ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథుతులుగా హాజరైన బాహుబలి నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ట్రైలర్ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ విడుదల చేసారు.

    ఈ సందర్భంగా.... కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ వేంక‌టేశ్వ‌ర‌స్వామి చాలా కోరిక‌లు తీరుస్తుంటాడు. అలాగే నాకు కూడా స్వామి చాలా కోరిక‌లు తీర్చాడు. గొప్ప త‌ల్లిదండ్రుల‌నిచ్చాడు. గొప్ప కుటుంబాన్నిచ్చాడు. గొప్ప సినిమాలు చేసే అవ‌కాశం ఇచ్చాడు. అంద‌రి హీరోలతో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చాడు. ఇవ‌న్నీ స్వామి చేసిందే త‌ప్ప, నేను చేసింది కాదు. కొన్ని కొన్ని స్వామి అడ‌గ‌కుండానే ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు.

    చేస్తానని అనుకోలేదు కానీ...

    చేస్తానని అనుకోలేదు కానీ...

    అన్న‌మ‌య్య సినిమా నేను చ‌స్తాన‌ని అనుకోలేదు. శ్రీరామ‌దాసు సినిమా చేస్తాన‌ని అనుకోలేదు. అంతా స్వామి ద‌య వ‌ల్లే వ‌చ్చింది. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు రెండు భ‌క్తుల క‌థ‌లే. అడ‌క్కుండానే అన్ని ఇచ్చిన స్వామికి ఏం చేయ‌లేద‌నే బాధ ఉండేది. అప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా తీస్తే ఎలా ఉంటుంద‌ని అనుకున్న‌ప్పుడు భార‌విగారు ఈ సినిమా కథతో నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. దేవుడు సినిమాలే చేస్తాన‌ని అనుకునే మ‌హేశ్ రెడ్డిగారిని నిర్మాత‌గా ఇచ్చారు అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.

    నాగార్జున చూపులతోనే చూడాలనేంత

    నాగార్జున చూపులతోనే చూడాలనేంత

    దేవుడు క‌న‌ప‌డాలంటే నాగార్జున చూపుల‌తో చూడాల‌నేంత గొప్ప‌గా నటించారు. అలాగే అనుష్క గొప్ప భ‌క్తురాలి పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అన్నీ కుదిరింది సౌర‌భ్ జైన్‌ను చూసిన త‌ర్వాత యూనిట్ అంద‌రూ అత‌నే వేంక‌టేశ్వ‌రుడు అనేలా చేశారు. కీర‌వాణిగారు అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. కీర‌వాణి లేకుండా ఈ సినిమా చేసేవాడిని కాను. త‌న సంగీత‌మే ఈ సినిమాకు సోల్‌. విక్ర‌మ్‌కుమార్ గౌడ్ కూడా నిర్మాణంలో స‌పోర్ట్‌గా నిలిచారు. అంద‌రూ డ‌బ్బు క‌న్నా భ‌క్తితో చేశారు అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

    జెకె. భారవి

    జెకె. భారవి

    జె.కె.భార‌వి మాట్లాడుతూ....ఓ నమో వెంకటేశాయ కథ చెప్పడానికి నాగార్జున‌ గారి వద్దకు వెళ్లినపుడు ఆయన క‌థ విన‌డానికి ఒప్పుకోలేదు. అన్న‌మ‌య్య కంటే వేంక‌టేశ్వ‌ర‌స్వామికి గొప్ప భ‌క్తుడెవ‌రుంటారు. గొప్ప క్లైమాక్స్ అన్న‌మ‌య్య కంటే ఎక్క‌డ ఉంటుంద‌ని అన్నారు. మా కోరిక మేరకు కథ విన్నారు. వెంటనే అంగీకరించారు. అన్న‌మ‌య్య కంటే గొప్పగా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది కాబట్టే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ప‌దేళ్ళుగా ఈ క‌థ త‌యార‌వుతుంది అని చెప్పుకొచ్చారు

    ఈ సినిమా చేయ‌డం నా కోసం కాదు

    ఈ సినిమా చేయ‌డం నా కోసం కాదు

    అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ``నాకు ఇష్ట‌మైన వాళ్ళంద‌రితో ఈ సినిమాలో ప‌నిచేశాను. ఈ సినిమాకు ప‌నిచేయడం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అడుగులేస్తున్న సంద‌ర్భంలో నాకు ఆఖ‌రిపోరాటం అనే సినిమానిచ్చి న‌న్ను నిల‌దొక్కుకునేలా చేశారు రాఘ‌వేంద్రరావుగారు. అక్క‌డి నుండి ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉంది. అన‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి సినిమాలు తీశారు. ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమా చేశారు. ఈ సినిమా చేయ‌డం నా కోసం కాదు. ఈ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేస్తానో లేదో అనుకుని చేశాను. నాన్న‌గారి కోసం మ‌నం పెద్ద హిట్ కావాల‌ని ఎంత బాగా కోరుకునే వాడినో నాకు తెలుసు. చివ‌ర‌కు మ‌నం పెద్ద క్లాసిక్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకున్నాను అని నాగార్జున అన్నారు.

    వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తాను

    వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తాను

    చిన్న‌ప్ప్పుడు అమ్మ‌తో తిరుమ‌ల‌కు వెళ్లాను. త‌ర్వాత నా సినిమాలు విడుద‌లైన‌ప్పుడంతా తిరుమ‌ల‌కు వెళ్లేవాడిని. అలా ఆయ‌న‌తో ప‌రిచయం బాగా ఏర్ప‌డింది. వేంక‌టేశ్వ‌ర స్వామిని నేను స్నేహితుడిగానే చూస్తాను. నేను ఎప్పుడు ఆయ‌న గుడికి వెళ్లినా అంద‌రూ బావుండాల‌నే కోరుకుంటాను అన్నారు నాగార్జున

    అమ్మను తీసుకెళ్లిపో అన్నాను

    అమ్మను తీసుకెళ్లిపో అన్నాను

    ఆయ‌న్ను ఓ కోరిక కోరుకున్న సంద‌ర్భం అమ్మ విష‌యంలోనే జ‌రిగింది. అమ్మ‌కు ఆరోగ్యం బాగా లేక చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ప్పుడు ఆవిడ అంతా మ‌రిచిపోయింది. న‌న్ను కూడా గుర్తు ప‌ట్టలేదు. నేను బెంగ‌ళూరు వెళ్ళాల్సి వ‌చ్చింది. నేను అమ్మ‌ను తీసుకెళ్లిపో స్వామి అని వేంక‌టేశ్వ‌రునికి మొక్కుకున్నాను. నేను ఫ్లైట్ దిగానో లేదో అమ్మ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింద‌ని ఫోన్ వ‌చ్చింది. అలా అమ్మ బాధ నుండి తీసుకెళ్లిపోయారు. నాన్న‌గారి కోసం చేసిన మ‌నం సినిమా హిట్ కావాలి స్వామి..నేను చేయాల్సిన ప్ర‌య‌త్నం అంతా చేస్తాన‌ని మొక్కు కున్నాను. అది కూడా నాకు ప్ర‌సాదించారు. అలాగే ఇద్ద‌రి అబ్బాయిల‌కు పెళ్ళి కుదిరింది. అలాగే తెలుగువారి అభిమానాన్ని కూడా నాకు ఇచ్చారు. అందుకే వేంక‌టేశ్వ‌రుని థాంక్స్ అని నాగార్జున వ్యాఖ్యానించారు.

    నాగ్ తో ఇలాంటి సినిమా ఊహించలేదు

    నాగ్ తో ఇలాంటి సినిమా ఊహించలేదు

    అనుష్క మాట్లాడుతూ ...నేను 2004లో నాగార్జునగారితో ముందుగా కలిసింది రాఘవేంద్రరావుగారినే. చాలా గొప్ప దర్శకుడాయన. రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తానని అనుకోలేదు. అది కూడా ఆధ్యాత్మిక పాత్రలో నాగార్జునగారితో కలిసి నటిస్తానని అనుకోలేదు. సినిమాలో నా పాత్ర అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.

    జగపతి బాబు

    జగపతి బాబు

    జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ....ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలో చేసింది చిన్న క్యారెక్ట‌ర్‌. ఈ సినిమాలో నాకు ఓ సాంగ్‌ను అనుష్క‌తో ఇచ్చారు. నాగార్జున నా మిత్రుడు, త‌న‌తో చిన్న పాత్ర చేయ‌డానికైనా నేను రెడీయే. ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను అన్నారు.

    సంగీత దర్శకుడు

    సంగీత దర్శకుడు

    యం.యం.కీరవాణి మాట్లాడుతూ... ``అన్నమయ్య, శ్రీరామదాసు ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాల జ‌ర్నీ చూస్తుంటే రాఘవేంద్రరావు, నాగార్జున‌గారితో తెలుసా మ‌న‌సా ఇది ఏనాటి అనుబంధ‌మో పాట పాడాల‌నిపిస్తుంది. ఈ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

    నిర్మాత

    నిర్మాత

    చిత్ర నిర్మాత ఎ.మ‌హేశ్ రెడ్డి మాట్లాడుతూ ``వేంక‌టేశ్వ‌ర స్వామి మా కుల‌దైవం. ఆయ‌నపై ఈ సినిమా తీసే అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్రరావు, నాగార్జున‌గారు, కీర‌వాణిగారికి ధ‌న్య‌వాదాలు. ఇది మ‌రో అన్న‌మ‌య్య‌. అన్న‌మ‌య్య కంటే అద్భుతంగా ఉంటుంది. అన్న‌మ‌య్య సినిమా రిలీజైన‌ప్పుడు భ‌క్తులు పెరిగార‌ని తిరుప‌తి దేవ‌స్థానం వారే చెప్ప‌డం జ‌రిగింది. మా న‌మోవేంక‌టేశాయ చిత్రంలో వేంక‌టేశ్వ‌ర స్వామి గురించి, ఆయ‌న‌కు చేసే కొన్ని పూజ‌లు గురించి చెప్పాం. ఈ సినిమా ద్వారా స్వామితో ఓ భ‌క్తుడు ఎలాంటి ఆట ఆడుకుంటాడు, ఏమవుతుంద‌నేదే క‌థ‌... అందరికీ నచ్చుతుంది అన్నారు.

    English summary
    Photos of Telugu Movie Om Namo Venkatesaya Audio Launch event held at Hyderabad. Akkineni Nagarjuna, Anushka Shetty, Amala Akkineni, Akhil Akkineni, Naga Chaitanya and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X