twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ ఒక ఇడియట్ , విధు వినోద్ చోప్రా అలా ఎందుకన్నాడు ??

    |

    అమీర్ ఖాన్ ప్రత్యేకం. అందరికంటే ప్రత్యేకం. అందరూ నడుస్తారు. నువ్వూ నడుస్తావు. అందరూ ఎక్కడికి వెళతారో, నువ్వూ అక్కడికే వెళతావు! నువ్వో గుంపులో గోవిందయ్యవు! నలుగురిలో నారాయణవు! అమీర్ ఖాన్ స్టార్స్‌లో స్టార్‌లా కలిసిపోలేదు. నేను, నా సినిమాలు, నాకొచ్చే వందల కోట్ల రూపాయల పారితోషికం!... అంటూ వాటికే పరిమితం కాలేదు. కొంచెం పక్కకు జరిగాడు. ప్రత్యేకంగా మెరుస్తున్నాడు. ఇప్పుడు ఏ మ్యాగజైన్ తిప్పినా, ఛానల్‌లో చూసినా అమీర్ పేరు గొప్పగా వినిపిస్తోంది! మరి ఆయనలో ఏదో ఉన్నట్లే కదా! ఏదో కాదు! చాలానే ఉంది

    ఆమిర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్"... ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమిర్ పై పొగడ్తల వర్షాలు కురుస్తున్నాయి మరో పక్క యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ దుమ్ములేపేస్తోంది. ప్రముఖ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనుకోవటమే ఒక సాహసం అనుకుంటే 51 ఏళ్ల వయసులో తన శరీరాన్ని మరింతగా కష్టపెటి మరీ ఆ సినిమాకి కావాల్సిన విధంగా తీర్చి దిద్దుకోవటం అంటే మాటలు కాదు... ఎందరు ఎన్ని రకాలుగా పాత్రల కోసం కష్తపడ్దా అమీర్ డెడికేషన్ వేరు. ఈ సమయంలో ఆమిర్ ఖాన్ ను "ఇడియట్" అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా.

    Only an 'Idiot' Like Aamir Khan Could Make Dangal

    "ఇలాంటి సినిమాలు పిచ్చోళ్లు మాత్రమే చేస్తారు.. ఇంకా చెప్పాలంటే ఆమిర్ ఖాన్ ఒక ఇడియట్..." అంటూ వింతగా స్పందించాడు విధు వినోద్ చోప్రా.. నిజానికి ఇవి కోపం తో అన్న మాటలు కావు అమీర్ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ చెప్పిన మాటలే. 51ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ ఒక రెజ్లర్ పాత్రలో నటించడమంటే చిన్న విషయం కాదని తనకు సినిమాలంటే పిచ్చి అని అతడు "త్రీ ఇడియట్స్"లో చేసినప్పటి నుంచి తాము ముద్దుగా ఇడియట్ అని పిలుచుకుంటామని చెబుతున్నారు వినోద్ చోప్రా. జీవితంలో బాగా డబ్బు సంపాదించి అనంతరం మరణించినా మన గురించి ఎవరూ గుర్తుపెట్టుకోరు కనీ.. ఇలా ఒక ప్యాషన్ తో పనిచేస్తే మాత్రం ఎన్ని తరాలైనా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుగా దమ్ము ఉండాలని వినోద్ చోప్రా అభిప్రాయపడ్డారు.

    కాగా మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్ బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా తయారు చేసారు. ఈ ఇద్దరు సోదరీ రియో ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ గతంలో నటించిన పీకే 3 ఇడియట్స్ సినిమాలకు విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు దాంతో ఈ సినిమాపై ఆమిర్ ను ఇలా ప్రశంసించారు. అలాగే విడుదలయిన ఒక్కరోజులోనే ఈ "దంగల్" ట్రైలర్ కు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి.

    English summary
    Filmmaker Vidhu Vinod Chopra says a person who is crazy for the art of acting can pull off character like Aamir Khan's in Dangal. He praised the 51-year-old actor for excelling in preparing for the role of wrestler Mahavir Singh Phogat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X