twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున-కార్తి మల్టీ స్టారర్ ‘ఊపిరి’ రిలీజ్ డేట్ మారింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఊపిరి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను ఇంతకు ముందు ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం రిలీజ్ డేట్ మార్చి 25కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కావడంతో ‘ఊపిరి' చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి.

    Oopiri Movie Releasing on 25th March

    ఈ సినిమా గురించి నాగార్జున ఆ మధ్య మాట్లాడుతూ... ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.

    ''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.

    ''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

    English summary
    King Nagarjuna starrer forthcoming multistarrer movie “Oopiri” is near the completion of the shoot and is being directed by Vamshi Paidipally. According to the latest update, the makers are planning to release the movie 25th March 2016 in a very grand manner. Actor Karthi and Tamannah Bhatia are playing the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X