twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున, కార్తి పొంతనలేని స్టేట్మెంట్స్....ఏది నిజం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ పి.వి.పి నిర్మించారు. ఈనెల 25న ఊపిరి చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమవారం హైరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

    అయితే 'ఊపిరి' సినిమా విషయంలో నాగార్జున, కార్తి పొంతన లేకుండా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. నాగార్జున మాట్లాడుతూ ఇది ఓ ఫ్రెంచి చిత్రం రీమేక్ అని ప్రకటించాడు. తర్వాత మైక్ అందుకున్న కార్తి దీన్ని రీమేక్ కాదు, అలా అనొద్దు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

    నాగార్జున మాట్లాడుతూ ''ఊపిరి ఫ్రెంచ్ ఫిలిం రీమేక్. తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఇది. తొలిసారి తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పాను. త‌మిళ‌నాడులో న‌న్ను ఎంత‌గానో రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ట్రూ స్టోరి ఇది. ఇంకా వాళ్లు బ‌తికే ఉన్నారు. కొన్నిసోల్ ఉన్న కథలు ట‌చ్ చేస్తాయి, అటువంటి కథే ఊపిరి. నేను ఫ్రెంచ్ మూవీ చూసినప్పుడు తెలుగులో ఎవరైనా ఈ సినిమా చేసి ఈరోల్ నాకు ఇస్తే బాగుంటుందనుకున్నాను. నా కోరిక దేవుడు విన్నాడేమో ఈ క‌థ నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది. ఈ క‌థలోకి అలాగే కార్తీ వ‌చ్చాడు. హీరోయిన్ గా ఎవ‌ర్నో అనుకుంటే త‌మ‌న్నా వ‌చ్చింది. క‌థే మ‌మ్మ‌ల్ని ఎంచుకుంది అంటూ నాగార్జున వ్యాఖ్యానించారు.

    నిర్మాతకు కష్టమే...

    నిర్మాతకు కష్టమే...

    ఒక నిర్మాత‌గా చెబుతున్నాను ఇలాంటి క‌థ‌తో సినిమా తీయ‌డం అంటే నిర్మాత‌కు క‌ష్టం. పి.వి.పి ఎంతో ఇష్టంతో ఈ సినిమాని నిర్మించారు అని నాగార్జున అన్నారు.

    తమిళంలో డబ్బింగ్

    తమిళంలో డబ్బింగ్

    కార్తీ తెలుగులో డైలాగ్స్ చెప్పే విధానం చూస్తుంటే నేను ఎందుకు త‌మిళ్ డైలాగ్స్ చెప్ప‌లేక‌పోయాన‌ని సిగ్గుప‌డేవాడిని. నిన్న‌నే ఊపిరి సినిమా చూసాను. ఒక మంచి సినిమా చేసినందుకు తృప్తిగా..సంతోషంగా ఉంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు నా కెరీర్ లో లైఫ్ ఛేంజింగ్ ఫిల్మ్ ఊపిరి అన్నారు.

    హీరో కార్తీ మాట్లాడుతూ...

    హీరో కార్తీ మాట్లాడుతూ...

    తెలుగులో నా ఫ‌స్ట్ స్ట్రైయిట్ ఫిలిమ్ ఊపిరి. ఈ సినిమా అంతా ఒక డ్రీమ్ లా జ‌రిగింది. నాగ్ సార్ ఒక మెచ్యూర్ క్యారెక్ట‌ర్ పోషించారు. ఈ సినిమా జర్నీలో ఆయనతో ఒక రిలేష‌న్ షిప్ ఏర్ప‌డింది. ఇది రీమేక్ కాదు. దాదాపు 50 కొత్త సీన్స్ తో తీసిన సినిమా ఇది అన్నారు.

    డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ

    డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ

    న్న‌నాగార్జున ఊపిరి సినిమా చూసి రాగానే నన్ను హత్తుకుని బాగా చేశావని అభినందించారు. ఈ సినిమా. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. పి.వి.పి గారు మ‌న‌సుపెట్టి ఈ సినిమాని నిర్మించారన్నారు.

    క్లాసు, మాసు.

    క్లాసు, మాసు.

    నాకు తెలిసి మాస్ సినిమా క్లాస్ సినిమా అని లేవు. నాకు తెలిసింద‌ల్లా ఒక‌టే మంచి సినిమా చెడ్డ సినిమా. నాగార్జ‌న గారికి ప్లాష్ బ్యాక్ పెట్టాల‌నుకున్నాను. కానీ నాగార్జునగారు అలాంటివేం వద్దన్నారు. ఆయ‌న ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ తోనే ఓ కొత్త సినిమా తీసాను అన్నారు వంశీ.

    గ్రాండ్ రిలీజ్

    గ్రాండ్ రిలీజ్

    నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ ఊపిరి సినిమా రెండు సంవ‌త్స‌రాల జ‌ర్నీ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 25న 2,000 థియేట‌ర్స్ లో ఊపిరి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. యు.ఎస్ లో 90 మెయిన్ థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తున్నాం.

    హాలీవుడ్ స్టాండర్డ్స్..

    హాలీవుడ్ స్టాండర్డ్స్..

    హాలీవుడ్ లో తీసిన‌ట్టుగా ఆ స్టాండ‌ర్డ్స్ తో తెలుగులో మ‌నం ఎందుకు సినిమా తీయ‌లేం అనే ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమాని తీసాం. ఊపిరి స‌క్సెస్ క్రెడిట్ అంటే ఏ ఒక్క‌రికో కాకుండా టీమ్ అంద‌రికీ చెందుతుంది అన్నారు నిర్మాత.

    English summary
    Tollywood King Nagarjuna’s upcoming film Oopiri has finally got its release date. The filmmakers confirmed to release Oopiri movie in March 25th, 2016. The film features Nagarjuna, Karthi, and Tamannah in the lead roles. It is Telugu Tamil drama movie which is directed by Vamsi Paidipally and simultaneously being shot in both the languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X