twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక అదే పనిలో ఉంటానని నాగ్ ప్రామిస్, ఏడుపొచ్చిందన్న అఖిల్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

    ఈ నేపథ్యంలో బుధవారం చిత్రయూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దర్శక రత్న దాసరి నారాయణరావు, నాగార్జున, అఖిల్, నిర్మాత నాగసుశీల, కోనవెంకట్, వంశీపైడిపల్లి, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ 'వంశీతో సహా ఊపిరి యూనిట్ సభ్యులందరికీ ముందుగా థాంక్స్. పివిపి రూపంలో మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. నాగచైతన్య సినిమా టైటిల్ సాహసమే శ్వాసగా సాగిపో అనే టైటిల్ నాకు ఎంతో ఇష్టం. నేను చాలా సంవత్సరాలుగా ఆ టైటిల్ లోని మీనింగ్ ను ఫాలో అవుతున్నాను. ఆ సాహసంతోనే గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, మాస్, అన్నమయ్య ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పటి వరకు వచ్చాను. సాహసమే శ్వాసగా సాగిపోలో శ్వాస అభిమానులు. వారే లేకుంటే ఇలాంటి సినిమాలు చేసేవాణ్ణి కాను. ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాం' అన్నారు.

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 'నాగార్జునగారు ఏ నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నారో తెలియదు. ఆయన నమ్మకాన్ని ఫ్యాన్స్, ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ కొత్త జీవితాన్నిచ్చారు. నాగార్జుగారి నమ్మకమే ఈ సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపించింది. కార్తీగారు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన తక్కులే. తమన్నా అందగత్తె కాదు, అమేజింగ్ పర్సన్. నాగార్జునగారు, పివిపి అన్నయ్యే ఊపిరి. ఈ కంటెంట్ ను నమ్మి నాకు నమ్మకాన్ని ఇచ్చినందుకు ఆయనకు పాదాభివందనాలు. ఒక తమ్ముడిలా చూసుకున్నారు' అన్నారు.

    హథీరాంబాబాపై సినిమా

    హథీరాంబాబాపై సినిమా


    తిరుపతి వెంటేశ్వరస్వామి దగ్గరకు కి వెళ్లి హథీరాంబాబాపై కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను. ఈ రెండు నెలలు ఆ సినిమా కోసం రెడీ అవుతున్నాను అన్నారు నాగార్జున.

    చైతు, అఖిల్

    చైతు, అఖిల్


    ఈ రెండు నెలల్లో కళ్యాణ్ కష్ణ, నాగచైతన్యతో ఓ సినిమా మొదలు పెట్టడం, వంశీని, అఖిల్ ను కూర్చోపెట్టి కథను ఫైనల్ చేయించడం కూడా ఈ రెండు నెలల్లో చేయించాలన్నారు నాగ్.

    ఈ ఏడాది అదే పనిలో ఉంటా

    ఈ ఏడాది అదే పనిలో ఉంటా


    నేను ఇంత ముందు వరకు నా ఇద్దరబ్బాయిల మీద మనసు పెట్టలేదు. ఈ ఏడాది అదే పనిలో ఉంటాను. ఇదే నేను అక్కినేని అభిమానులకు ఇచ్చే ప్రామిస్'' అన్నారు.

    అఖిల్

    అఖిల్


    అఖిల్ మాట్లాడుతూ ‘'ఇలాంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చినందుకు వంశీకి థాంక్స్. పివిపిగారు గట్స్ తో పాటు, రిస్క్ తీసుకుని చేసినందుకు ఆయనకు థాంక్స్ అన్నారు.

    ఎమోషనల్, ఏడ్చేసా

    ఎమోషనల్, ఏడ్చేసా


    ఈ సినిమా ఎమోషనల్ జర్నీ. సినిమా చూసి ఏడ్చేశాను. నాన్నగారే మా ఊపిరి. ఈసినిమా చేసినందుకు నాన్నగారికి థాంక్స్'' అన్నారు అఖిల్.

    English summary
    Nagarjuna Akkineni, Tamannaah Bhatia, Akhil Akkineni, Vamsi Paidipally, Prasad V Potluri, Dil Raju, Abburi Ravi, Kona Venkat, Gopi Mohan, Sirivennela Seetharama Sastry, Suma, BVSN Prasad, Dasari Narayana Rao, Nisha, Shreya Vyas and others have graced the event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X