twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్షయ్ కుమార్ చిత్రాన్ని నిషేదించిన పాకిస్థాన్

    By Bojja Kumar
    |

    ముంబై: అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సినిమా 'బాబీ'. ఇదొక యాక్షన్ అండ్ స్పై థిల్లర్ మూవీ. టెర్రరిస్టులను పట్టుకునే ఇండియన్ గూడాచారికి సంబంధించిన సినిమా కథ కావడంతో ఈ సినిమాపై పాకిస్తాన్ నిషేదం విధించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, కరాచీలోని సెన్సార్ బోర్డులు ఈ సినిమా చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ పత్రికి ‘ది డాన్' పేర్కొంది.

    కేవలం సినిమాపై మాత్రమే కాదు....సిడీలు, డీవీడీలపై కూడా నిషేదం విధించారు. అయితే ఈచిత్రం పాకిస్థాన్‌కు ఏ మాత్రం వ్యతిరేకం కాదని దర్శకుడు నీరజ్ పాండే వెల్లడించారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ఏక్ థా టైగర్' చిత్రాన్ని కూడా పాకిస్తాన్ నిషేదించిన సంగతి తెలిసిందే.

    Pakistan Bans Akshay Kumar's Baby Movie

    ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రత్యేక అధికారి పాత్రలో నటించారు. 'మొదట ఈ కథ వినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. తర్వాత బాబీ పేరు ప్రాధాన్యం అర్థమైంది. ఇందులో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నా' అని అక్షయ కుమార్ తెలిపారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'బాబీ'లో అనుమప్ ఖేర్, దగ్గుబాటి రానా, తాప్సీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

    English summary
    Akshay Kumar starrer Baby released worldwide today and the film has been loved and appreciated by all but turns out neighbouring country, Pakistan did not like the movie as much as us. Baby movie is about an Indian spy mission to catch a dreaded terrorist has been banned in Pakistan as the censor board of the country refused to allow the film to be screened.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X