twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ కోరికలు అణుచుకోవడం ఎలా? హీరోయిన్ సలహా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వయసులో ఉన్నపుడు సెక్స్ కోరికలు ఉండటం సహజమే. ముఖ్యంగా యువతలో కోరికలు తారా స్థాయిలో ఉంటాయి. అలాంటపుడు సెక్స్ గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అయితే అతిగా ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు.

    సెక్స్ కోరికలు ఎక్కువైనపుడు ఏం చేయాలనేదానిపై బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. యువతరంలో సెక్స్ కోరికలు ఉండటం సహజమే. నాకు అలాంటి కోరికలు ఉంటాయి. యోగా, మెడిటేషన్ లాంటి వాటి ద్వారా నేను నా కోరికలను కంట్రోల్ లో ఉంచుకుంటున్నాను. మరీ ఎక్కువైనపుడు చన్నీటితో స్నానం చేస్తే సరిపోతుంది' అంటూ సలహా ఇస్తోంది.

    Parineeti Chopra talks about controlling sexual desires

    పరిణీతి సినిమా కెరీర్ గురించి...
    చేసినవి అరడజను సినిమాలు. హీరోయిన్‌గా ఇంకా పూర్తిగా తనను తాను నిరూపించుకోలేదు. చెప్పుకోవడానికి ఖాతాలో గొప్ప హిట్లు కూడా లేవు. అంతలోనే ఏకంగా కొన్ని నెలల పాటు సినిమాలకు విరామం తీసుకోవడానికి ఏ హీరోయిన్ అయినా సాహసం చేస్తుందా?....కానీ చేస్తానంటోంది బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ పరిణీతి చోప్రా.

    ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘కిల్ దిల్' విడుదలయ్యాక పది నెలల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రంలో తన పెర్పార్మెన్స్ పట్ల ప్రేక్షకుల స్పందన తెలుసుకుని, వారి స్పందన బట్టి భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలనుకునేదానిపై నిర్ణయం తీసుకోవడానికే ఇలా చేస్తున్నాను అంటోంది.

    ఈ పది నెలల కాలంలో కొంత కాలం పాటు స్నేహితురాళ్లతో కలిసి ఏదైనా ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేస్తానని, తర్వాత సినిమా రంగంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తానని అంటోంది. అయితే పరిణీతి నిర్ణయం బాలీవుడ్ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వైపు కొందరు హీరోయిన్లు అవకాశాలు లేక ఎదురు చూస్తుంటే....ఇప్పుడిప్పుడే అవకాశాల బాట పడుతున్న పరిణీతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని నివ్వెర పోతున్నారు.

    English summary
    Actress Parineeti Chopra told that doing yoga and taking bath in cold water helps one to control sexual desire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X