twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిచ్చి..పిచ్చిగా వైరల్ అవుతోంది : పరుచూరి చెప్పిన మోడీ నోట్ల రద్దు కథ

    మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదని కితాబిచ్చారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నోట్లరద్దు నిర్ణయంపై ఓ నీతికథను వివరించారు. ఆ కథ ఉన్నది మూడు ముక్కలే అయినా... అందులో చాలా పరమార్థం దాగుంది. ఓ

    |

    ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్న పెద్ద నోట్ల బ్లాక్ మనీ అంతా మోడీ నిర్ణయంతో ఒక్కసారిగా పనికి రాకుండా పోయింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫైనాన్షియర్ల వరకూ అందరికీ దీని స్ట్రోక్ తగిలింది. కోటానుకోట్ల భారీ పెట్టుబడులు పెట్టేసి సినిమా తీద్దామనుకున్నవాళ్లు కాస్తా, బడ్జెట్లను భారీగా తగ్గించేస్తున్నారు. దీంతో పాటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటూ పన్నులు ఎగ్గొడుతూ వచ్చిన స్టార్స్ చాలా మంది, తమ బ్లాక్ మనీని మింగలేక కక్కలేక నానా పాట్లు పడుతున్నారు.

    తాజా సమాచారం ప్రకారం, దాదాపు వెయ్యికోట్లకు పైనే నల్లధనం ఇండస్ట్రీ ప్రముఖుల వద్ద వృథా అవబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి. ఇది కేవలం అంచనా మాత్రమే. వాస్తవం మరిన్ని రెట్లు భారీగా ఉండచ్చు. అయితే, ఇలా నల్లధనం వృథా అవడం వల్ల ఈ కుబేరులకు నష్టం ఉండకపోవచ్చు కానీ, ఇండస్ట్రీలోని డైలీ లేబర్ కు మాత్రం భారీగానే దెబ్బ పడనుంది. నిర్మాతలు తమ ఖర్చు తగ్గించుకునేందుకు డెయిలీ లేబర్ ను వీలైనంతగా తగ్గిస్తున్నారు. మిగిలిన రంగాల్లో కూడా ఇదే పరిస్థితి. చూడబోతే, అటు తిరిగి ఇటు తిరిగి, పెద్ద నోట్ల బ్యాన్ ఎఫెక్ట్ సామాన్యుడికే తగిలేట్టు కనిపిస్తోంది మరి.

    paruchuri gopala krishna story on Demonetisation

    ప్రతి బ్యాంకు ముందు కష్టబడి సంపాదించిన సామాన్యుడే క్యూలో నిలబడ్డాడు. అక్రమాలు చేసి దోచుకున్న 'నల్ల'బాబులు దర్జాగా ఉన్నారు. అందుకు ఉదాహరణగా 'గాలి'వారి పెళ్లి వైభవాన్ని సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నల్లబాబులకు తగలాల్సిన మోదీ బాణం.. సామాన్యులకు తగులుతోందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ నిర్ణయంపై ఇటీవల సినీ ప్రముఖులు చాలా మంది స్పందించారు.

    మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదని కితాబిచ్చారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నోట్లరద్దు నిర్ణయంపై ఓ నీతికథను వివరించారు. ఆ కథ ఉన్నది మూడు ముక్కలే అయినా... అందులో చాలా పరమార్థం దాగుంది. ఓ రైతును ఉదాహరణగా తీసుకుని రెండు లైన్లలో ఒక చిన్న పిట్ట కథని చెప్పారు.

    'చెరువులో మొసలి ఉందని నీళ్లు మొత్తం తోడించేశాడు రైతు!. చేపలు చచ్చిపోయాయి!.. మొసలి పారిపోయింది. ఈ కథలో నీతి ఉంది కనిపెట్టండి.' అంటూ పరుచూరి గోపాలకృష్ణ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎవరో దొంగనోట్లు దాచుకున్నారని.. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే రైతులకెందుకీ కష్టం. కూలి పనికి పోనిదే పూట గడవని సామాన్యుడికెందుకీ కష్టం. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వాళ్లు ఏం పాపం చేశారు.

    మొత్తానికి ఎవరో తార్గెట్ గా వేసిన బాణానికి సామాన్యుడే బలయ్యాడన్న ఉద్దేశం కనబడుతోంది ఈ కథలో. మొసలిని చంపాలంటే ఎరవేసి దాన్ని బయటికి రప్పించాలి గానీ అనాలోచిత చర్యవల్ల చేపలన్నీ చనిపోవటం వరకూ వచ్చింది... ఇప్పుడు నోట్లరద్దు వ్యవహారం కూడా అలాగే ఉందీ అని ఈ కథ ద్వారా చెప్పారన్న మాట...

    English summary
    paruchuri gopala krishna hwo is a senior writer and actor in Tollywood, said a little story about Demonetisation of old Rs 500, Rs 1000 notes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X