twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "బికమింగ్‌ జనసేనాని"...! ఓబామా, జుకర్ బెర్గ్ లు కూడా.... భార్యతో ల్యాండ్ అయిన పవన్

    భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 6.45 గంటలకు పవన్ బోస్టన్‌ చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. ఆహ్వానం కూడా ఘనంగానే అందిందట

    |

    'కాటమరాయుడు' షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవనకల్యాణ్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఈ నెల 11, 12 తేదీలలో ప్రఖ్యాత హార్వార్డ్‌ యూనివర్సిటీలో జరుగనున్న 'ఇండియా కాన్ఫరెన్స్‌ 2017' సమావేశంలో ప్రసంగించడానికి అమెరికాలో ల్యాండ్‌ అయ్యాడు. అమెరికాలోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పవన్‌కు ఘనస్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు పవన్‌ను చూసేందుకు ఎగబడ్డారు.

    పవన్‌తో పాటు ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ గేట్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వంటి మహామహులు హాజరుకానున్నారు. ఏపీలో జనసేనను బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న క్రమంలో ఈ సదస్సులో పాల్గొనే అవకాశం పవన్ రావడం సానుకూల అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ ప్రపంచ వేదిక ద్వారా పవన్ చేసే ప్రసంగం జనసేన బలోపేతానికి సహకారం అందించే అవకాశముంది.

    Pawan To address students of Harvard University on February 12

    ప్రపంచ వేదికపై జన సేనాని ప్రసంగం హార్వర్డ్ వర్సిటీ సదస్సు తర్వాత ఉత్తర అమెరికాలోని భారత సంతతికి చెందిన వారిని పవన్ కలువనున్నాడు.న్యూ హాంఫ్‌షైర్ లోని నాషువా పబ్లిక్ హైస్కూల్ సౌత్ లో జరుగనున్న సభకు వెళ్లేందుకు పలు వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ అనంతరం ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన బోస్టన్‌ చేరుకున్నట్లు పార్టీ మీడియా హెడ్‌ తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు చెప్పారు. ,ఈ నెల 11వ తేదీన హార్వడ్‌ విశ్వవిద్యాలయంలో 'బికమింగ్‌ జనసేనాని' అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. పర్యటనలో చివరి రోజైన 12వ తేదీన కూడా హార్వడ్‌ యూనివర్శిటీలో కీ నోట్‌ను ప్రసంగిస్తారని తెలిపారు.

    కాగా, పవన్‌ ఈ సమావేశాలకు ఖాదీ దుస్తులతోనే హాజరుకానున్నట్టు సమాచారం. బోస్టన్‌ ఎయిర్‌పోర్టులో పవన్‌తోపాటు అతని సన్నిహితుడు శరద్‌ మరార్‌ కనిపించాడు. అంతే కాదు పవన్‌తో కలిసి ఎప్పుడూ బయటకు రాని అతని భార్య అన్నా లెజ్‌నెవా ఈ పర్యటనకు రావడం విశేషం.

    English summary
    On February 11, Pawan Kalyan would address the students of Harvard University on ‘Becoming Jana Senani’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X