twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశ శ్రేయస్సు కోసం తపనపడే వారికోసమే, త్రివిక్రమ్‌కి థాంక్స్: పవన్ కళ్యాణ్ (లెటర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఓ పుస్తకాన్ని స్వయంగా తన ఖర్చులతో రీప్రింట్ చేయించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ పుస్తకం మరేదో కాదు..గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ర‌చించిన మ‌హా గ్రంధం ఆధునిక మ‌హా భార‌తం.

    ఈ పుస్త‌కం గురించి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాన్ని చదివారు. ఈ పుస్తకం చదివిని తర్వాత ఆయనకు ఎంతో నచ్చింది. అయితే ఈ గొప్ప ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో లేక‌పోవ‌డంతో నేటి యువ‌త‌కు ఈ మ‌హా గ్రంధం అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని భావించి ప‌వ‌న్ త‌న ఖ‌ర్చుల‌తో ఈ పుస్త‌కాన్ని ప్రింట్ చేయించాలని నిర్ణయించుకున్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన 'సాత్యకి' , పరిచయం చేసిన మిత్రుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కు కృతఙ్ఞతలు తెలిపారు.

    దీనిపై పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా స్పందిస్తూ..."ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు", అన్న 'మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. 'నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?' అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు 'మహావాక్యం' అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన 'ఆధునిక మహాభారతం' అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన 'మహాకవి' శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన 'సాత్యకి' గారికి నాకు ఈ 'మహాకవిని' పరిచయం చేసిన నా మిత్రుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారికి నా కృతఙ్ఞతలు" అని చెప్పుకొచ్చారు.

    పవన్ స్వయంగా రాసిన లెటర్ ఫోటోస్ స్లైడ్ షోలో...

    ఇదే ఆ లెటర్

    ఇదే ఆ లెటర్

    పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలుపుతూ రాసిన లెటర్ ఇదే..

    ఆధునిక మహాభారతం

    ఆధునిక మహాభారతం

    పవన్ కళ్యాన్ రీ ప్రింట్ చేయిస్తున్న ఆధునిక మహాభారతం పుస్తకం ఇదే..

    బాగానచ్చింది

    బాగానచ్చింది

    ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు", అన్న 'మహాకవి శేషేంద్ర గారి మాటలు పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది.

    అందుకే

    అందుకే

    'ఆధునిక మహాభారతం' అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాన్ బావించారు.

    ఏముంది?

    ఏముంది?

    ఈ ఆధునిక మహాభారతం ...1970 నుంచి 1986 మధ్యకాలంలో ప్రచురించిన గుంటూరు శేషేంధ్ర శర్మ వచన కవితా సంకలనాల సమాహారం. 1984 వరకూ వెలుబడ్డ ఆ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు.

    గొప్ప విషయమే

    గొప్ప విషయమే

    25000 కాపీలు ప్రింట్ అవుతున్నాయి. కామన్ మ్యాన్ కు కూడా ఈ పుస్తకం అందాలని పవన్ ఆలోచించి, ఈ పుస్తకం రీ ప్రింట్ కు సహకరించారని తెలుస్తోంది. గొప్ప విషయం కదూ.

    English summary
    Pawan met the ‘Adhunika Mahabharatam’ author Seshendra Sharma's son a month ago and offered him financial assistance for the re-print of 25000 copies. Pawan Kalyan thanked the author's son for giving him the opportunity to re-print the books and also his friend Trivikram for introducing the great poet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X