»   » 50 రోజులు అందరినీ ఏడిపించా: పవన్ కళ్యాణ్

50 రోజులు అందరినీ ఏడిపించా: పవన్ కళ్యాణ్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' చిత్రం గతంలో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్ పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసాడు. ఈ నేపథ్యంలో తన తాజా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్టు సమకూర్చడం చర్చనీయాంశం అయంది.

ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


దీనిపై పవన్ కళ్యాన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడకలో స్పందిస్తూ.....'ఈ చిత్రంతో జానీలా డిసప్పాయింట్ చేయనని నమ్మకం ఉంది. నేను సినిమాల్లోకి రాకముందు ఖమ్మంకు బార్డర్ కు వెళ్లాను. అక్కడ ఇప్పటి చతీస్ గడ్ కూడా టచ్ అవుతుంద. ఆప్లేస్ చూడగానే ఇక్కడ ఓ లవ్ స్టోరీ చేస్తే బావుంటుందనిపించింది' అన్నారు.


సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్'కౌబోయ్ తరహాలో ఉండి మనకు దగ్గరగా ఉండేలా సినిమా చేయాలనుండేది. ఈ స్క్రిప్ట్ రాయడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఇంత టైం నన్ను భరించిన శరత్ మరార్ కు థాంక్స్. ఈరోస్ సంస్థ సునీల్ లుల్లా గారికి థాంక్స్. కాజల్ పెర్ ఫార్మెన్స్ బావుంది. నాతోటి నటీనటులకు, టెక్నిషియన్స్ కు థాంక్స్' అన్నారు పవన్ కళ్యాణ్.


'సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని నేను నిద్రపోలేదు. 50 రోజుల పాటు అందరినీ ఏడ్పించేశాను. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. బాబీకి థాంక్స్. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు. అంతే తప్పు ఏ సినిమాకు పోటీగా ఆలోచించలేదు. అందరం బావుండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు' అంటూ ముగించిరు పవన్.

English summary
Pawan Kalyan about Sardar Gabbar singh movie.
Please Wait while comments are loading...