twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గోపాలా గోపాలా’ పవన్ కళ్యాణ్ లుక్ ఇదేనా?(ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కు చెందిన ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ‘గోపాలా గోపాలా' షూటింగ్ స్పాట్లో ఓ అభిమాని పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగి దీన్ని పోస్టు చేసినట్లు చెబుతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ఇదే లుక్‌తో కనిపిస్తారని స్పష్టమవుతోంది.

    హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి తెలుగు రీమేకే ‘గోపాలా గోపాలా' చిత్రం. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తుండగా, పరేష్ రావల్ పోషించిన నాస్తికుడైన వ్యాపారి పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు.

    Pawan Kalyan 'Gopala Gopala' Look Revealed

    కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 , 2015 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌ శివార్లలో పవన్‌ కల్యాణ్‌ ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం పవన్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ను రూపొందించారు. వాటిపై పవన్‌ ప్రయాణించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. శరత్‌మరార్‌. సురేష్‌బాబు నిర్మాతలు.

    దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? హుండీలో డబ్బులెందుకు వేయాలి? హారతి ఇవ్వకపోతే దేవుడు మొర ఆలకించడా? ఇలాంటి సవాలక్ష సందేహాలున్నాయి అతనికి(వెంకటేష్ పోషించిన పాత్ర). దేవుడుంటే ఈ సృష్టినంతటినీ సమానంగా చూడాలి కదా? ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే బేధాలెందుకు అంటూ స్వామీజీలనూ తన పశ్నలతో హడలెత్తించాడు. జవాబులు దొరకలేదు. చివరికి సమాధానం ఇవ్వడానికి స్వయంగా శ్రీకృష్ణుడే(పవన్ కళ్యాణ్) దిగొచ్చాడు. ఆ వైనం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ).

    English summary
    Powerstar Pawan Kalyan's new look for his upcoming Telugu flick Gopala Gopala has been revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X