»   » ఖైదీ నెం 150: మెగా ఫ్యాన్స్ తాకిడికి హాయ్ లాండ్ అల్లాడి పోవాల్సిందే!

ఖైదీ నెం 150: మెగా ఫ్యాన్స్ తాకిడికి హాయ్ లాండ్ అల్లాడి పోవాల్సిందే!

మెగా స్టార్ చిరజీవి నటించిన ‘ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం విజయవాడ-గుంటూరు హైవే మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఉన్న హాయ్ లాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరజీవి నటించిన 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు సాయంత్రం విజయవాడ-గుంటూరు హైవే మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఉన్న హాయ్ లాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూలేనంత గ్రాండ్‌గా ఈ వేడుక జరుగబోతోంది.

వేడుక కోసం కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షకు‌పైగానే అభిమానులు తరలి వస్తారని అంచనా. ఇందుకు తగిన విధంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా అభిమానుల తాకిడికి హాయ్ లాండ్ అల్లాడిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

పవన్ కళ్యాణ్ వస్తున్నారా?

అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారా? లేదా? అనే చర్చ కూడా హాట్ హాట్ గా సాగుతోంది. గతంలో పలు మెగా ఈవెంట్లకు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్... ఇది అన్నయ్య రీ ఎంట్రీ సినిమా కావడంతో తప్పకుండా హాజరవుతారనే నమ్మకం అయితే కొందరిలో ఉంది. అయితే తను వస్తే అన్నయ్యపై ఫోకస్ తక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో పవన్ రాక పోవచ్చని కొందరు అంటున్నారు.

హాయ్‌లాండ్‌లో మెగా 150 ఈవెంట్‌కు స‌ర్వ స‌న్నాహాలు

బాస్ అభిమానులు.. ఇప్ప‌టికే వేదిక‌వైపు వెళ్లే మార్గం మ‌ధ్య‌లో భారీ క‌టౌట్లు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. గ‌త వారం రోజులుగా సెట్ డిజైన‌ర్లు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అకుంఠిత ధీక్ష‌తో ప‌నిచేసి ఈ వేదిక‌ను సిద్ధం చేశాయి. హాయ్‌ల్యాండ్‌లో ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వేదిక అంగ‌రంగ వైభ‌వంగా సిద్ధ‌మైంది... ఫోటోల కోసం క్లిక్ చేయండి

తమ్మారెడ్డి కామెంట్: చిరు లేకుంటే పవన్ లేడు, కత్తులు దూసుకోవాలా ఏంటి?

హాయ్‌లాండ్ లో జరుగుతున్న నేపేథ్యంలో.... ఈ వేడుకకు పవన్ వస్తాడా? రాడా? ఒక వేళ రాకుంటే ఇద్దరి మధ్య విబేధాలు మరింత ముదిరినట్లేనా? అంటూ ఓ చర్చ సాగుతోంది.
ఈ పరిణామాలపై ప్రముఖ తెలుగు ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 'నా ఆలోచన' పేరుతో యూట్యూబ్ లో చిరు-పవన్ అంశంపై తనదైన రీతిలో స్పందించారు. కొన్ని చూస్తుంటే ఈ దేశంలో ఎవరైన కలిసి సంతోషంగా ఉంటే సహించే పరిస్థితి లేదేమో అనిపిస్తుందన్నారు... వీడియో కోసం క్లిక్ చేయండి.

మేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించిన‌ ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

English summary
Film Nagar source said that, Pawan Kalyan to grace Khaidi No 150 pre release function.
Please Wait while comments are loading...