»   » చిరు, రామ్ చరణ్, పవన్ లను మిక్స్ చేసిన ఫోటోలా ఉంది... కాటమ రాయుడు ఫస్ట్ లుక్

చిరు, రామ్ చరణ్, పవన్ లను మిక్స్ చేసిన ఫోటోలా ఉంది... కాటమ రాయుడు ఫస్ట్ లుక్

Posted by:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళింది. ముందు సూర్య దర్శకత్వం వహిస్తాడనుకున్నా అనుకోకుండా అతను నటన వైపు వెళ్ళి ఈ ఆఫర్ని వదిలేయటం తో గోపాల గోపాల ఫేం డాలీ చేతిలో పడ్డాడు పవన్, చిత్రం ఫ్యాక్షన్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే అప్పుడప్పుదూ అంటూ జరుగుతున్న షూటింగ్ సెట్స్ మీదకి ఇంకా పవన్ అడుగు కూదా పెట్తనే క్లేదు.

పవన్ సెప్టెంబర్ మొదటి వారంలో యూనిట్‌తో కలవనున్నాడట. ఇక హీరోయింగా శృతీ హసన్ చేస్తూండతం తో ఈ గబ్బర్ సింగ్ ఈ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ అవ్వొచ్చనే ఆశలతోనే ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ కడప కింగ్, సేనాపతి అంటూ గతంలో పలు వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ మూవీకి అత్తారింటికి దారేది సినిమాలోని పవన్ పాడిన కాటమ రాయుడా పాటలోని మొదట పల్లవిని టైటిల్‌గా ఫిక్స్ చేసేసారు. రాత్రే ఫస్ట్ లుక్ పోస్తర్ రిలీజ్ చేసారుకూడా... అయితే ఈ పోస్తర్ మాత్రం మరీ పేలవంగా... నిజం చెప్పాలంటే కామెడీగా ఉంది తప్ప అసలు పవన్ సినిమా అన్న ఫీల్ లేనే లేదు.

హడావిడిగా

పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజు కానుక అంటూ న 'కాటమరాయుడు' సినిమా లుక్‌ని చిత్ర నిర్మాత శరద్‌మరార్‌ విడుదల చేశారు. అది కూడా హడావిడిగా ఆపటికప్పుడు నిర్ణయించుకొని విడుదల చేసిందే అని అర్థమౌతోంది.

అర్థరాత్రి

సెప్టెంబర్‌ 2న పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా, ముందురోజే టైటిల్‌ని అనౌన్స్‌ చేసిన విషయం విదితమే. అర్థరాత్రికి ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యింది.

కొత్తగా ఏం లేదు

టైటిల్‌ విషయంలో ఇప్పుడు కొత్తగా తెలిసేదేం లేదు మూడు రోజుల ముందే అందరికీ తెలిసి పోయింది. ఈ కాటమ రాయుడు మీద ముందు నుంచీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

చేతికి దొరికిన ఒక ఫొటోలా ఉంది

టైటిల్ విషయం లో ఏం ఆలోచించారో గానీ అసలు పవన్‌ ఫస్ట్‌ లుక్‌ విషయంలో ఏమాత్రం కసరత్తు చేసినట్టు లేదు చిత్ర యూనిట్‌. అప్పటికప్పుడు ఏదో చేతికి దొరికిన ఒక ఫొటో తీసుకొని కాస్త ఫొటో షాప్ చేసి జనం మీదకి వదిలినట్టుంది.

ప్రత్యేకత ఏమీ లేదు

సినిమా టైటిల్‌ రాసిపెట్టి పవన్‌ ఫొటో ఒకదాన్ని విడుదల చేశారంతే. అంతకు మించి, 'కాటమరాయుడు' ఫస్ట్‌ లుక్‌లో ప్రత్యేకత ఏమీ లేదు.

అస్సలు ఆకట్టుకోలేదు

మామూలుగా అయితే, ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా ఈక్వేషన్స్‌ ఫాలో అవుతుంటారు. సినిమాపై అంచనాల్ని పెంచే దిశగా ఫస్ట్‌ లుక్‌ని చాలా పక్కాగా డిజైన్‌ చేసి వదులుతారు. అలాంటిది, అదేదో గ్రాఫిక్స్‌ ఫొటో అన్నట్లుగా వదిలేశారంతే.

మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది

ఆ ఫొటో కూడా ఏదో గ్రాఫిక్స్ లో తయారు చేసినట్టు రామ్ చరణ్, చిరంజీవి ఫొటోలని కలిపి పవన్ ఫొటో తయారు చేసినట్టుంది. దీనికంటే అభిమానులు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టే పోస్టర్లు నయం.

ఖుషీ కాంబినేషన్ ఉండాల్సింది

వాస్తవానికి కడప కింగ్ అన్నప్పటి నుంచే 'కాటమరాయుడు' సినిమా సంగతి అంతా అయోమయం గానే ఉంది.. అసలు ఖుషీ కాంబినేషన్ అయిన పవన్, ఎస్‌ జె సూర్య లతో తెరకెక్కాల్సిన సినిమా ఇది.

గోపాల గోపాల అయ్యింది

అనుకోకుండా సూర్య తప్పుకోవటం తో డాలీ చేతిలోకి వచ్చింది. అజిత్‌ హీరోగా వచ్చిన తమిళ సినిమాకి రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. అంతా ప్రచారమే, అసలు సినిమా ఏంటి.? అన్నది మాత్రం ఇంకా సస్పెన్సే.

నాలుగు కాదు కనీసం ఒక్కటి

ఓ వైపు రాజకీయం ఇంకో వైపు సినిమా అంటూ ప్రయోగాలు చేస్తున్న పవన్ 2019 లోపు నాలుగు సినిమాలు అటుంచి ఈ ఒక్క సినిమా చేసినా చాలు అనే లా ఉంది పరిస్థితి.

సరిగ్గా సెట్ అవుతుందట:

‘కాటమ రాయుడు' అనే టైటిల్ ఈ మూవీకి సరిగ్గా సెట్ అవుతుందని యూనిట్ భావిస్తోందట. ఈ చిత్రానికి పవన్ కేవలం50 రోజులు కేటాయిస్తాడని తెలుస్తోంది.

మార్చి 25, 2017

మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 25, 2017న మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పవన్ ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్

English summary
Pawan kalyan fans verry Dissopointed with first look poster of pawan's new Movie Katama Rayudu
Please Wait while comments are loading...