twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తాజా ట్వీట్ : సినీ వర్గాలు షాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తాజాగా తను సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారనే విషయం అందరినీ షాక్ ఇస్తోంది. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసి అంతటా చర్చనీయాంశంగా మారారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ 2 ప్రారంభమవుతుందనుకునే ఈ సమయంలో ఈ ట్వీట్ రావటం అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

    రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ...దాదాపు సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. గత సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజైన గోపాల గోపాల లో ఇంకో హీరో ఉన్నారు. సోలో హీరోగా పవన్ నుంచి సినిమా నుంచి వస్తుందని ఆశించిన వారుకి పవన్ ట్వీట్ ఆశ్చర్యానకి గురి చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటీ..అంటే

    పవన్ ట్వీట్ చేస్తూ... ‘ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు. ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నానని' ట్వీట్ చేసాడు.

    గత కొద్ది రోజులుగా ప్రభుత్వాథికారులు ..ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రైతుల నుంచి భూములను సేకరించే పనిలో ఉన్నారు. కానీ ఆ భూముల వల్ల తమకు నష్టం కలుగుతోందని కొంతమంది రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకారం తెలపలేదు. దాంతో హైకోర్టు భూములు ఇవ్వని రైతుల మీద భూ సేకరణ చట్టం ప్రవేశపెట్టనుందని తీర్పును వెలువరించింది. ఆ వార్తలపై ఆయన ఇలా స్పందించారు. ఇక ఈ వార్త మీడియాని మరియు తెలుగు దేశం పార్టీ వారిని షాక్ చేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరో ప్రక్క 'గబ్బర్‌సింగ్ 2' చిత్రం మే 4 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. 'గబ్బర్‌సింగ్' సినిమాలో పవన్ పాత్రతో కొద్దిగా కూడా పోలిక లేకుండా కొత్తగా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా చేసే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ మిత్రుడైనన శరత్ మరార్ ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే శరద్ మరార్...తనను కలిసిన మీడియాతో మాట్లాడారు.

    శరద్ మరార్ మాట్లాడుతూ... ''స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం'' అని శరత్‌మరార్ వివరించారు.

    అలాగే 'గబ్బర్‌సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారని చెప్పుతున్నారు. వాస్తవానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని, కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు చెప్తున్నారు.

    అలాగే గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ 'గబ్బర్ సింగ్2'కూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి, 'గబ్బర్ సింగ్2' ఆగినట్లేననీ, 'గోపాల గోపాల...' దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... 'గబ్బర్ సింగ్2' బాబీతో ఉన్నట్లే అని తేలింది. అయితే చిత్ర రెగ్యులర్ షూటింగ్ కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.

    'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

    Pawan Kalyan latest tweet shock tollywood

    గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

    బాబీ మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని చెబుతున్నారు.
    గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.

    English summary
    "According to media reports, Andhra Pradesh government has informed to High Court that they are going to impose Land Acquisition Act on those farmers who refused to give their land for construction of Capital. In that case, I'm ready to fight on behalf of farmers against Andhra Pradesh government" said Pawan Kalyan, via twitter today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X