»   » పవన్ కళ్యాణ్‌తో అలీబాబా ఆడియో రిలీజ్ (ఫోటోలు)

పవన్ కళ్యాణ్‌తో అలీబాబా ఆడియో రిలీజ్ (ఫోటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అలీ కథానాయకుడుగా కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డెడ శివాజీ రూపొందిస్తున్న చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి అలీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలను విడుదల చేసారు. అత్యంత సింపుల్‌గా కేవలం అలీ, పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'అలీ బాబా ఒక్కడే దొంగ' చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అలీ మాట్లాడుతూ పిలవగానే ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైనందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్మాత శివాజీ మాట్లాడుతూ జనవరి 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్లైడ్ షోలో ఆడియో విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు.....

అల్లరి నరేష్ వాయిస్


ఈ సినిమాకు అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులకు ఎంటర్టెన్మెంట్స్ పంచడంలో ప్లస్సవుతుందని అంటున్నారు.

కామెడీ థ్రిల్లర్


సినిమా మొదటినుండి చివరి వరకు ఆసక్తికరంగా, తమాషాగా సాగుతుందని, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని పాత్రలు వినోదాన్ని అందిస్తాయని దర్శకుడు ఫణిప్రకాష్ తెలిపారు.

కథేంటి?


‘అలీ బాబా ఒక్కడే దొంగ' సినిమా కథ విషయానికొస్తే....పోలీస్ అవుదామని దొంగగా మారిన యువకుని కథే ఈ చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా సినిమా సాగుతుంది.

ఇతర వివరాలు


సుజావారుణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జాన్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: బొడ్డెడ శివాజీ, దర్శకత్వం: ఫణిప్రకాష్.

English summary
Power star Pawan Kalyan unveiled the audio of Alibaba Okkade Donga which is Ali's film as a hero. Though the event was held in a low key manner.
Please Wait while comments are loading...