»   » ‘అఆ’ఆడియో : పవన్ ,త్రివిక్రమ్ ఒకరి గురించి మరొకరు ఇలా.. (ఫొటోలతో)

‘అఆ’ఆడియో : పవన్ ,త్రివిక్రమ్ ఒకరి గురించి మరొకరు ఇలా.. (ఫొటోలతో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :దర్శకుడు త్రివిక్రమ్, లవర్ బాయ్ నితిన్, స్టార్ హీరోయిన్ సమంతల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'అ..ఆ..'. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను నిన్నరాత్రి హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు.

ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ట్రైలర్, ఆడియోను విడుదల చేస్తూ సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా తప్పక మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలుపుతూ త్రివిక్రమ్‌పై తనకున్న అభిమానం గురించి మాట్లాడారు.


అలాగే హీరో ఒక రచయిత రాసిన సంభాషణల్ని చెప్పేవాడే కానీ రాసేవాడు కాదు. అందుకే ఎవరికి ఎలాంటి ఇమేజ్‌ వచ్చినా దాని వెనకాల రచయితల కథ ఉందని నమ్మే వ్యక్తిని నేను. నాతో సహా త్రివిక్రమ్‌ చాలామందితో సినిమాలు తీశారు. అలాంటి రచయిత మన చిత్ర పరిశ్రమలో ఉండడం గర్వకారణం అని పవన్ అన్నారు.


ఈవెంట్ మొత్తం వీడియోలోసోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'అఆ' పాటల విడుదల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నితిన్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ ముఖ్యభూమిక పోషించారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు.


ఇంకా ఎవరేం మాట్లాడారు.. స్లైడ్ షోలో పంక్షన్ ఫొటోలతో ...


పవన్ చేతుల మీదుగా

తొలి సీడీని పవన్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే ట్రైలర్ సైతం ఆయనే విడుదల చేసారు.


నితిన్ గురించి పవన్

‘‘గబ్బర్‌ సింగ్‌' సినిమా చేస్తున్నప్పుడు సెట్‌కి వచ్చాడు నితిన్‌. తను ప్రేమగా దగ్గరికి రాగానే నా తమ్ముడిలా అనిపించాడు. అందుకే తను పిలవగానే ‘ఇష్క్‌' పాటల వేడుకకు హాజరయ్యాను.


ధైర్యం చెప్పేందుకే..

కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చేందుకు వెళ్లినట్టుగానే ఆ వేడుకకి వెళ్లా. అంతే తప్ప ఆ చిత్ర విజయం చిత్ర యూనిట్ పడ్డ కష్టమే. నితిన్‌కి నేనంటే ఎంతిష్టమో తను ఈ రోజు చెప్పేదాకా నాకు తెలియదు. ఈ సినిమా గొప్ప విజయం సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను''అన్నారు పవన్‌కల్యాణ్‌.


త్రివిక్రమ్ గురించి పవన్...

నాతో సహా త్రివిక్రమ్‌ చాలామందితో సినిమాలు తీశారు. అలాంటి రచయిత మన చిత్ర పరిశ్రమలో ఉండడం గర్వకారణం అన్నారు.


 


జాతీయ స్దాయిలోనూ..

ఈ చిత్రం నితిన్‌కి పెద్ద విజయాన్ని అందిస్తుంది. తను తెలుగులోనే కాకుండా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా అన్నారు పవన్ .


 


విన్నా..బాగుంది

ఆడియో విన్నాను.. మిక్కీ జె.మేయర్‌ సంగీతం బాగుంది అని పవన్ చెప్పారు.


 


అప్పటినుంచే..

‘గోకులంలో సీత' దగ్గర్నుంచి త్రివిక్రమ్‌గారితో పరిచయముంది. ‘తొలిప్రేమ' చేసేటప్పుడు అనుకోకుండా ‘చిరునవ్వుతో' సినిమాలోని సన్నివేశాలు చూశా. ఎవరో బాగా రాశారని అనుకొనేవాణ్ని అన్నారు పవన్ .


 


విలువలు పాటిస్దాడు కాబట్టే...

‘జల్సా' దగ్గర్నుంచే మేం దగ్గరయ్యాం. త్రివిక్రమ్‌ విలువలు పాటించే వ్యక్తి కాబట్టి ఆయనంటే నాకు గౌరవం'' అన్నారు పవన్


 


త్రివిక్రమ్ అంటే ఇష్టం

‘జల్సా' అప్పట్నుంచో ఆయనతో అభిప్రాయాలు పంచుకుంటూ వస్తున్నా. చాలా సున్నితంగా చెప్పే ప్రతి విషయంపైనా ఎంతో అవగాహన తెచ్చుకొని మాట్లాడుతుంటారాయన. అందుకే ఆయనంటే నాకు ఇష్టం అని చెప్పారు పవన్ .


త్రివిక్రమ్‌ మాట్లాడుతూ...

‘‘ఈ సినిమాకి ‘అఆ' అనే పేరు ఎందుకు పెట్టారని ఎవరో అడిగితే మళ్లీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర్నుంచి జీవితం మొదలు పెట్టాలనిపించింది అని చెప్పా. పనిచేయడంలోనూ, గెలవడంలోనూ, ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలుపెట్టామో మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు వెనక్కితిరిగి మూలాల్ని వెదుక్కొనే ప్రయత్నం చేస్తుండాలి. అదే ఈ సినిమా.


నితిన్ కు ధాంక్స్

ఇది హీరో సినిమానా? హీరోయిన్‌ సినిమానా? అని అడక్కుండా కథ ఉన్న సినిమా అని చేసినందుకు నితిన్‌కి కృతజ్ఞతలు. అనసూయ పాత్రకి సమంత ప్రాణప్రతిష్ఠ చేసింది. మిక్కీ జె.మేయర్‌ పాటలు, చిత్రం అందరికీ నచ్చుతాయని నమ్ముతున్నా'' అన్నారు త్రివిక్రమ్


పవన్ గురించి త్రివిక్రమ్...

పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ ‘‘కొండ ఒకరికి తలొంచి ఎరగదు, శిఖరం ఒకరికి సలాం అని తలొంచి ఎరగదు. కెరటం అలిసిపోయి ఒకరికోసం ఆగదు. తుపాను ఒకరి ముందు తలొంచదు అన్నారు.


 


అదే పవన్

నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకొన్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిలిలో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు. ... అదే పవన్‌కల్యాణ్‌ అంటూ ఎమోషనల్ గా చెప్పారు త్రివిక్రమ్.


అయితే రండి

ఎంత మంది గుండెలు తడపడానికో వచ్చే ఓ చిన్న వర్షపు చినుకు, ఓ స్నేహపు రుతుపవనం. వింటారా? వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం వస్తారా? అయితే రండి, విందాం'' అంటూ పవన్‌కల్యాణ్‌కి మైకు అందించారు త్రివిక్రమ్‌.


నితిన్‌ మాట్లాడుతూ...

‘‘అఆ.. అంటే త్రివిక్రమ్‌గారు తీసిన ఒక అందమైన ఆహ్లాదకరమైన సినిమా. నా తొలి విజయంలో పవన్‌ ప్రమేయం ఉంది. ‘ఇష్క్‌' రూపంలో వచ్చిన రెండో జీవితంలోనూ ఆయన ప్రమేయం వుంది. 2016లో ఈ వేడుకకి వచ్చారు. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది'' అన్నారు.


‘అఆ’ఆడియో : పవన్ ,త్రివిక్రమ్ ఒకరి గురించి మరొకరు ఇలా.. (ఫొటోలతో)

సమంత మాట్లాడుతూ ....‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి పవన్‌కల్యాణ్‌ వచ్చారు. సినిమా విజయం సాధిస్తుందంతే'' అన్నారు.


‘అఆ’ఆడియో : పవన్ ,త్రివిక్రమ్ ఒకరి గురించి మరొకరు ఇలా.. (ఫొటోలతో)

మిక్కీ జె.మేయర్‌ మాట్లాడుతూ... ‘‘త్రివిక్రమ్‌గారి నుంచి చాలా నేర్చుకొన్నా. ఆడియో టీమ్‌కి నా కృతజ్ఞతల''న్నారు.


నిర్మాత మాట్లాడుతూ...

సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.


 


ఎవరెవరు..

ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, దిల్‌రాజు, కృష్ణచైతన్య, నదియా, మారుతి, నరేష్‌, శరత్‌మరార్‌, హరితేజ, నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 


English summary
Pawan Kalyan released the audio albums of Trivikram's 'A Aa' starring Nithin and Samantha. Pawan Kalyan spoke at length about his association with his good friend Trivikram and Nithin. Pawan Kalyan said Trivikram is pride of Telugu cinema. "Telugu cinema is proud to have such talented writer."
Please Wait while comments are loading...