»   » పవన్ కళ్యాణ్ సైకిల్ తొక్కుతూ.... ఫేక్ లుక్ అయినా చాలా బావుంది!

పవన్ కళ్యాణ్ సైకిల్ తొక్కుతూ.... ఫేక్ లుక్ అయినా చాలా బావుంది!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముఖ్యమైన పండగలొచ్చాయంటే... సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలకు సంబంధించి న్యూలుక్స్ విడుదల చేయడం మామూలే. దీపావళి సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కాటమరాయుడు' లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విలేజ్ లుక్ లో... పంచెకట్టులో సైకిల్ తొక్కుతూ పవర్ స్టార్ ను సూపర్బ్ గా ప్రజెంట్ చేసారు ఈ ఫోటోలో. గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇది సినిమా యూనిట్ వారు అఫీషియల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ కాదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్.

పవన్ కళ్యాణ్ చెందిన ఓ ఫోటోను మార్పింగ్ చేసిన దీన్ని క్రియేట్ చేసారు. అభిమానులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది ఫేక్ లుక్ అనే అనుమానం ఏ మాత్రం రావడం లేదు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

కాటమరాయుడు

 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే చిత్రాన్ని చేస్తోండగా, ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా పవన్ సైకిల్ తొక్కుతున్నట్టు ఉన్న ఓ ఫేక్ ఫోటో రిలీజ్ అయింది. .

 

పవన్ కళ్యాణ్ బైక్

 

ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.

 

రీమేక్ అనే ప్రచారం

 

ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది.

 

క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి

 

అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమా(వీరమ్)లో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.

 

శృతి హాసన్

 

కాటమరాయుడులో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ సెట్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

 

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ సెట్లో పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

బికినీ ఫోటో షూట్: శృతి హాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫోటోస్)

 

బాలీవుడ్లోనే ఆశించిన స్థాయిలో శృతి హాసన్ కెరీర్ సాగడం లేదు. బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

 

 

English summary
Checkout Pawan Kalyan's Katamarayudu fanmade look For Diwali.
Please Wait while comments are loading...