twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చే.. పవన్ చెప్పిన నిజాలు: తెల్ల జుట్టే, కారు లేదు,తెగుళ్లు, చేగువేరా స్పూర్తి

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఆ మధ్యన తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నా. అదృష్టం కొద్దీ ఏమీ అవ్వలేదు. అప్పుడు నా సినిమా నిర్మాతలు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయని బెంజికారు కొని తీసుకొచ్చారు' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    పవన్ కంటిన్యూ చేస్తూ.. దానికి నేనే డబ్బులిచ్చాననుకోండి. అదే కారునే ఇప్పుడు వాడుకొన్నా. నాకు వెన్ను నొప్పి ఉంది కాబట్టి సీటుని ప్రత్యేకంగా తయారు చేయించుకొన్నా.ఆయన వివిధ మీడియాలతో మాట్లాడిన మాటల్లో ఆసక్తికరమైన మరికొన్ని మీకు అందిస్తున్నాం.

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాసింది. ఈ సందర్భంగా మీడియాతో పవన్ మాట్లాడారు. ఎన్నో విషయాలపై మొహమాటం లేకుండా స్పందించారు.

    పవన్ ఇంటర్వూ -2 : ఎర్ర కండువా, సిగ్గు, పార్టీ ,కొట్టాలనే, త్రివిక్రమ్ తో ఇంకెన్నో..పవన్ ఇంటర్వూ -2 : ఎర్ర కండువా, సిగ్గు, పార్టీ ,కొట్టాలనే, త్రివిక్రమ్ తో ఇంకెన్నో..

    తన సినిమా రిజల్ట్, కలెక్షన్స్ గురించి పట్టించుకోనంటూ...తన తదుపరి చిత్రం గురించి, రాజకీయాల గురించీ, తన వ్యక్తిత్వం, తన పిల్లల, పెళ్లిళ్ల గురించి, తనపై సెటైర్స్ వేస్తున్న వర్మ గురించీ పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

    ఈ ఇంటర్వూ చూస్తూంటే పవన్ చాలా ఫ్రాంక్ గా మాట్లాడారని అర్దమవుతుంది. కొన్ని విషయాలపై ఆయన స్పందన చూస్తూంటే ఓ భావకుడు మాట్లాడినట్లు ఉంటే మరికొన్ని విషయాలలో ఆయనలోని పరిశీలనా శక్తికి ఆశ్చర్యమేస్తుంది. సినిమాల కన్నా, ప్రపంచం, తన ఫ్యాన్స్ వంటివారిపై ఆయనకు ప్రేమ అధికం అనిపిస్తుంది. అలాంటివారిని ఎవరు ఇష్టపడకుండా ఉండారు..ఎవరు ప్రేమించకుండా ఉండగలరు.

    స్లైడ్ షోలో పవన్ ఇంటర్వూలో ని మరిన్ని అంశాలు...

    గ్యాడ్జెట్స్‌పై ఆసక్తి ఉందా?

    గ్యాడ్జెట్స్‌పై ఆసక్తి ఉందా?

    గ్యాడ్జెట్స్‌ ఒక స్థాయికి మించి వాడను. రోజుకొక కొత్త వెర్షన్‌ వస్తుంటుంది. వాటన్నిటినీ తెలుసుకొని, వాడటం అంటే విసుగు అనిపిస్తుంటుంది.

    పాతరోజుల్లోకి

    పాతరోజుల్లోకి

    అప్పుడప్పుడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోవాలనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అదే చేస్తుంటా.

    నోట్స్ రాస్తా..

    నోట్స్ రాస్తా..

    ఏదైనా అనిపిస్తే నోట్స్‌లోనే రాసుకొంటుంటాను తప్ప కంప్యూటరూ, ఇతరత్రా విషయాల జోలికి వెళ్లను.

    ట్విట్టర్ లో..

    ట్విట్టర్ లో..

    ట్విట్టర్‌ ఎకౌంట్‌ ఉంది కానీ... ప్రతీ రోజూ ఎవరేం మాట్లాడారో చూడను.

    అప్పుడు మాత్రమే..

    అప్పుడు మాత్రమే..

    ఏదైనా ఒక విషయాన్ని పదిమందితో పంచుకోవాలనుకొంటే అప్పుడు ట్విట్టర్‌ ఎకౌంట్‌ని వాడుతుంటా.

    అదే పనిగా పెట్టుకోను..

    అదే పనిగా పెట్టుకోను..

    కానీ మధ్యలో అప్పుడుప్పుడు ట్విట్టర్ లో ఎవరేంటి అని చూస్తుంటాను కానీ అదే పనిగా మాత్రం పెట్టుకోను.

    ఫోన్లు, కార్లు తరచుగా మారుస్తుంటారా?

    ఫోన్లు, కార్లు తరచుగా మారుస్తుంటారా?

    ఇక కార్లంటారా? వాటిని మార్చడం చాలా తక్కువ. ‘జానీ' వరకు శాంట్రో ఉండేది. తర్వాత మరొక కారు కొన్నా.

    కారేలేదు

    కారేలేదు

    ఆ తర్వాత కొన్నాళ్లు అసలు కారే లేదు. సినిమాకి సంబంధించిన కంపెనీ కారునే వాడా.

    ఎందుకంటే...

    ఎందుకంటే...

    పిల్లల్ని ఇక్కడ చదివించడం ఇష్టం లేక పుణెకి వెళ్లిపోయాం అప్పుడు. నేను తరచుగా అక్కడికి వెళ్లొచ్చేవాణ్ని. నా కారు కూడా అక్కడే ఉంచా.

    విడిపోయాక

    విడిపోయాక

    ఆ తర్వాత నేను, రేణుదేశాయ్‌ విడిపోయాం. దీంతో కారుతో సహా అక్కడే వదిలేసి వచ్చా.

    ఇల్లు కూడా లేదు

    ఇల్లు కూడా లేదు

    అప్పుడు నాకు హైదరాబాద్‌లో ఇల్లు కూడా లేదు. హోటల్‌లోనే వుండేవాణ్ని.

    పొలం గురించి

    పొలం గురించి

    నా పొలానికి తరచుగా వెళ్ళటం లేదు.. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా హడావుడిలో పడి నాలుగు నెలలైంది పొలంవైపు చూడక!

    ఇంటర్వూకి వెళ్లాక...

    ఇంటర్వూకి వెళ్లాక...

    తీరా మొన్న ఓ ఇంటర్వ్యూ కోసమని అక్కడికి వెళ్లా. ఎన్నేళ్లైందో పొలానికి రాక అనిపించింది.

    అన్ని పనులు.

    అన్ని పనులు.

    పొలంలో మొక్కలు నాటడం మొదలుకొని మోటర్‌ రిపేరు చేయించడం వరకు అన్ని పనులూ అక్కడున్న రైతులు కూడా చేస్తుంటారు.

    కాకపోతే...

    కాకపోతే...

    పొలం వెళ్లాక ఏదో ఒక పని చేయడం నాకు అలవాటు. స్వయంగా పొలంలో పనులు చేయడంలో ఒక సంతృప్తి దొరుకుతుంటుంది.

    మామిడి పంట వచ్చేసిందా?

    మామిడి పంట వచ్చేసిందా?

    ఈసారి పంట బాగా దెబ్బ తిందండీ. తెగుళ్లు వచ్చి పూత, పిందె రాలిపోయింది.

    ఫ్రెండ్స్ కు మామిడి పళ్లు పంచబోతున్నారా?

    ఫ్రెండ్స్ కు మామిడి పళ్లు పంచబోతున్నారా?

    కానీ నేను పండ్లు పంపించాల్సినవాళ్ల సంఖ్యేమో బాగా పెరిగిపోయింది. అయితే ఈసారి కుదరదేమో. ఏ కొద్దిమందికో పంపిచేస్తానేమో మరి!.

    చిన్నప్పటినుంచీ..

    చిన్నప్పటినుంచీ..

    పొలం, వ్యవసాయంపై అంత మక్కువ ఎప్పట్నుంచి ? అన్న ప్రశ్నకు సమాధానంగా.. చిన్నప్పట్నుంచీ నాకు పొలం అంటే చాలా ఇష్టం.

    భవిష్యత్ లో ..

    భవిష్యత్ లో ..

    చదువుకొనేటప్పుడు కూడా భవిష్యత్తులో ఓ తోటమాలి కావాలనుకొనేవాణ్ని. ఎందుకంటే నాకు తెలిసింది అదొక్కటే. అందుకే రైతుగానో, తోటమాలిగానో స్థిరపడతానని అనిపించేది.

    ఇంతమంది అభిమానులు..

    ఇంతమంది అభిమానులు..

    సినిమాలకి మించి చేయని మీకు ఈ స్థాయిలో అభిమానగణం ఏర్పడటానికి కారణం.. ఆ విషయం నాకూ తెలియదు. బహుశా నేను నాలా ఉండటమే వాళ్లకి నచ్చిందేమో అనుకొంటుంటా.

     ఉన్నట్టుండి గెడ్డం మీసాలు తీసేసారు? ఎందుకలా?

    ఉన్నట్టుండి గెడ్డం మీసాలు తీసేసారు? ఎందుకలా?

    సహజంగా బతకడం అలవాటైందండీ నాకు (నవ్వుతూ).

    అందుకే సినిమాలు వద్దనేది

    అందుకే సినిమాలు వద్దనేది

    ప్రతి రోజూ మొహానికి మేకప్‌ వేసుకొని, అందంగా తయారై కనిపించడమంటే నాకు విసుగు. హీరోగా సినిమాలకి దూరం అవ్వాలనే ఆలోచనకి కారణం కూడా అదే.

    ప్రత్యేకంగా తయారు కాను

    ప్రత్యేకంగా తయారు కాను

    అందుకే షూటింగ్‌ ఉందంటే తప్ప నేను ప్రత్యేకంగా తయారవడం అంటూ ఉండదు.

    విసుగు..

    విసుగు..

    ప్రతిసారీ జుత్తుకు రంగేసుకొని, మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వెళ్లాలంటే ఏదో తెలియని విసుగు.

    తెల్ల జుట్టు రాదా..

    తెల్ల జుట్టు రాదా..

    ఎవరో వస్తారు... ‘సర్‌ ఇక్కడ తెల్ల జుత్తు కనిపిస్తుంది' అంటాడు. వయసు పెరిగితే తెల్లజుత్తు రాకుండా ఏమొస్తుంది? వెంట్రుకలు రాలకుండా ఏం జరుగుతుంది? (నవ్వుతూ).

    చాలా విసుగు, అందుకే రచన

    చాలా విసుగు, అందుకే రచన

    ఇదంతా నాకు విసుగు వ్యవహారంలా అనిపిస్తుంటుంది. అందుకే నటనకి దూరమై సృజనాత్మకతతో కూడుకొన్న మరో కళ అయిన రచనవైపు దృష్టి పెట్టాలనిపిస్తుంది.

     ఉంటుంది ..

    ఉంటుంది ..

    సూటూ బూటూ వేసుకోవాలని, హంగులతో ఆర్భాటంగా కనిపించాలని నాకూ ఉంటుంది.

    ఎక్కడికి వెళ్లాలి...

    ఎక్కడికి వెళ్లాలి...

    కానీ సూటూబూటూ వేసుకొని నేను ఎక్కడికి వెళ్లాలి? అందుకే వేసుకోను

    వేరే వ్యాపకం లేదు

    వేరే వ్యాపకం లేదు

    ఉంటే షూటింగ్‌లో, లేదంటే పొలంలో. అదీ లేదంటే ఇంట్లో గడపడం. ఇంతకంటే వేరే వ్యాపకాలు నాకు లేవు కదా! (నవ్వుతూ).

    స్నేహితులు తక్కువే..

    స్నేహితులు తక్కువే..

    మీకు స్నేహితులు పరిమిత సంఖ్యలోనే వుంటారు . విచిత్రమేంటంటే... ఇక్కడున్నప్పుడు నాకు స్నేహితులు తక్కువగానే అనిపిస్తుంటారు. కానీ బయటికి వెళితే మాత్రం చాలా మంది ఉంటారు. అదెందుకో తెలియదు.

    వాళ్లతోనే అన్ని..

    వాళ్లతోనే అన్ని..

    కొద్దిమంది తొలిసారి పరిచయమైనప్పటికీ వాళ్లతో అన్ని విషయాలు పంచుకొంటుంటా.

    చెప్పలేదేం

    చెప్పలేదేం

    వాళ్లతో కొన్ని విషయాలు చెప్పడం విని నా పక్కనుండే శరత్‌లాంటి స్నేహితులు ‘ఆ విషయం మాకు తెలియదే, ఇప్పటిదాకా చెప్పనేలేదు' అంటుంటారు. ‘ఏమో మరి, ఇక్కడ చెప్పాలనిపించింది. చెప్పేశా' అంటుంటా.

    కమ్యూనిష్టా

    కమ్యూనిష్టా

    చెగువేరాని ఒక్క కమ్యూనిస్టుగా మాత్రమే చూడను నేను. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.

    స్పూర్తి..

    స్పూర్తి..

    ‘నీ దేశం కాని దేశమైనా, నీ మనుషులు కాని మనుషులైనా, నీ రంగు కాకపోయినా... వాళ్లు అసమానతలు, దోపిడీకి లోనవుతున్నప్పుడు నువ్వు వెళ్లి మానవత్వం అనే విషయం మీద పోరాటం చేయొచ్చు' అని చేగువేరా స్ఫూర్తినిచ్చారు.

    పోరాట స్పూర్తి ..

    పోరాట స్పూర్తి ..

    చేగువేరా నుంచే ఆ పోరాట స్ఫూర్తిని నేను నేర్చుకొన్నా.

    అలాగే భగత్‌సింగ్‌....

    అలాగే భగత్‌సింగ్‌....

    ‘క్షమాపణ అడుగు, క్షమాభిక్ష పెడతాం' అంటే భగత్ సింగ్ వినలేదు. ఆయన జీవితం గురించి తెలుసుకొంటున్నప్పుడు మొదట మనకు కోపం రావొచ్చు, ఇంత మంది చెబుతున్నారు కదా, వినొచ్చు కదా అనిపించొచ్చు

    జైల్లో రాసిన పుస్తకంలో

    జైల్లో రాసిన పుస్తకంలో

    ఆయన జైల్లో రాసిన పుస్తకంలో ‘నా జీవితం భవిష్యత్‌ తరాలకి మేల్కొలుపు అవ్వాలి. నా స్వార్థం కోసం నేను ఇక్కడ లొంగిపోతే భావి తరాలకి నా జీవితం మేల్కొలుపు అవ్వదు' అని రాశారు.

    పాతుకుపోయాయి

    పాతుకుపోయాయి

    మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలా... ఇలా ఎంతోమంది గొప్పవాళ్లు. వాళ్ల జీవితాల గురించి తెలుసుకొంటున్నప్పుడు కొన్నింటిని నా జీవితానికి అన్వయించుకొంటుంటా. ఆ భావాలన్నీ నాలో పాతుకుపోయాయి.

    కొత్త చిత్రాల సంగతులేంటి?

    కొత్త చిత్రాల సంగతులేంటి?

    ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. ఈ నెలాఖరున కానీ, మేలో కానీ ఆ చిత్రం మొదలవుతుంది. హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్‌ ప్రేమకథ ఇది.

    ‘వేదాళం' రీమేక్‌లో నిజమేనా?

    ‘వేదాళం' రీమేక్‌లో నిజమేనా?

    ఇక వేదాళం రీమేక్‌ విషయానికొస్తే ఆ చిత్రం విషయంలో చర్చలు నడుస్తున్నాయి కానీ... అది చేస్తానా లేదా అని మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఎ.ఎమ్‌.రత్నంగారి నిర్మాణంలో మాత్రం సినిమా తప్పకుండా చేస్తా.

    చిన్న సినిమాలు సైతం..

    చిన్న సినిమాలు సైతం..

    చిన్న చిత్రాలు, ఆ తరహా సినిమాలంటే స్వతహాగా నాకు చాలా ఇష్టం. నాతోనే రూ: 5 కోట్ల వ్యయంతో ఒక సినిమాని ప్లాన్‌ చేయండని చెబుతుంటా. కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

    ఆలోచనైతే ఉంది..

    ఆలోచనైతే ఉంది..

    పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై మంచి కథల్ని, ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ చిన్న చిత్రాల్ని తీయాలనే ఆలోచనైతే ఉంది.

    అన్నయ్య అభ్యంతరం

    అన్నయ్య అభ్యంతరం

    అన్నయ్యకి ,నాకూ ఇద్దరికీ వైరుధ్యమైన భావాలు ఉండొచ్చు కానీ... గొడవలు మాత్రం లేవు. నా దృష్టిలో విభేదం వేరు, వైరుధ్యం వేరు. నాకూ అన్నయ్యకీ విభేదాలు ఎప్పుడూ లేవు.

    వద్దన్నారంతే..

    వద్దన్నారంతే..

    జనసేన పార్టీ విషయంలో అన్నయ్య వద్దు అని చెప్పలేదు కానీ... ‘నీకెందుకురా రాజకీయం, ఎందుకు ఈ గొడవలు. ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చుగా' అన్నారంతే. అది కూడా వేరే వాళ్లతో చెప్పించారంతే.

    సినిమాలను వదిలిపెట్టను

    సినిమాలను వదిలిపెట్టను

    నేను మరికొంతకాలం కొన్ని సినిమాలు చేస్తానని చెప్పా. ఇప్పటికిప్పుడు సినిమాల్ని వదిలిపెట్టే ఉద్దేశం లేదు.

    నిర్మాతగా, రచయితగా..

    నిర్మాతగా, రచయితగా..

    ఒకవేళ నేను నటుడిగా కొనసాగలేకపోయినా, రచయితగా, నిర్మాతగా సినిమాలు చేస్తా.

    త్రివిక్రమ్‌, నేనూ

    త్రివిక్రమ్‌, నేనూ

    ఇద్దరు స్నేహితులు కాలేజి గోడపై కూర్చుని కాళ్లు వూపుతూ ఏం మాట్లాడుకొంటారో, త్రివిక్రమ్, మా మధ్య మాటలు కూడా అలాగే ఉంటాయి.

    మాట్లాడుకోం...

    మాట్లాడుకోం...

    అయితే మా ఇద్దరిలో ఉన్న సిమిలారిటీ ఏంటంటే ఎవరి సినిమా గురించీ మేం మాట్లాడుకోం. ఫలానా సినిమా బాగుంది అంటే బాగుంది, బాగోలేదంటే బాగోలేదు. అంతవరకే.

    ఎటైనా టాపిక్..

    ఎటైనా టాపిక్..

    పానుగంటిగారి కథలు మొదలుకొని విశ్వనాథ సత్యనారాయణ, జోక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌... ఇలా ఎక్కడ్నుంచి ఎక్కడికైనా మా టాపిక్‌ వెళ్లొచ్చన్నమాట.

    త్రివిక్రమ్ క్లాస్..

    త్రివిక్రమ్ క్లాస్..

    ఒకసారి త్రివిక్రమ్‌ నాకు న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ గురించి క్లాస్‌ తీసుకొన్నారు. ఆయన ఎమ్మెస్సీ స్టూడెంట్‌ కాబట్టి ఎక్స్‌ప్లోజర్‌ ఎలా ఉంటుంది? అంటూ బోర్డుపై బొమ్మలేసి చూపిస్తూన్నారు. నేను ఆసక్తిగా వింటూ కూర్చున్నా.

    English summary
    At the time Tollywood Media is eagerly waiting for Pawan's press conference, but now he stunned them by offering appointment and gave exclusive interviews.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X