twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. కొంత కాలంగా ఈ సినిమా విషయం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రారంభం అయింది.

    రామానాయుడు స్టూడియోలో శనివారం ఉదయం 10.49 గంటలకు ఫిక్స్ చేసిన ముహూర్తానికి పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు.

    హారిక అండ్ హాసిక క్రియేషన్స్ బేనర్లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ నెం 4గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    ఎవరెవరు పాల్గొన్నారు

    ఎవరెవరు పాల్గొన్నారు

    ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, శరత్ మరార్, నాగ వంశీ, పిడివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    ల్యాండ్ మార్క్ మూవీ

    ల్యాండ్ మార్క్ మూవీ

    పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని ఎస్ రాధాకృష్ణ తెలిపారు. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

    ఓన్లీ పవన్ కళ్యాణ్

    ఓన్లీ పవన్ కళ్యాణ్

    ఈ సినిమాకు సంబంధించి హీరో పవన్ కళ్యాణ్ తప్ప ఇతర నటీనటులు ఎవరూ ఖరారు కాలేదు. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

    ఇద్దరు హీరోయిన్లు

    ఇద్దరు హీరోయిన్లు

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. అయితే ఎవరిని తీసుకుంటారనేది త్వరలో ప్రకటిస్తామని దర్శక నిర్మాతల తెలిపారు.

    టాప్ టెక్నీషియన్స్

    టాప్ టెక్నీషియన్స్

    ఈ సినిమా టాప్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. సౌత్ లో ఈ మధ్య మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇండియాస్ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్.... రావన్, అపరిచితుడు, యే జవాని మై దివాని, మై హూ నా లాంటి చిత్రాలకు పని చేసిన వి మణికందన్ పని చేస్తున్నారు.

    ఇతర టీం

    ఇతర టీం

    ఈ చిత్రానికి ఆర్ట్: ఎఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిడివి ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు), కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

    యాక్షన్ కామెడీ

    యాక్షన్ కామెడీ

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    భారీగా బడ్జెట్ ఎందుకు?

    భారీగా బడ్జెట్ ఎందుకు?

    2018 తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోతారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ముందు తాను చేయబోయే సినిమా భారీగా ఉండాలని, తన కెరీర్లోనే ఓ పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

    రూ. 100 కోట్లా?

    రూ. 100 కోట్లా?

    త్రివిక్రమ్ ఈ సినిమాను డిపరెంటుగా ప్లాన్ చేస్తున్నారని, అందుకే రూ. 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఈ సాహసం చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు.

    రికార్డులు

    రికార్డులు

    పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ సినిమా వస్తే పలు టాలీవుడ్లో పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

    ఫస్ట్ టైం

    ఫస్ట్ టైం

    సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేయడమే అరుదు. అయితే ఈ సారి మూడు సినిమాలకు కమిట్ కావడం విశేషం. పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఇలా ఒకేసారి మూడు సినిమాలు చేయడం ఇదే తొలిసారి.

    English summary
    The most prestigious production on our Haarika & Hassine Creations banner has just begun, announced producer Suryadevara Radhakrishna. The pooja ceremony for the latest production (production no 4) of Haarika Haasine Creations starring the one and only Powerstar Pawan Kalyan in the direction of Magician of Words Trivikram was held today at 10.49 am muhurtham. The auspicious launch was conducted in Ramanaidu Studios Temple in Hyderabd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X