twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓకే చెప్తాడా?: పవన్ కళ్యాణ్ తో ఇంకో రీమేక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇంకో భాషలో హిట్టైన చిత్రాలు రీమేక్ చేయటం హీరోలకు కొత్తేమీ కాదు. ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుందని కోట్లతో నడిచే ఈ సిని బిజినెస్ లో అందరూ భావిస్తూంటారు. అందులో భాగంగా రీమేక్ లను ఎన్నుకుంటూంటారు. హిందీ చిత్రం దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పవన్ ఇప్పుడు ఓ మైగాడ్ రీమేక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరో రీమేక్ కు కూడా ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు కత్తి.

    తమిళంలో ఎ.ఆర్ మురగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి హిట్ టాక్ ని నమోదు చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని చిత్రం రైట్స్ తీసుకున్న ఠాగూర్ మధు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ దాన్ని పవన్ చూడలేదని, ఆయనకి ఓ షో వేసి చూపి, నచ్చితే డబ్బింగ్ ఆపి, పవన్ తో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మరి పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రం ఒకే రోజున రూ.15.50 కోట్లు వసూలు చేసి రికార్డుకెక్కింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మొదట్లో ఈ చిత్రం విడుదలకు కొన్ని తమిళ సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. చిత్రం విడుదలను అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రకటించారు. చివరికి నిరసన కారులతో చిత్ర బృందం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది. దీపావళి పండుగ రోజున విడుదలైంది. తొలిరోజే 15.50 కోట్ల మొత్తం వసూలైంది. ఇప్పటివరకూ 23 కోట్లు వసూలు చేసింది.

    Pawan Kalyan in Vijay's Kaththi remake?

    ఇక పవన్ చేస్తున్న గోపాల గోపాల విషయానికి వస్తే...

    కిషోర్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ముఖ్య భూమిక పోషిస్తోంది. శరత్‌మరార్‌, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    ఇటీవల హైదరాబాద్‌ శివార్లలో క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కించారు. వెంకటేష్‌, శ్రియ, మిథున్‌ చక్రవర్తి తదితరులపై చిత్రీకరణ జరిపారు. త్వరలో మరో షెడ్యూల్‌ షూటింగ్ మొదలవుతుంది.

    దర్శకుడు కిషోర్‌ పార్థసాని(డాలీ) మాట్లాడుతూ... " అప్పుడప్పుడు మాటల సందర్భంలో 'మీకు సమాధానం చెప్పాలంటే ఆ దేవుడే దిగిరావాలి బాబూ...' అంటుంటాం సరదాగా! అయితే నిజంగానే ఒక భక్తుడి సందేహాల్ని నివృత్తి చేయడానికి ఆ దేవుడు దిగొచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణావతారంలో. మరి కళ్లముందు కనిపించిన ఆ దేవుడితో భక్తుడు ఏం మాట్లాడాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే" అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ.. ''దేవుడినే సవాల్‌ చేసిన ఓ భక్తుడి కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి పంచే వినోదాలు అందరికీ నచ్చుతాయి''అని చెప్తున్నారు.

    సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీక్షాపంథ్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

    పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు. ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్ మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.

    ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

    ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, శరత్‌మరార్‌. సురేష్‌బాబు నిర్మాతలు.

    English summary
    Tagore Madhu who bought the Telugu rights of Kaththi planned to remake it with Pawan Kalyan rather releasing directly,As the movie related to social issues Tagore Madhu believed that it will impress him and accept it do in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X