twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, చిరు లపై మళ్లీ వర్మ ఘాటు సెటైర్లు, పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

    నేను పవన్‌కల్యాణ్‌ వీరాభిమానిని. పవన్‌కీ, పవనిజమ్‌కీ తేడా ఉంది. పవనిజమ్‌ అనేదానికి అసలు అర్థమే లేదు అన్నారు రామ్ గోపాల్ వర్మ.

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాల కన్నా , ఆయన చేసే ట్వీట్స్ కోసం ఎదురుచూసే అభిమానులు పెరిగిపోయారు. ఆయన ఎవరినీ లెక్క చేయకుండా తనదైన చిత్ర విచిత్ర ట్వీట్ల చేస్తూ వివాదాలు లేపుతూంటారు. ఈ ట్వీట్ల‌లో కొంద‌రిని తిడుతారు..మ‌రికొంద‌రిని పొగుడుతారు.

    అలా రెగ్యులర్ గా వర్మ స్పందించే ట్వీట్ లిస్టు లో పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. సమయం చిక్కినప్పుడల్లా పవన్ పై వర్మ కామెంట్ల వర్షం కురిపిస్తూనే వుంటారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారారు.

    అలాగే వర్మలా మాట్లాడడం, ఆలోచించడం, జీవించడం ఓ గొప్ప ఆర్ట్‌ అని ఆయన అభిమానులు నమ్ముతుంటారు. దానికి తగ్గట్టుగానే వర్మ చేష్టలుంటాయి. ట్వీట్‌ చేసినంత ఈజీగా సినిమాలు తీస్తుంటారు. సినిమాల్లోనూ ఇవ్వనంత కిక్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుతుంటారు.

    ఇప్పుడు వర్మ నుంచి మరో సినిమా వస్తోంది. అదే 'వంగవీటి'. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ ...పవన్ గురించి ప్రస్తావించారు.

    టైమ్ వచ్చినప్పుడు

    "పవన్ కళ్యాణ్ నిదరపోతున్న అగ్ని పర్వతం లాంటి వాడ‌న్నారు.. అప్పుడపుడు గుడ గుడ లాడుతూ పొగలోదులుతుంటాడు... టైం వచ్చినప్పుడే పేల్తాడు" అని ట్వీట్ చేశాడు వర్మ.

    అందుకోసమేనా

    అందుకోసమేనా

    ఇటివల పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఈ నేపధ్యంలో వర్మ ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అగ్ని పర్వతం పేలితే అందులో నువ్వు మాడి మసైపోతావు అనే అర్దం వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

    నలభై గంటలు మాట్లాడతా..

    నలభై గంటలు మాట్లాడతా..

    పవన్‌కి నేను వీరాభిమానిని. అయితే... పవనిజం అనే కాన్సెప్ట్‌ నాకు అర్థం కాలేదు. రామూఇజం గురించి నేను నలభై గంటలు మాట్లాడతా. పవనిజం గురించి ఆయన నాలుగు నిమిషాలైనా మాట్లాడగలరా? అని సూటిగా ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ.

    వ్యక్తిగా పవన్ ...

    వ్యక్తిగా పవన్ ...

    నేను పవన్‌కల్యాణ్‌ వీరాభిమానిని. పవన్‌కీ, పవనిజమ్‌కీ తేడా ఉంది. పవనిజమ్‌ అనేదానికి అసలు అర్థమే లేదు. రామూయిజమ్‌ మీద నేను 45 గంటలు మాట్లాడాను. నాకు తెలిసి పవనిజమ్‌ మీద పవన్‌కల్యాణ్‌ ఓ ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. వ్యక్తిగా అతను ఏ అంశం మీద అయినా మాట్లాడగలడు.

    అగ్నిపర్వతం...

    అగ్నిపర్వతం...

    నాకు తెలిసి పవన్‌ నిద్రపోతున్న ఓ అగ్విపర్వతం. అప్పుడప్పుడూ అగ్నిపర్వతం బుసబుసమంటూ పొగలు కక్కుతుంటుంది. కానీ ఏదో ఓ రోజు అగ్నిపర్వతం బద్దలవ్వడం ఖాయం.పవన్‌ కల్యాణ్‌ మీదా మీ ట్వీట్ల ప్రవాహం సాగుతోంది? అని వర్మని ప్రశ్నిస్తే ఆయన ఇలా సమాధానమిచ్చారు.

    అందరినీ గమనిస్తూ పవన్

    అందరినీ గమనిస్తూ పవన్

    ఇజమ్‌కి, వ్యక్తికి తేడా ఏంటంటే... కార్ల్‌మార్క్స్‌ అనేవాడు కమ్యునిజమ్‌పై పుస్తకం రాశాడు. కానీ, తానేం చేయలేదు. ఎక్కడో ఉన్న మావో, లెనిన్‌ అందులో అంశాలను తీసుకుని సమాజానికి చాలా చేశారు. అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్‌ చేస్తున్నవి చూస్తున్నాను. నా ఉద్దేశంలో పవన్‌కల్యాణ్‌ నిద్రలో కూడా మధ్య మధ్యలో అందర్నీ గమనిస్తూ ఉంటాడు అని అన్నారు వర్మ.

    తెలివితక్కువవాళ్లకి..

    తెలివితక్కువవాళ్లకి..

    గ‌తంలో పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరన్నారు. పవన్‌కల్యాణ్‌ తెలివైన ఆలోచనలు, ఉద్యమ ప్రణాళికలను తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంద‌ని రాసుకొచ్చాడు వ‌ర్మ‌.

    ఇమేజ్ అవరోధం...

    ఇమేజ్ అవరోధం...

    చిరంజీవిగారితో, ఆయన ఇమేజ్‌తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు. కానీ, ఓ అభిమానిగా 'బాహుబలి' కంటే భారీ సినిమాలో ఆయన్ను చూడాలని కోరుకుంటున్నా. నేను ఎక్కువగా రియలిస్టిక్‌ సినిమాలు తీస్తా. ఆ యా సినిమాలకు తెలుగులో స్టార్‌ హీరోల ఇమేజ్‌ అవరోధం అవుతుందేమో అన్నారు రామ్ గోపాల్ వర్మ.

    తప్పుకాదు కదా...

    తప్పుకాదు కదా...

    చిరంజీవి 150వ సినిమా గురించి మీరు రకరకాల ట్వీట్లు చేస్తున్నారు. సంక్రాంతి వార్‌ వన్‌సైడ్‌ అంటున్నారు...అనే ప్రశ్నకు వర్మ సమాధానమిస్తూ...చిరంజీవి అంటే నాకు అభిమానం. ఓ అభిమానిగా ఆయన ‘బాహుబలి' కంటే పెద్ద సినిమా తీయాలనుకోవడం తప్పు కాదు కదా? ‘గౌతమిపుత్ర శాతకర్ణి' కోసం క్రిష్‌ పెడుతున్న ఎఫర్ట్‌ నచ్చింది. అందుకే అలా అన్నా.

    కావాలంటే నాగ్ తో..

    కావాలంటే నాగ్ తో..

    నాగార్జున ‘శివ 2' చేయమంటున్నారు... కాని ‘శివ'కు సీక్వెల్‌ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే ‘శివ' సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతగా కావాలంటే నాగార్జునతో యాక్షన్‌ సినిమా చేస్తా అని తేల్చి చెప్పారు వర్మ.

    అదే నాకు ఆసక్తి కలిగించింది

    అదే నాకు ఆసక్తి కలిగించింది

    జయలలిత స్నేహితురాలు 'శశికళ'పై తీయనున్న సినిమా వచ్చే తమిళనాడు ఎన్నికల సమయంలో విడుదల చేయాలనేది ప్లాన్‌. జయలలితతో పోలిస్తే, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఓ పార్టీని, రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చిన 'శశికళ' బయోగ్రఫీ నాకు ఆసక్తి కలిగించింది.

    నమ్మకం, ఇష్టం రెండూ లేవు

    నమ్మకం, ఇష్టం రెండూ లేవు

    ఈమధ్య ఎక్కువగా పాటలు పాడుతున్నారు... అని ఆయనతో అంటే... నా నోటికి ఎవరైనా ప్లాస్టర్‌ వేసేంత వరకూ పాడుతూనే ఉంటాను అన్నారు. ఇక మీరూ రాజకీయాల్లో చేరొచ్చు కదా? అని ప్రశ్నిస్తే... నాకు ప్రజాసేవపై నమ్మకం, ఇష్టం రెండూ లేవు అని చెప్పారు వర్మ.

    రెండు మూడేళ్లు పడుతుంది

    రెండు మూడేళ్లు పడుతుంది

    అమితాబ్‌ బచ్చన్‌ 'సర్కార్‌-3' షూటింగ్‌ పూర్తయింది. మార్చిలో రిలీజ్‌ చేస్తాం. వచ్చే ఏడాది హాలీవుడ్‌ సినిమా 'న్యూక్లియర్‌' షూటింగ్‌ ప్రారంభిస్తా. సుమారు ఓ రెండు, మూడేళ్లు 'న్యూక్లియర్‌'తోనే సరిపోతుంది అన్నారు వర్మ.

    ఒట్ల మీద నిలబడనని..

    ఒట్ల మీద నిలబడనని..

    ఇకనుంచి గర్వపడే మంచి సినిమాల్నే తీస్తా... కావాలంటే ఒట్టు అన్నారు... అని వర్మతో అంటే... నేను ఒట్లమీద నిలబడనని మీ అందరికీ తెలుసు కదా? (నవ్వుతూ). కానీ ‘వంగవీటి' మాత్రం నా చివరి సినిమానే. దాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోండి అన్నారు రామ్ గోపాల్ వర్మ.

    ఆ భయంతోనే..

    ఆ భయంతోనే..

    ‘వంగవీటి' మీ చివరి తెలుగు చిత్రం అని చెప్పడానికి కారణం చెప్తూ... ఇంత కంటే గొప్ప కథ నాకు దొరకదన్న భయంతో. ‘న్యూక్లియర్‌' అనే ఓ సినిమా తీస్తున్నా. దానికి మూడేళ్ల సమయం పడుతుంది. అలాగే.. ‘నయీం', ‘శశికళ' ఇలా చాలా సినిమాలు ప్రకటించుకొంటూ వెళ్తున్నారు. అవన్నీ ఎప్పుడు తీస్తారు? నా ఇష్టం వచ్చినప్పుడు అని సమాధానమిచ్చారు.

    కలిసి మాట్లాడింది లేదు

    కలిసి మాట్లాడింది లేదు

    వంగవీటి రంగ, రాధ, మురళి వీళ్లని కలుసుకొని మాట్లాడింది లేదు. చూశానంతే! వాళ్లకు సంబంధించిన చాలామంది వ్యక్తుల్ని కలిశా. వాళ్లు చెప్పిన విషయాల్లో నమ్మశక్యంగా ఉన్న వాటినే తీసుకొన్నా. విజయవాడలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాన్ని నా కోణంలో చూపిస్తున్నానంతే. ఓ దర్శకుడిగా నాకా స్వేచ్ఛ ఉంది అన్నారు వర్మ.

    పిక్షనల్ సినిమాగా చూస్తారు

    పిక్షనల్ సినిమాగా చూస్తారు

    'గాడ్‌ ఫాదర్‌'లో అమెరికన్‌ మాఫియా గురించి చూపించారు. ఎంత మందికి అక్కడి మాఫియా గురించి తెలుసని సినిమా చూశారు. అలాగే 'షోలే' చూశారు. 'వంగవీటి' విజయవాడ కథైనా ప్రేక్షకులం దరూ చూస్తారు. విజయవాడ ప్రేక్షకులు సినిమాలో ఏముందో తెలుసుకోవాలని చూస్తే, మిగతావాళ్లు ఫిక్షనల్‌ సినిమాగా చూస్తారు.

    ఎవరికీ చెందిన వాడిని కాదు

    ఎవరికీ చెందిన వాడిని కాదు

    బెజవాడలోని బలమైన రెండు సామాజిక వర్గాల్లో ఏ ఒక్క వర్గానికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా తీసిన చిత్రమిది. అందువల్ల, ఎవరి మనోభావాలూ దెబ్బ తినే అవకాశం లేదనుకుంటున్నా! నేను ఏ వర్గానికీ చెందిన వ్యక్తిని కాదు. 'వంగవీటి రాధా అనే రౌడీని చంపే శారు' అని మా చినమావయ్య చెప్పారు. అప్పుడు రాధా, రౌడీ పదాల్ని తొలిసారి విన్నా. అందుకే, 'వంగవీటి' అని టైటిల్‌ పెట్టా.

    ఎన్టీఆర్ పాత్ర ఏంటనేది

    ఎన్టీఆర్ పాత్ర ఏంటనేది

    వంగవీటి కుటుంబంలో రాధా, రంగా, దేవినేని కుటుంబంలో గాంధీ, మురళి... చనిపోయారు. వాళ్లను ఎలా చంపారు? చంపడానికి ప్రేరేపించిన ఘటనలు ఏంటి? అనేవి చిత్రంలో చూపించాను. ఓ గ్రూప్‌గా ఉన్న వీళ్లంతా వేరుపడిన సందర్భాలు చూసి బాధ కలుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

    చంపిన ప్లాన్ ఏమిటో..

    చంపిన ప్లాన్ ఏమిటో..

    ఇందులో చూపించినవన్నీ నిజాలేనా? అని అడిగితే... నా సమాధానం ఒకటే... నేను నమ్మిన నిజాలను చూపించా. ఉదాహరణకు చలసాని వెంకటరత్నం 72 కత్తిపోట్లతో మరణించాడన్నారు. '72 కత్తిపోట్లు పొడిచేవరకూ మనిషి బతుకుతాడా?' అని నేను నమ్మలేదు. వెంకట రత్నాన్ని చంపిన 12 మందిలో ఒకతను అప్పట్లో చంపడానికి వేసిన ప్లాన్‌ ఏమిటో నాతో చెప్పాడు. అప్పుడు నమ్మకం కలిగింది. అతడితో మాట్లాడిన తర్వాత సినిమా ఎలా తీయాలనే స్పష్టత వచ్చింది.

    వేరు చేసి చూడలేను

    వేరు చేసి చూడలేను

    విజయవాడలో జరిగిన కొన్ని సంఘటనల గురించి నాకు బాగా తెలుసు. అవి నా జీవితంలోని భాగాలే. ఈ కథని ఒక సినిమాగా వేరు చేసి చూడలేను. విజయవాడలో చదువుకునే రోజుల్లో జరిగిన ఆ సంఘటనల్లో నేను కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను.ఆ రోజుల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యమైన పెద్ద రౌడీల్లో ఎవరినీ కలవలేదు కానీ వాళ్ళ అనుచరుల కదలికల్ని మాత్రం చాలా దగగర్నుంచి గమనించాను.

    సడన్ గా కత్తులతో ...

    సడన్ గా కత్తులతో ...

    నేను కాలేజీలో చ‌దువుతున్న రోజుల్లో 400 స్టూడెంట్స్ హోలీ పండుగ సంద‌ర్భంగా సంద‌డి చేసుకుంటూ వెళుతున్నాం. ఓ గ్యాంగ్ వెళుతున్న కారును ఆపి బ‌య‌ట‌కు దిగ‌మ‌ని అడ్డుప‌డితే...స‌డ‌న్ గా ఆ కారులోంచి క‌త్తులుతో దిగారు అది చూసి నేను షాక్. నేను రౌడీల‌ను చూడ‌డం అదే ఫ‌స్ట్ టైమ్ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

    ఆ పాత్రకు సెట్ అయ్యాడు

    ఆ పాత్రకు సెట్ అయ్యాడు

    పూరి జగన్నాథ్‌ ఆఫీసులో ఓ పార్టీకి వెళ్లినప్పుడు సందీప్‌ (శాండీ)ని చూశా. రాధా ఫొటో చూపించి ఈ గెటప్‌లో నీ ఫొటోలు పంపమని అడిగా. రెండో రోజు సాయంత్రానికి ఫొటోలు పంపించాడు. పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. వారం తర్వాత రంగా పాత్రలో కూడా సందీప్‌ నటిస్తే ఎలా ఉంటుందనుకున్నా. మళ్లీ రంగా గెటప్‌లో ఫొటోలు పంపమన్నా. రంగా పాత్రకీ సెట్‌ అయ్యాడు.

    ఇమేజ్ కాకుండా..

    ఇమేజ్ కాకుండా..

    నాకు దేవుడు ఇచ్చిన బహుమతి సందీప్‌. సినిమాలో చాలా బాగా నటించాడు. ఓ ఇమేజ్‌ ఉన్న నటుడయితే... మరణించే సన్నివేశాలతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేడు. కొత్త వాళ్లయితే ఇమేజ్‌ కాకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే ఎస్టాబ్లిష్‌ అవుతాయి. అందువల్ల, సినిమాలో ప్రధాన పాత్రలన్నిటికీ కొత్తవాళ్లను తీసుకున్నా.

    ఎనభై కార్లు తెచ్చాడు

    ఎనభై కార్లు తెచ్చాడు

    దాసరి కిరణ్ మంచి నిర్మాత. సినిమా కోసం నేనేం కావాలన్న వెంటనే చేసేవాడు. ఒక రోజు షూటింగ్ కోసం 100 అంబాసిడర్ కార్లు కావాలని అడిగాను, పక్క రోజుకల్లా 80 కార్లు తెచ్చి పెట్టాడు. ఈ సినిమాలో వాటినే ఎక్కువగా వాడాం. ఇప్పుడు అంబాసిడర్‌ కార్లు ఎక్కడా లేవు. ఎలా ఏర్పాటు చేశాడని ఆశ్చర్యపోయా.

    English summary
    RGV Said: "I am a huge fan of Pawan Kalyan. I know Pawan means, but I don't understand Pawanism. He is like a dormant 'agni parvatham'. When the time is ripe, he will burst forth like a colossus. He will do great in the next Assembly elections."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X