twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైమాలోనూ 'గబ్బర్‌సింగ్‌' హంగామా

    By Srikanya
    |

    హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గత సంవత్సరం విడుదలై రికార్డుల మీద రికార్డుల సృష్టించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ మీద ఉన్న క్రేజ్....ఫుల్లీ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్ట్ వెరసి గబ్బర్ సింగ్ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిపాయి. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది... అంటూ 'గబ్బర్‌సింగ్‌'గా పవన్‌కల్యాణ్‌ చక్కటి వినోదాన్ని పంచారు. ప్రశంసలతో పాటు ఇప్పటికే పలు పురస్కారాలను సొంతం చేసుకొందీ చిత్రం.

    తాజాగా సైమా (సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌)-2013లోనూ సందడి చేస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో ఈ పురస్కారాల ప్రదాన వేడుక జరుగుతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ ఇందులో పాల్గొనబోతున్నాయి. పురస్కార విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

    ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలతో పాటు మొత్తం 13 నామినేషన్లను 'గబ్బర్‌సింగ్‌' సినిమా సొంతం చేసుకొంది. తమిళ చిత్ర పరిశ్రమ తరఫున 'తుపాకీ' అత్యధికంగా 10 నామినేషన్లు దక్కించుకొంది. కన్నడ తరఫున 'ఆధురి', మలయాళ చిత్ర పరిశ్రమ తరఫున 'స్పిరిట్‌' చిత్రాలు తొమ్మిది చొప్పున నామినేషన్లు దక్కించుకొన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో 'గబ్బర్‌సింగ్‌'తో పాటు 'బిజినెస్‌మేన్‌', 'ఈగ', 'ఇష్క్‌', 'రచ్చ', 'ఢమరుకం' తదితర చిత్రాలు కూడా పలు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకొన్నాయి.

    'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు... స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.

    సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Pawan Kalyan movie Gabbar Singh is all set to roar once again showing its power at South Indian International Movie Awards (SIIMA) which will be held on September 12th and 13th respectively in UAE. SIIMA organisers and panel of judges nominated Gabbar Singh for 13 categories including the best actor, male and female. Shruthi Haasan has played female lead role opposite to Pawan. Harish Shankar has direct the movie. Harish Shankar said ‘Gabbar Singh' has been nominated in almost every popular category. We are hoping for a clean sweep.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X