twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్దార్‌...’ ఆడియో లాంచ్ వెన్యూ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : . పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పాటల విడుదల వేడుక ఈ రోజు (ఆదివారం) సాయింత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వెన్యూ దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడ చూసినా పవన్..సర్దార్ చిత్రంలోని ఫొటోలతోరెడీ చేసారు.

    చాలా గ్రాండ్ గా ఈ ఆడియో లాంచ్ జరగనుంది. చిరంజీవి ఛీప్ గెస్ట్ గా వస్తున్న ఈ ఆడియో లాంచ్ వెన్యూకు సంభదించిన ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ఆడియో లాంచ్ కు సంభందించిన అన్ని జాగ్రత్తలు, ముఖ్యంగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పూర్తి చేసారు.

    సెక్యూరిటీ విషయమై పవన్ పూర్తిగా దృష్టి పెట్టారు. దాంతో పాస్ లు ఇచ్చిన వారికే లోపలకు ఎంట్రీ ఇస్తున్నారు. పాస్ లు సైతం చాలా తక్కువ మందికే చేరాయి. దాంతో ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద పాస్ లుకావాలంటూ ధర్నా సైతం జరిగింది.

    ఆడియో లాంచ్ వెన్యూ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

    నాకు బాధ

    నాకు బాధ

    ‘‘అభిమానులు నా సినిమా వేడుకలకు హాజరై క్షేమంగా ఇంటికి తిరిగెళ్లకపోతే నాకే బాధ. అందుకే బహిరంగ వేడుకలు నిర్వహించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాన''అన్నారు పవన్‌కల్యాణ్‌.

    టీవిల్లో చూడండి

    టీవిల్లో చూడండి

    ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' వేడుకకు ఎంట్రీ పాసులు ఉన్నవాళ్లే రావాలని, లేనివాళ్లు ఇంట్లోనే టీవీల్లో వీక్షించాలని కోరారు

    సహకరించండి

    సహకరించండి

    ఈ వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని, అందుకు అభిమానులంతా సహకరించాలని పవన్‌ కల్యాణ్‌ శనివారం మీడియా సమావేశంలో కోరారు.

    జ్వరంతో బాధపడుతున్న

    జ్వరంతో బాధపడుతున్న

    పవన్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన ‘సర్దార్‌...' కార్యాలయంలో మాట్లాడారు.

    అభ్యంతరాలు

    అభ్యంతరాలు

    పాటల వేడుక నిర్వహణ కోసం పోలీసువారిని సంప్రదించినప్పుడు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారనీ, అందుకే శుక్రవారందాకా వేడుక నిర్వహించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నామని చెప్పారు పవన్‌.

    వ్యక్తిగతంగా

    వ్యక్తిగతంగా

    నిర్మాత శరత్‌మరార్‌ వ్యక్తిగతంగా వెళ్లి పోలీసులను సంప్రదించిన నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్‌ సీవీ ఆనంద్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు అందించిన సహకారంతో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు.

    దాంక్స్

    దాంక్స్

    ఈ సందర్భంగా మంత్రులకీ, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు పవన్‌.

    ఎందుకంటే..

    ఎందుకంటే..

    ‘‘ఇదివరకు జరిగిన కొన్ని సినిమాల వేడుకలు, ‘గోపాల గోపాల' పాటల విడుదల వేడుక విషయంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యానే పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    ముఖ్యంగా...

    ముఖ్యంగా...

    హోటల్‌లో విదేశీ అతిథులు ఉంటారు కాబట్టి అక్కడేమైనా జరిగితే అంతర్జాతీయస్థాయిలో సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని పోలీసులు తెలిపారు.

    చెప్పా..కానీ

    చెప్పా..కానీ

    ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వేడుకని రద్దుచేయమని నిర్మాతలకి చెప్పా. కానీ ప్రమోషన్ కోసం తప్పటం లేదు అన్నారు.

    కాబట్టి

    కాబట్టి

    అభిమానులెవ్వరూ వేడుక దగ్గర గుమికూడరాదని విన్నవిస్తున్నా.

    పరిమితుల మధ్య...

    పరిమితుల మధ్య...

    తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సహకారంతో ఇప్పుడు కొన్ని పరిమితుల మధ్య వేడుక జరుపుతున్నాం.

    ప్రేమతో

    ప్రేమతో

    అభిమానులకి నేను ప్రేమతోనే చెబుతున్నా. నేను చెబితే వాళ్లు తప్పకుండా వింటారు'' అన్నారు పవన్

    అదనపు బలగాలతో

    అదనపు బలగాలతో

    పాటల విడుదల వేడుక దగ్గర అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

    అక్కడ కూడా..

    అక్కడ కూడా..

    హోటల్‌లో కాకుండా నిజాం కాలేజీ గ్రౌండ్‌లో వేడుక ఏర్పాటు చేద్దామని కూడా ఆలోచించామని, కానీ అక్కడ కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని పోలీసులు చెప్పినట్టు పవన్‌ తెలిపారు.

    చిరంజీవి అతిథిగా

    చిరంజీవి అతిథిగా

    ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పాటల విడుదల వేడుకకి తన సోదరుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు పవన్‌ తెలిపారు.

    అప్పుడు కూడా..

    అప్పుడు కూడా..

    ‘‘ఇదివరకు ‘గబ్బర్‌సింగ్‌' పాటల విడుదల వేడుకకి అన్నయ్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ‘జానీ' తర్వాత...

    ‘జానీ' తర్వాత...

    నేను పూర్తిస్థాయిలో రాసిన స్క్రిప్టు ఇదే. అందుకే అన్నయ్యను పాటల వేడుకకి ఆహ్వానించినట్టు పవన్‌ తెలిపారు.

    అవకాసమొస్తే..

    అవకాసమొస్తే..

    అన్నయ్య సినిమాలో నటించడానికి ఎప్పుడూ ఇష్టపడతానని, అవకాశమొస్తే ఆయన 150వ సినిమాలో భాగమవుతానన్నారు.

    అక్కడే

    అక్కడే

    అన్నయ్య ఇంటి దగ్గరే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్‌ వేశాం కాబట్టి సరదాగా వచ్చి సెట్‌ చూశారని, ఇద్దరం కాసేపు మాట్లాడుకొన్నామని తెలిపారు పవన్‌.

    ఏదో కొద్దిగా..

    ఏదో కొద్దిగా..

    సినిమాలో వీణ స్టెప్‌ వేశారట కదా అనడిగతే ‘‘ఏదో కొద్దిగా ప్రయత్నించాను. అయితే అన్నయ్యే నాకంటే బాగా వేశారు''అన్నారు పవన్‌.

    కారణం..

    కారణం..

    ఈ కథ ఖమ్మం, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల నేపథ్యంలో జరుగుతుంది. హిందీ వాతావరణం ఉంటుంది.

    పైగా q

    పైగా q

    దీనికి ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వాళ్ల నిర్ణయం మేరకే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నాము''అని తెలిపారు.

    వర్మ అభిప్రాయాన్ని గౌరవిస్తా

    వర్మ అభిప్రాయాన్ని గౌరవిస్తా

    రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లని నేనూ చదువుతుంటా. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా'' అన్నారు.

    కెపాసిటీ ఎంతుంటే..

    కెపాసిటీ ఎంతుంటే..

    ‘‘నా సినిమా మరొక సినిమాతో పోటీ పడాలని మాత్రం నేనెప్పుడూ అనుకోను. దాని కెపాసిటీ ఎంతుంటే అంత ఆడుతుంది''అన్నారు పవన్‌.

    నెక్ట్స్

    నెక్ట్స్

    తదుపరి ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో నటిస్తున్నట్టు పవన్‌ తెలిపారు.

    నో డైరక్షన్

    నో డైరక్షన్

    ఇక తాను దర్శకత్వం చేసే ఉద్దేశం మాత్రం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన.

    విజన్ కోసం

    విజన్ కోసం

    ‘‘నాకంటూ ఒక విజన్‌ ఉంటుంది. ఆ విజన్‌ కోసమని సెట్‌లో అందరినీ ప్రభావితం చేస్తుంటా.

    కోపం వచ్చే అవకాసం

    కోపం వచ్చే అవకాసం

    ఆ సమయంలో విసుగు, కోపంలాంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే దర్శకత్వం ఎందుకులే అనుకొంటుంటా'' అన్నారు.

    లేదు..

    లేదు..

    ఇక సినిమాలకి గుడ్‌ బై చెప్పబోతున్నారట కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘‘నిజానికి ‘ఖుషీ' తర్వాత నాలుగైదు విజయాలు వచ్చుంటే వదిలేసేవాణ్నేమో. అది రాజకీయ ప్రవేశం కోసమని కాదు. వరుసగా సినిమాలు చేయాలంటే నాకు అలసటగా ఉంటుంది'' అన్నారు.

    English summary
    Power star Pawan Kalyan's much awaited flick Sardaar Gabbar Singh is nearing completion and fans are eagerly waiting to watch the movie audio function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X