twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ త్రివిక్రమ్ కథ ఇదేనా..!? సోషల్ మీడియాలో చక్కర్లు

    పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబో మూవీ షూటింగ్‌ ఏప్రిల్‌ 6 నుంచి మొదలవుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర కథ ఇదే అంటూ ఒక కథ వినిపిస్తోంది.

    By Rajababu
    |

    పవర్ స్టార్ కాటమరాయుడు రిలీజయింది. ఓ వైపు ఈ సినిమా రిలీజయిన ప్రతి సెంటర్ లోను రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉంది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఫార్మాలిటీస్ అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ సినిమాని ఏప్రియల్ 6 నుండి సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఆల్ రెడీ ప్యాకప్ చెప్పేసిన త్రివిక్రమ్ ఈ సినిమాని పవర్ స్టార్ స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

    'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'

    'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'

    బయ్యర్ల సంక్షేమం కోసమని తీసిన 'కాటమరాయుడు' చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో లాగించేసారు. నిజం చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వ్యాల్యూ చాలా తక్కువ ఈ సినిమాకి. సరే ఉన్నంతలో లాగించేసారు. అమ్మకాలు బాగానే జరిగాయి. కానీ పవన్ సినిమా అంత తక్కువ నిర్మాణ విలువ కలిగి ఉండటం తో పడ్డ దెబ్బ కూడా మరీ చిన్నదని తీసిపారేయలేం.

    ఈ సినిమాకు సంబంధించి

    ఈ సినిమాకు సంబంధించి

    హీరో పవన్ కళ్యాణ్ తప్ప ఇతర నటీనటులు ఎవరూ ఖరారు కాలేదు. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఈమూవీకి ‘కాటమరాయుడు' రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ బిజినెస్ అయ్యే ఆస్కారం ఉంది.

    అయితే కథా పరంగా,

    అయితే కథా పరంగా,

    నిర్మాణ విలువల పరంగా ఎక్కడా క్వాలిటీ పాటించని కాటమరాయుడిని మరిపించడానికి త్రివిక్రమ్‌ సినిమా వెంటనే సెట్స్‌ మీదకి వెళుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టంట్‌ మాస్టర్‌ విజయన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేయనున్నారట. ఏప్రిల్‌ 6 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది.

    దసరాకి సినిమా విడుదల

    దసరాకి సినిమా విడుదల

    చేసేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అయితే ఇంతవరకూ నిజమో అర్థం కావటం లేదు కానీ ఒక కథ మాత్రం కొన్ని వెబ్ సైట్లలో కనిపిస్తోంది. ఈసినిమా కథ ఒక రివెంజ్ స్టోరీ అట. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచన .

    అందుకోసమే అతడి జీవితంలో

    అందుకోసమే అతడి జీవితంలో

    ఇద్దరు భార్యలు రెండు వ్యాపారాలు రెండు ఇళ్ళు అదేవిధంగా రెండు ఆఫీసులు ఇలా ప్రతివిషయంలోను రెండు లేకుండా అతడి జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థుతులలో పవన్ తండ్రిని అతడి వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపేస్తారు

    దీనితో రెండవ భార్య కొడుకు

    దీనితో రెండవ భార్య కొడుకు

    అయిన పవన్ ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవతి కొడుకు పవన్ ను తండ్రిని శత్రువుల పై పగను తీర్చుకోమని చెపుతుందట. ఈ కథ కోసం చాల కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది.

    దీనితో

    దీనితో

    రెండు భారీ ఇళ్ళు రెండు భారీ ఆఫీసులు పక్కపక్కనే ఉండే విధంగా పవన్ తండ్రి క్యారెక్టర్ స్వభావరీత్యా డిజైన్ చేయించి చాల భారీ లుక్ ను ఈసినిమా కోసం త్రివిక్రమ్ తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేత చాల క్యాచింగ్ ట్యూన్స్ వచ్చే విధంగా త్రివిక్రమ్ ఈసినిమా ఆడియో విషయంలో కూడ చాల శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వెరైటీ కథ ఎంత వరకు నిజమో చూడాలి..

    English summary
    A story line roaming in filim nagar circles and some body says this is the story of the Upcoming Movie By Pawan and trivikram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X