»   »  పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమకథ ‘పెళ్లి పుస్తకం’

పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమకథ ‘పెళ్లి పుస్తకం’

Posted by:

హైదరాబాద్ : ప్రేమ కథలకు ముగింపు పెళ్లిళ్లు కాదు. అసలు ప్రేమకథ మొదలయ్యేది పెళ్లి తర్వాతే....అని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం 'పెళ్లి పుస్తకం'. 'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్, 'మేం వయసుకు వచ్చాం' ఫేం నీతి టేలర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. రామకృష్ణ మచ్చకంటి దర్శకుడు.

బి. నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్ నిర్మాతలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'హృదయాలకు హద్దుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. దర్శకుడు రామకృష్ణ చాలా పోయిటిగ్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 18 వరకు బ్యాంకాక్, మలేసియాల్లో హీరోహీరోయిన్లపై రెండు పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరు నుంచి పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది' అని తెలిపారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'గతంలో డైరీ చిత్రం చేసారు. ఇది నా రెండో సినిమా. బాపుగారి దర్శకత్వంలో గతంలో పెళ్లి పుస్తకం సినిమా వచ్చింది. కానీ ఈ పెళ్లి పుస్తకం కథ పూర్తి డిఫరెంటుగా ఉంటుంది. పెళ్లయిన ఓ జంట జీవితంలో ఎలాంటి ఓడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీరస్తు శుభమస్తు అనే సాంగ్ కూడా ఈచిత్రంలో పెడుతున్నాము' అని తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా కాశీ విశ్వనాథ్, నాగినీడు, శ్రవణ్, దేశానంది, అనిల్, జ్యోతి రెడ్డి, శ్రీనివాస్, యశస్విని తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం వివరాల్లోకి వెళితే... ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: నాగేంద్ర ప్రసాద్, ఫోటోగ్రఫీ: జవహర్ రెడ్డి ఎమ్.ఎన్, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: బి. నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్, కథ, దర్శకత్వం: రామకృష్ణ మచ్చకం

English summary
Actor Rahul Ravindran and actress Niti Taylor starrer Pelli Pustakam movie next schedule jan 09 to Jan 18 in Bangkok. Ramakrishna Machchakanthi directs this movie.
Please Wait while comments are loading...