» 

అందాల రాక్షసి హీరో....‘పెళ్లి పుస్తకం’

Posted by:

హైదరాబాద్: అందాల రాక్షసి ఫేం రాహుల్ హీరోగా 'పెళ్లి పుస్తకం' అనే చిత్రం ప్రారంభం అయింది. నీతి టేలర్ హీరోయిన్. లక్ష్మీ నరసింహా సినీ విజన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి-బి.వి.గోపాల్-పి.సుమన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రామకృష్ణ మంచ్చకంటి దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభ వేడుక జరిగింది. తొలి సన్నివేశానికి ఎ.రమేష్ ప్రసాద్ క్లాన్ నివ్వగా, శ్యాంప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేసారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'గతంలో డైరీ చిత్రం చేసారు. ఇది నా రెండో సినిమా. బాపుగారి దర్శకత్వంలో గతంలో పెళ్లి పుస్తకం సినిమా వచ్చింది. కానీ ఈ పెళ్లి పుస్తకం కథ పూర్తి డిఫరెంటుగా ఉంటుంది. పెళ్లయిన ఓ జంట జీవితంలో ఎలాంటి ఓడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. శ్రీరస్తు శుభమస్తు అనే సాంగ్ కూడా ఈచిత్రంలో పెడుతున్నాము' అని తెలిపారు.

తన కెరీర్ కి ఈచిత్రం బాగా ఉపకరిస్తుందని, తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని హీరో రాహుల్ వ్యాఖ్యానించగా, హీరోయిన్ నీతి టేలర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల మెప్పిస్తానని, తనకు అవకాశం ఇచ్చనిందుకు కృతజ్ఞతలు అని తెలిపింది.

ఈ చిత్రంలో ఇంకా కాశీ విశ్వనాథ్, నాగినీడు, శ్రవణ్, దేశానంది, జ్యోతి రెడ్డి, శ్రీనివాస్, యశస్విని తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం వివరాల్లోకి వెళితే... ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: నాగేంద్ర ప్రసాద్, ఫోటోగ్రఫీ: జవహర్ రెడ్డి ఎమ్.ఎన్, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: బి. నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్, కథ, దర్శకత్వం: రామకృష్ణ మచ్చకంటి.

Read more about: rahul, niti taylor, pelli pustakam, రాహుల్, నీతి టేలర్, పెళ్లి పుస్తకం
English summary
Actor Rahul Ravindran and actress Niti Taylor starrer Pelli Pustakam movie launched today at Ramanaidu studio. Ramakrishna Machchakanthi directs this movie.
Please Wait while comments are loading...