twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్....సినిమా పై సి.ఎం కు కంప్లైంట్

    By Srikanya
    |

    ముంబై: 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా ‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'బాజీరావ్‌ మస్తానీ'. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో, సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చారిత్రక సినిమాకి ఓ అడ్డు వచ్చి పడింది. 'బాజీరావ్‌ మస్తానీ' సినిమాకు వ్యతిరేకంగా బాజీరావ్ కుటుంబం నుండి మహరాష్ట్ర్ర ప్రభుత్వానికి లెటర్ అందింది.

    ఆ లెటర్ లో మహరాష్ట్ర్ర ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవీస్'కి బాజీరావ్ కుటుంబానికి చెందిన ప్రసాద్ రావ్ పేష్వా, వాస్తవ చరిత్రని పాడు చేసేవిదంగా ఉందని, సంజయ్‌ లీలా భన్సాలీ వాస్తవ చరిత్రని మార్చినందుకు, నేరాన్ని గుర్తించి ఈ విషయాన్ని పరిగణనలోకి తిసుకోవాలని విన్నవించుకున్నారు.

    ఈ ఉత్తారాన్ని గనుక మహరాష్ట్ర్ర ప్రభుత్నం పరిగణలోకి తిసుకోంటే డిసెంబర్ 18న రిలీజ్ అవ్వల్సినా ఈ సినిమా కష్టాల్లో పడినట్లే...ఎం జరుగుతుందో చూడల్సిందే అని బాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది.

    Peshwa descendant objects to 'Bajirao Mastani', writes to CM

    ఇక 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రం ట్రైలర్‌ రీసెంట్ గా విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. డిసెంబరు 18 వ తేదీ కోసం ప్రేక్షకుల ఎదురు చూసేలా చేస్తోంది.


    పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. ఆయన భార్యలుగా దీపికా, ప్రియాంకలు కనబడనున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

    మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ‘'ట్రైలర్ 'పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

    ఇక బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ధ‌రించే చీర‌లు చాల హైలెట్ అవుతాయని అంటున్నారు. స‌వ్వారి అని 11 మీట‌ర్లు పొడ‌వుండే మ‌రాఠీ సంప్ర‌దాయ చీర‌ను ప్రియాంక ధ‌రించ‌నుంద‌ని తెలుస్తోంది.

    English summary
    In a startling happening, producer and director of "Bajirao Mastani" has received a shock with descendants of Bajirao family appealing to Maharashtra government against the film. If Maharashtra government decides to take on the film, then the December 18th release of the movie will be in trouble.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X