twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైండ్ బ్లోయింగ్ లుక్...(చిరు 150 ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి... వయసు 60 సంవత్సరాలైనా నవయువకుడిలా వెలిగిపోతున్నారు. తాజాగా ఆయన 150వ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. సినిమా సెట్లో ఫిజిక్ పరంగా, లుక్ పరంగా ఆయన్ను చూసిన వారెవరైనా ఆయన వయసు 60 అంటే నమ్మకడం కష్టం.

    దర్శకుడు వివి వినాయక్ మెగా అభిమానులు, ప్రేక్షకులును ఊహించిన దానికంటే ఎక్కువగానే హ్యాండ్సమ్ గా 150వ సినిమాలో చూపించబోతున్నారు. చిరంజీవి అంటేనే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఆయన తెలుగు తెరపై తనదైన స్టైల్, డాన్స్, యాక్షన్స్ తో అదరగొట్టారు. ఆయన 150వ సినిమా కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతోంది.

    తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, అలీ పాల్గొనగా టాకీ పార్టుకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్ వచ్చే నెల 12వరకూ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో సన్నివేశాలు చిరంజీవి గారి అభిమానులకు కానీ, థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కానీ చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా ఆయన గ్లామర్ చూసి చాలా ముచ్చటపడిపోతారు. అంత గ్లామర్ గా ఉన్నారు’ అన్నారు.

    ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నా...

    'ఇక సినిమాలో పరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా ఉంటారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తారు. చిరంజీవి గారి కొత్త లుక్ తో కూడిన టీజర్ ని కూడా అభిమానుల కోసం త్వరలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఠాగూర్ తర్వాత చిరంజీవి గారితో మళ్లీ చాలా ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. ఇది ఆయనకు 150వ సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నానని వివి వినాయక్ తెలిపారు.

    అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఉంటాయి

    ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు. ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు. వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తాం. చరణ్ ఈ సినిమాని భారీగా నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. మంచి కథ, మంచి టెక్నీషియన్లతో సెట్స్ కొచ్చాం. అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా వస్తుందని ధైర్యంగా చెప్పగలను అన్నారు వినాయక్.

    ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్ .

    స్లైడ్ షోలో చిరు 150 ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్..

    మైండ్ బ్లోయింగ్ లుక్

    మైండ్ బ్లోయింగ్ లుక్

    చిరంజీవి 150వ సినిమా తొలి రోజు షూటింగ్ పిక్ ఇది. చిరంజీవి ఈ వయసులో ఇంత హ్యాండ్సమ్ గా కనిపిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.

    అంచనాలు ఏమాత్రం తగ్గకుండా..

    అంచనాలు ఏమాత్రం తగ్గకుండా..

    అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వివి వినాయక్.

    యువ హీరోలకు తీసిపోకుండా..

    యువ హీరోలకు తీసిపోకుండా..

    ఈ సినిమాలో ఈ తరం యువ హీరోలకు ఏ మాత్రం తీసి పోకుండా చిరంజీవి అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు మెగాస్టార్.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

    గర్వంగా

    గర్వంగా

    నాన్నా నాకు చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో సపోర్టు చేసారు. ఆయన 150వ సినిమాను తన తొలి ప్రొడక్షన్లో నిర్మించడం గర్వంగా ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

    కేక్ కటింగ్

    కేక్ కటింగ్

    చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కటింగ్.

    చిరు, వినాయక్

    చిరు, వినాయక్

    తొలి షాట్చి త్రీకరణ అనంతరం మానిటరింగ్ చేస్తున్న దృశ్యం.

    వరుణ్ తేజ్

    వరుణ్ తేజ్

    షూటింగ్ స్పాట్లో వరుణ్ తేజ్

    English summary
    "My father has always supported me in all my ventures and I am very happy to be able to do this for him.its Every child dreams of being able to pay his parents back for everything that they have done .I take immense pride in the fact that I started my production journey with my father...‪#‎chiru150th‬ ‪#‎konidelaproductioncompany‬" Ram Charan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X