»   » ఎన్టీఆర్ కోసం పాత కార్లు సేకరణ...పెద్ద షెడ్ (షెడ్ ఫొటోలు)

ఎన్టీఆర్ కోసం పాత కార్లు సేకరణ...పెద్ద షెడ్ (షెడ్ ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ అభిమానులకు ఆనందపరిచే న్యూసే ఇది. నాన్నకు ప్రేమతో చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. అతి త్వరలో సారధి స్టూడియోస్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

ఈ మేరకు దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ పనిచేసే గ్యారేజ్ ను.. దాని పరిసరాలను సెట్ వేశారు. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని చూసినవాళ్లు చెబుతున్నారు. మరి మీకూ చూడాలని ఆసక్తి ఉంటుంది కదా అందుకే బయిటనుంచి తీసిన ఆ ఫొటోలు మీకు అందచేస్తున్నాం.

మహేష్, చరణ్, ఎన్టీఆర్ ల గురించి కాజల్ (ఫొటో ఫీచర్)

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ జంటగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ లను అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమంతుడు నిర్మాతలు ...మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

సెట్ ఫొటోలు స్లైడ్ షోలో...

ప్రత్యేకంగా..

గ్యారేజీకి సంబంధించిన మెకానిక్‌ షెడ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కలిసేవిధంగా ఈ సెట్‌ డిజైన్ చేస్తున్నారు

 

పర్యవేక్షణలో..

కళా దర్శకుడు ఎ.ఎస్‌.ప్రకాష్‌ పర్యవేక్షలో ఈ సెట్‌ నిర్మాణమవుతోందని

 

మేదర్ షూట్..

చిత్రానికి సంభందించి మేజర్‌ చిత్రీకరణంతా ఈ సెట్లోనే జరుగుతుందని అంటున్నారు.

 

పాత కార్లు తెచ్చే పనిలో..

ఈ గ్యారేజ్ లోకి ఇప్పుడు పాత కార్లు తెచ్చే పనిలో ఉన్నారు టీమ్ . ఓ 15-20 పాత కార్లను గ్యారేజ్ లో చేర్చే పనిలో పడ్డారు యూనిట్.

 

ఒరిజనల్ గెటప్ తోనే..

గత రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్ చూపించిన ఎన్టీఆర్.. ఈ మూవీ కోసం తన ఒరిజినల్ గెటప్ నే ఎంచుకున్నాడని తెలుస్తోంది.

 

స్పెషల్ ఎట్రాక్షన్

సమంత - నిత్యామీనన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్న జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

 

అదిరే బిజినెస్

కాంబినేషన్స్ సూపర్బ్ గా ఉండడంతో.. ఇప్పటికే ఈ మూవీకి అన్ని ఏరియాల నుంచి మంచి బిజినెస్ జరుగుతోంది.

 

అందుకే

రెండవ హీరోయిన్ గా నిత్యామీనన్‌ ఎంపికైంది. కథ ప్రకారం ...మోహన్ లాల్ కి ధీటుగా.. చక్కటి అభినయాన్ని ప్రదర్శించే అమ్మాయి కావాలనే ఎంపిక చేసారని అంటున్నారు.

దేవయాని

ఈ సినిమాలో మోహన్ లాల్ భార్యగా దేవయాని కనిపించనుంది.

 

ప్రీ రిలీజ్ బిజినెస్

హీరోకు నాన్నకు ప్రేమతో హిట్, అటు దర్శకుడుకి శ్రీమంతుడు హిట్ ఉండటంతో బిజినెస్ ముందే జరిగిపోయింది.

 

English summary
A huge set for the film Janatha Garage is being erected currently in Sarathi Studios, Hyderabad. Art director Prakash is taking care of the set work where important part of the film is going to be shot.
Please Wait while comments are loading...