»   » పూరి కు నో , మిస్సైంది, అదే తొలి చిత్రం :రకుల్ అరుదైన విశేషాలు, అద్బుతమైన ఫొటోలు

పూరి కు నో , మిస్సైంది, అదే తొలి చిత్రం :రకుల్ అరుదైన విశేషాలు, అద్బుతమైన ఫొటోలు

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తో చేస్తున్న తని ఒరువన్ రీమేక్ షూటింగ్ లో త్వరలో జాయిన్ కాబోతున్న రకుల్ ప్రీతి సింగ్ ప్రస్తుతం తన తాజా చిత్రం సరైనోడు ప్రమోషన్ లో బిజీగా ఉంది. క్రితం శుక్రవారం రిలీజైన సరైనోడు చిత్రం మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా , కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కు సంతృప్తిని ఇస్తోంది. ఈ నేపధ్యంలో యూనిట్ వర్గాలు ప్రమోషన్స్ ని వేగవంతం చేసాయి. హీరోయిన్ ని రంగంలోకి దింపాయి.

అయితే ప్రమోషన్ ఈవెంట్ కన్నా ఆమె ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ చేసుకున్న డ్రెస్ లతో అందరినీ తన వైపుకు దృష్టి మరల్చేలా చేస్తోంది. ఆమెకు ఇప్పుడు ఫ్యాషన్ సర్కిల్స్ నుంచి అభినందనలు అందుతున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి కొద్దిగా అయినా తెలిసున్న వారు ఆమెను పొగిడేస్తూంటే, మిగతా వాళ్లు ఆమె అందంగా మెరిసిపోతోందంటూ కితాబులు ఇస్తున్నారు.

బహుశా, అందుకేనేమో ఆమె మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటోంది. ప్రమోషన్ ఈవెంట్స్ లో సైతం మీడియా దృష్టి, కెమెరా కన్ను ఆమెపైనే ఉంటోంది. ఈ క్రింద స్లైడ్ షో చూస్తే మీరూ నిజమే అని ఒప్పుకుంటారు.

నిజానికి ఈ అందం అంతా ఆమె డ్రస్ లో కాదు ఆమె విజయోత్సాహంలో ఉందని చెప్పాలి. సరైనోడు వంటి సరైన హిట్ కొట్టిన తర్వాత ఎవరైనా ఇలాగే మెరిసిపోతారేమో. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఇక ఆమె గురించి రాసేటప్పుడు ఐరన్ లెగ్ అని రాయటం మానేయచ్చు అన్నాడు. ఈ మధ్యకాలంలో ఆమె వరస సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో కొన్ని మీడియా సంస్దలు ఐరన్ లెగ్ అని రాయటం జరిగింది.

స్లైడ్ షోలో..ఆమె గురించి విశేషాలు, ఆమె అద్బుతమైన ఫొటోలతో ...

మొదటి సారి కెమెరా ముందు..

రెండేళ్లు... నేను మొట్టమొదట కెమెరా ముందు నటించినప్పుడు నా వయసు. చిన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉండేదాన్ని. మా అమ్మకు నన్ను టీవీలో చూడాలనిపించి ఓ చిన్న ఫొటో షూట్‌ చేయించి చిన్న పిల్లల మోడలింగ్‌ ఏజెన్సీలకు పంపించింది.

 

నేనేనా

అలా ‘ఒనిడా' టీవీ లాంటి రెండు మూడు ప్రకటనల్లో కనిపించా. నిజానికి నాకు అప్పుడు ఆ విషయాలేవీ గుర్తులేవు కానీ, తరవాత నా ఫొటోలూ, వీడియోలూ చూశాక నేనేనా అక్కడ నటించింది అనిపించింది. ఇదంతా జరిగింది బెంగళూరులో. అక్కడ మోడలింగ్‌ ఏజెన్సీలు చాలా ఉండేవి కాబట్టి ప్రకటనల్లో అవకాశాలు దొరికాయి.

అవకాశాలు వాలిపోలేదు!

సినిమాల్లో తొలి అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలి. నేను అనుకున్నట్లు ‘మిస్‌ ఇండియా' పోటీల తరవాత అవకాశాలు వాలిపోలేదు. చాలా నెమ్మదిగా కెరీర్‌ మొదలైంది.

అప్పుడే...

మొదట తమిళంలో ‘పుత్తగన్‌' అనే సినిమా చేశా. ఆ తరవాత హిందీలో ‘యారియా' చేశా. ఆ రెండూ విజయం సాధించాయి. తరవాత తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'లో అవకాశం వచ్చింది.

నిజానికి..

నిజానికి మొదట ఒప్పుకున్న సినిమా ‘రఫ్‌'. ముప్ఫయి రోజులు షూటింగ్‌ జరిగాక అది వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విడుదలై హిట్టయింది.

ఆ తర్వాత..

ఆ తరవాత గోపీచంద్‌తో చేసిన ‘లౌక్యం', మనోజ్‌తో ‘కరెంట్‌ తీగ' కూడా విజయాన్ని అందుకున్నాయి.

 

ఇంకోవైపు

ఓవైపు తమిళం నుంచి ఆఫర్లు మొదలయ్యాయి. రామ్‌తో ‘పండగ చేస్కో', రవితేజతో ‘కిక్‌ 2' విడుదలవుయ్యాయి.

పెద్ద ఆఫర్స్

బాలీవుడ్‌లో ‘సిమ్లా మిర్చి' కూడా షూటింగ్‌ పూర్తయింది. ‘జూ.ఎన్టీఆర్‌-సుకుమార్‌', ‘రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల' సినిమాలు కూడా చేసాను. ఇప్పుడు బన్నితో సరైనోడు చేసాను.

 

రాణించకపోతే..

హీరోయిన్‌గా రాణించకపోతే ఏం చేయాలని ముందే నిర్ణయించుకున్నా. ఎంబీయే ‘బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌' చేసి ఆ రంగంలో స్థిరపడేదాన్ని.

 

ఆ అలవాటు

గాడ్జెట్స్‌ పైన మరీ అంత ఆసక్తి లేదు. కాకపోతే మాటిమాటికీ ఫోన్‌ చూసుకునే అలవాటుంది. తోటి నటులు ఆ విషయంలో నన్ను ఆటపట్టిస్తారు.

ఆయనంటే ఇష్టం..

అమితాబ్‌ నాకు ఇష్టమైన నటుడు. ఆయన పక్కన కూతురిగా ఒక్క నిమిషం నటించే పాత్ర వచ్చినా చేస్తా.

అన్నిట్లో ప్రవేశం

కానీ జీవితంలో అన్నీ సమానంగా ఉండాలని అమ్మ తరచూ చెబుతుండేది. క్లాసులో తొంభై ఐదు శాతం రాకపోయినా ఫర్వాలేదు, కానీ అన్ని విషయాల్లో ఎంతో కొంత ప్రవేశం ఉండాలనేది.

షెడ్యూల్

దానికి తగ్గట్లే చిన్నప్పుడు నా రోజువారీ షెడ్యూల్‌ ఉండేది. స్కూల్లో క్లాసులతో పాటూ స్కూలైపోగానే లైబ్రరీకి వెళ్లేదాన్ని. సాయంత్రం స్విమ్మింగ్‌, కరాటే క్లాసులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు సింగింగ్‌, భరత నాట్యం, లాన్‌ టెన్నిస్‌లో శిక్షణ తీసుకున్నా. ఏడాదిన్నర పాటు హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నా.

 

అమ్మసలహా

హైస్కూల్‌కి వచ్చాక భవిష్యత్తులో మోడలింగ్‌ని ఎంచుకోమని అమ్మే సలహా ఇచ్చింది.

 

భయం

అమ్మ మాటల్ని బట్టి బహుశా ఒకప్పుడు తాను ఆ రంగంలోకి వెళ్లాలనుకుని వెళ్లలేకపోయిందేమో అనిపించేది. నాకూ మోడలింగ్‌లో ఆసక్తితో పాటూ కొద్దిగా భయం కూడా ఉండేది.

 

గన్స్,రైఫిల్స్

ఆర్మీ వాతావరణంలో పెరగడంతో చిన్నప్పుడే గన్స్‌, రైఫిల్స్‌ లాంటి ఆయుధాలను దగ్గరగా చూశా. ఇంట్లో కూడా ఎయిర్‌ రైఫిల్‌ ఉండేది.

పూరీ సినిమాకు నో!

మొట్టమొదట నాకు ఫోన్‌ చేసింది పూరీ జగన్నాథ్‌. ఓ సినిమాలో అవకాశం ఇవ్వడానికి పిలిచారు. కాకపోతే శిక్షణ ఉంటుందనీ, ఓ వంద రోజులు డేట్లు కావాలని అడిగారు. అన్ని రోజులు కుదరదనీ డిగ్రీ పూర్తిచేయాలనీ చెప్పా.

 

అయినా ఒప్పుకోలేదు

‘డిగ్రీ మెడలో వేసుకుని తిరగం కదా, మంచి అవకాశాలు మళ్లీ రావు' అని ఆయన నాన్నకు నచ్చజెప్పారు. నాన్న కూడా నన్ను కరస్పాండెన్స్‌లో చదవుకోమని అన్నారు. నేను మాత్రం దానికి ఒప్పుకోలేదు.

 

ఇక్కడ కాకపోతే..

సినిమాల్లో రాణించలేకపోతే ఎంబీయే చేయాలన్నది నా ఆలోచన.

 

మొదట హీరోయిన్ గా...

డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు మోడలింగ్‌ ఏజెన్సీ ద్వారా కన్నడలో ‘గిల్లీ' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ‘7జి బృందావన్‌ కాలనీ' సినిమాకు రీమేక్‌ అది. నెలరోజులు నటిస్తే సరిపోతుందని చెప్పారు.

 

బోలెడు డబ్బులు

అప్పటికి నాకు దక్షిణాది సినిమాల గురించి ఏమాత్రం తెలీదు. పాకెట్‌మనీకి బోలెడు డబ్బులొస్తాయి, సినిమా రంగంలో అనుభవం కూడా వస్తుందని ఒప్పుకున్నా. నెల రోజులు పనిచేశాక, డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే రంగంలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక నటిగా గుర్తింపుతో పాటూ అవకాశాలూ వచ్చాయి. 23

 

అటెండెన్స్ తగ్గింది..

‘గిల్లీ' సినిమా వల్ల ఫస్టియర్‌లో అటెండన్సు చాలా తగ్గింది. దాంతో సినిమా ఆలోచన కొన్నాళ్లు పక్కనపెట్టా.

 

ఇంకో ఆఫర్

ఈలోగా తెలుగులో మళ్లీ ‘కెరటం' అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. 60 రోజులు పడుతుందన్నారు.

 

చిన్న పాత్ర అడిగా..

అన్ని రోజులు కుదరదనీ, ఏదైనా వేరే పాత్ర ఉంటే ఇవ్వమనీ అడిగా. బహుశా హీరోయిన్‌ కావాలనుకునే వాళ్లెవరూ అలా అడగరు. నేను మాత్రం ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం ఆర్రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా.

 

కొద్దిలో ‘మిస్‌ఇండియా' మిస్‌...

సాధారణ కుటుంబాలకు చెందిన వాళ్లు సినిమాల్లోకి రావాలంటే బ్యూటీ కాంటెస్టులే సరైన వేదికలు. నేను కూడా అదే ఉద్దేశంతో డిగ్రీ చివర్లో ఉన్నప్పుడు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. ఒక్కోమెట్టూ ఎక్కుతూ ‘ఫైనల్‌ ఫైవ్‌' దశకు చేరుకున్నా. కానీ కొద్దిగా తేడాతో ‘మిస్‌ ఇండియా' కిరీటం మిస్సయింది.

 

అయినా..

కానీ ఆ పోటీల్లో ‘మిస్‌ ఇండియా బ్యూటిఫుల్‌ స్మైల్‌, ఐస్‌, ఫేస్‌, టాలెంటెడ్‌' విభాగాలతో పాటూ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ‘మిస్‌ ఇండియా పీపుల్స్‌ ఛాయిస్‌' అవార్డునూ అందుకున్నా.

 

మిస్ ఇండియాలో పాల్గొన్నాకే..

ఆ తరవాతే ప్రకటనలతో పాటూ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. దక్షిణాది నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చాయి.

 

తప్పు చేసా అని అప్పుడు అర్దమైంది

సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో నాకొచ్చిన ఆఫర్ల గురించి స్టడీ చేశా. పూరీ జగన్నాథ్‌ ఎంత పెద్ద దర్శకుడో, ఆయన సినిమాను వదిలేసి ఎంత తప్పు చేశానో అప్పుడే అర్థమైంది.

 

అంతసేపూ

సినిమాల్లో నిద్రా, సమయంతో పనిలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎంత సేపంటే అంత సేపు పనిచేయాలి. కానీ నేను త్వరగా అలసిపోను. ఈ విషయంలో నా స్పోర్ట్స్‌, నాన్న నేర్పిన క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతున్నాయి.

నో బ్రేక్

ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు బ్రేక్‌ ఇవ్వను. వారంలో ఓ మూడ్రోజులు యోగా చేస్తా. వారానికోసారి గోల్ఫ్‌ ఆడతా.

 

అది చాలా అవసరం...

చిన్నప్పట్నుంచీ చాలా రాష్ట్రాల్లో పెరగడం వల్ల అందరితో సర్దుకుపోయే తత్వం పెరిగింది. సినీ రంగంలో అది చాలా అవసరం.

 

నేను గోల్ఫ్‌ ఆడేటప్పుడు ఒక మాట చెప్పేవారు... 'థింక్‌ ఎబౌట్‌ ది షాట్‌ ఇన్‌ యువర్‌ హ్యాండ్‌'. అంటే... నీ చేతిలో ప్రస్తుతం ఉన్న బంతి మీదే దృష్టి పెట్టు. ఇంతకుముందు కొట్టింది మళ్లీ సరిచేయలేవు. తరవాత కొట్టబోయేది నీ చేతిలో లేదు. ఇదే నియమం నా జీవితానికీ పెట్టుకున్నా. చేసిన సినిమాలూ, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి అస్సలు ఆలోచించను. ప్రస్తుతం చేసేదే నా ఆఖరి సినిమా అన్నట్లు పనిచేస్తా.

English summary
Rakul Preet Singh, who is gearing up to join the next schedule of Thani Oruvan remake with Ram Charan, is currently spending days busy promoting her recent release Sarrainodu. Apparently, the countless looks she has tried for the promotional events of the film, have all received a unanimous thumbs up from the fashion critics as well as from anyone, who know very little about the fashion trends.
Please Wait while comments are loading...