»   » ధనుష్ కేసు: మరో బలమైన సాక్ష్యం వెలుగులోకి..

ధనుష్ కేసు: మరో బలమైన సాక్ష్యం వెలుగులోకి..

ధనుష్ను పరిక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ టెక్నాలజీ ద్వారా ధనుష్ తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేసుకున్నాడని సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమి హీరో, రజనీకాంత్ అల్లుడు... ధనుష్ తన కుమారుడే అంటూ ఓ ఇద్దరు వృద్ధ దంపతులు కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని మేలూరు కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. అయితే ధనుష్ మాత్రం ఆ దంపతులు చెప్పే దాంట్లో నిజం లేదని వాదిస్తున్నాడు.

మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథిరేసన్(60), కె. మీనాక్షి(55) ధనుష్ తమ కొడుకే అంటూ కోర్టు కెక్కారు. తమకు ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా ధనుష్, ఆ దంపతుల మధ్య వాదప్రతివాదాలు జరుగుతున్నాయి.

బలమైన సాక్ష్యం, ఇబ్బందుల్లో ధనుష్

కథిరేసన్ దంపతులు కోరినట్లు ధనుష్ పుట్టు మచ్చలను పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ధనుష్ను పరిక్షించిన ప్రభుత్వ వైద్యులు లేజర్ టెక్నాలజీ ద్వారా ధనుష్ తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేసుకున్నాడని సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికతో ధనుష్ ఈ కేసులో మరింత ఇబ్బందుల్లో పడ్డట్లయింది. తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసారు.

ఆధారాలతో సహా కోర్టుకు

అతడు(ధనుష్) తమ పెద్ద కుమారుడని, ఇంకా తమకు ధనపాకియమ్ అనే కూతురు కూడా ఉందని ఆ దంపతులు కోర్టుకు తెలిపారు. ధనుష్ తమ కుమారుడే అంటూ బర్త్ సర్టిఫికెట్, ధనుష్ ను పోలి ఉన్న చిన్ననాటి ఫోటోలను కూడా ఈ దంపతులు కోర్టుకు సమర్పించారు.

పారిపోయాడు

తానొక రిటైర్డ్ బస్ కండక్టర్ అని, తన కుమారుడు 10వ తరగతి వరకు మేలూరులోని ఆర్ సి మిడిల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యనభ్యసించాడని, తర్వాత 2002లో అతన్ని 11వ క్లాసు చదువకోసం శివగంగ జిల్లా తిరుపథూర్ లోని అరుముగమ్ పిల్లై సతాయ్యామ్మాల్ హెచ్ఎస్ఎస్ లో చేర్పించామని.... అక్కడ చేర్పించిన నెలరోజుల్లోనే స్కూలు విడిచి పారిపోయాడని కథిరేసన్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

పేరు మార్చుకుని సినిమాల్లోకి

అక్కడి నుండి పారిపోయిన తర్వాత చెన్నై వెళ్లాడు... సినిమా రంగంలో కెరీర్ ప్రారంభించాడు. తన పేరు కూడా థనుష్ కె రాజాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మా కుమారుడు కస్తూరి రాజా దగ్గర ఉన్నాడని తమ పిటీషన్లో పేర్కొన్నారు.

మెయింటనెన్స్ ఇప్పించండి

మా పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. మా కుమారుడు నుండి తమకు నెలకు రూ. 65000 మెయింటనెన్స్ వచ్చేలా చూడాలని ఆ దంపతులు పిటీషన్లో పేర్కొన్నారు.

కస్తూరి రాజా కొడుకు, రజనీ అల్లుడు

ధనుష్ మనకు ఇప్పటి వరకు తమిళ దర్శకుడు కస్తూరి రాజా కొడుకుగా, తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సోదరుడిగా... సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా తెలుసు. మరి ఈ కేసు తర్వాత పరిస్థితి ఎలా మారబోతోందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

English summary
In the ongoing paternity tussle, the physical examination report submitted in the Madurai bench of Madras High Court on Monday revealed that the identification marks on actor Dhanush were removed using laser technology.
Please Wait while comments are loading...