Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్ జెనీలియా కొడుకు ఇలా... (ఫోటోస్)
హైదరాబాద్: జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ దంపతులు నవంబర్ చివరి వారంలో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మేరీ క్రిస్ మస్ సందర్భంగా తన కొడుకును లిటిల్ శాంతా అవతారంలో ఫోటోలు తీసి అభిమానుల కోసం ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. ఈ ఫోటోను పోస్టు చేయడంతో పాటు తన జీవితంలో ఈ క్రిస్ మస్ ఎంతో స్పెషల్ అంటూ ట్వీట్ చేసింది జనీలియా. రితేష్ ఆమె ట్వీట్ ను రి ట్వీట్ చేసాడు. మ ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తి రావడంతో అంతా సంతోషంగా ఉన్నారు.
జెనీలియా నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.
'రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా మధ్య పెళ్లికి ముందు నుండే చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్' నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిజౌజా మధ్య దాదాపు పదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.
సౌతిండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన జెనీలియాకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమె సినిమాలకు దూరం కావడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు.