» 

చిరు క్లాప్‌తో బన్నీ ‘రేస్ గర్రం’లా...(ఫోటో ఫీచర్)

Posted by:

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ప్రారంభం అయిన వారం రోజులకే..... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రం ప్రారంభం అయింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై అల్లు అర్జున్ పై చిత్రీకరించిన తొలి సన్ని వేశానికి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు డి. రామానాయుడు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, వివి వినాయక్, సురేష్ బాబు, నాగబాబు, రాణా దగ్గుబాటి, చలపతిరావు, బ్రహ్మాజీ, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. చాలా రోజుల క్రితమే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని బన్నీ మాట ఇచ్చాడట. కానీ ఇంత కాలం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో చేయలేక పోయాడు. ఎట్టకేలకు సమయం కలిసి రావడంతో వీరి కాంబినేషన్ చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస కెమెరా, నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మాత, బేనర్ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్.

మెగా స్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా ప్రారంభమైన ‘రేస్ గుర్రం' చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. అక్టోబర్ 24న రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో డి. రామానాయుడు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, వివి వినాయక్, నాగబాబు, రాణా దగ్గుబాటి, చలపతిరావు, బ్రహ్మాజీ, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి)తో అల్లు అర్జున్.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో తండ్రి అల్లు అరవింద్ తో బన్నీ.

రేస్ గుర్రం చిత్రంలో ప్రకాష్ రాజ్, సుహాసిని మణిరత్నం, బ్రహ్మానందం, అలి, బ్రహ్మాజీ, ముఖేష్ రిషి, ఆశిష్ విద్యార్థి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ, అలి ఓపెనింగ్ వేడుకకు హాజరైన సందడి చేసారు.

దర్శకులు సురేందర్ రెడ్డి, వివి వినాయక్ లతో స్టైలిష్ స్టార్.

రేస్ గుర్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, చిరంజీవి మాటమంతి.

రాఘవేంద్రరావు, చిరంజీవిలతో సురేష్ బాబు చిట్ చాట్.

Read more about: allu arjun, chiranjeevi, race gurram, surender reddy, అల్లు అర్జున్, చిరంజీవి, రేస్ గుర్రం, సురేందర్ రెడ్డి
English summary
Allu Arjun's another new film Race Gurram was launched on October 24, just a week after the launch of Stylish star and Puri Jagannath's combo movie Iddarammayilatho. The opening of muhurtam of the film was held at the Ramanaidu Studios in Hyderabad, this Wednesday morning. Megastar Chiranjeevi sounded the clap for opening shot of this much-talked about movie.

Telugu Photos

Go to : More Photos