» 

2013 టాప్ హాట్ ఐటం సాంగ్స్ (ఫోటో ఫీచర్)

Posted by:

హైదరాబాద్ : కారణాలేమైనా తెలుగు సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలంటే సినిమాల ఐటం సాంగులు తప్పనిసరయ్యాయి. ఈ ట్రెండు తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో పాపులర్ అయిన ఐటం సాంగుల్లో ప్రత్యేకించి జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి డాన్సింగ్ స్టార్లు ఉండే వారు.

అదరిపోయే స్టెప్పులేస్తూ అందాలు ఆరబోస్తూ వారు ఇచ్చే హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు జనాలు ఎగబడే వారు. అయితే ఆ కాలంలో ఐటం సాంగులు అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు. రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ లాంటి సాంగ్స్ పై అభిప్రాయం కూడా మారింది.

ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఐటం సాంగులను ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఐటం సాంగులు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన నాయక్, మిర్చి, బాద్ షా, గుండెజారి గల్లంతయ్యిందే, బలుపు చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. వీటి విజయంలో ఐటం సాంగులు కూడా తమదైన పాత్ర పోషించాయి.

బాద్‌షా అదరగొట్టిన నికోల్


జూ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రంలో హాట్ లేడీ నికోల్ ‘వెల్‌కం కనకం' అనే సాంగులో అదరగొట్టింది. ఈ సాంగు 2013లో మోస్ట్ పాపులర్ సాంగుగా మారింది. తమన్ ఈ సాంగును కంపోజ్ చేసారు. ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సౌమ్యరావు, జస్ర్పీత్ పాడారు.

నాయక్ లో చార్మి ‘నెల్లూరే' సాంగ్


ఆ మధ్య నాగార్జున డమరుకం సినిమాలో చాయ్ సాంగుతో షేక్ చేసిన చార్మి...ఈ సంవత్సరం రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘నాయక్' సినిమాలో ‘నెల్లూరే' సాంగుతో కేక పుట్టించింది. ఈ సాంగులో రామ్ చరణ్, చార్మి స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మిర్చిలో సెగలు రేపిన హంసా నందిని


ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘మిర్చి' చిత్రం‌లో ఐటం భామ హంసా నందిని తన అందచందాలతో ఆకట్టుకుంది. సినిమాకు కీలకంగా మారిన అంశాల్లో ఈ పాట కూడా ఉందటం విశేషం.

బలుపులో లక్ష్మీరాయ్ ఐటం సాంగ్


సౌతిండియా పాపులర్ హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీరాయ్ రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘బలుపు' చిత్రంలో ప్రత్చేకంగా ఐటం సాంగు చేసి అలరించింది. లక్ష్మీరాయ్ ఐటం సాంగు సినిమాకు బాగా ప్లస్సయింది.

జ్వాలా గుత్త ఐటం సాంగ్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన జ్వాలా గుత్తా తన ఫ్రెండ్ నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే'చిత్రం కోసం ఐటం భామ అవతారం ఎత్తింది. జ్వాల ఐటం సాంగు చేయడం ఏమిటీ అని అంతా ఆశ్యర్చ పోయారు. విడుదలకు ముందు ఈ అంశం సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఆమె మాత్రం ఐటం సాంగులో ఆకట్టుకోలేక పోయింది.

Read more about: tollywood, hamsa nandini, gunde jaari gallanthayyinde, jwala gutta, charmi, lakshmi rai, టాలీవుడ్, హంసా నందిని, గుండెజారి గల్లంతయ్యిందే, జ్వాలా గుత్తా, చార్మి, లక్ష్మీ రాయ్
English summary
There are several factors that matter for the commercial success of a Telugu movie at the Box Office. Popular actor, actress and director are few main aspects that decide and influence trade dynamics. Music is another element, which contribute a lot to the fate of a film.
Please Wait while comments are loading...