twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పిపోయిన డైరీ దొరికింది...ఊపిరి పీల్చుకున్నారు

    By Srikanya
    |

    ముంబై‌: తన నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ద్వారా 2002లో ఫుట్‌ఫాత్‌ పై నిద్రిస్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లి ఒకరి మృతికి, నలుగురు గాయాలకు కారణమయ్యారంటూ సల్మాన్‌ఖాన్‌ పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాల డైరీ దొరకడంతో ముంబయి పోలీసులు వూపిరి పీల్చుకున్నారు. కేసుకు సంబంధించిన డైరీ మంగళవారం బాంద్రా పోలీసు స్టేషన్‌లో కనుగొన్నట్లు ముంబయి పోలీసు కమిషనర్‌ రాకేష్‌ మారియా బుధవారం తెలిపారు.

    పోలీసుస్టేషన్‌ మరమ్మతులో భాగంగా దస్త్రాలను రికార్డుగది నుంచి వేరేచోటికి మార్చారని, ఆ తర్వాత దానిని గుర్తించలేక పోయారన్నారు. కృష్ణ జింకను వేటాడిన కేసు దోష నిర్ధరణలో రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ .. తనను న్యాయస్థానాలు ఎల్లపుడూ సాధారణ పౌరుడి మాదిరిగానే చూస్తూ ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు.

    Police trace missing documents, case dairy in Salman Khan hit-and-run case

    2002 సెప్టెంబర్‌ 28న ముంబయిలో సల్మాన్‌ కారు.. ఒక బేకరీ బయట రోడ్డు పక్కన నిద్రిస్తున్న జనంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 63 మంది సాక్షుల వాంగ్మూలాల్లో ఏడు మాత్రమే అసలు పత్రాలు ఉన్నాయని, మిగతావి నకలు పత్రాలు ఉన్నాయని పోలీసులు లోగడ న్యాయస్థానానికి తెలియజేశారు.

    English summary
    The Bandra police on Tuesday traced the original papers and a case dairy in the 2002 Salman Khan hit-and-run case. The papers, which had disappeared mysteriously, were found in Bandra police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X