»   » చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... : పోసాని సంచలనం

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... : పోసాని సంచలనం

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన మనసులో ఉన్న మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా కుంబబద్దలు కొట్టినట్లు చెప్పే వ్యక్తిగా పోసానికి పేరుంది. ఆయన మీడియా ముందుకొచ్చారంటే ఏదో ఒక సంచలన కామెంట్స్. తాజాగా ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోసాని తన దైన శైలిలో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవి చాలా నిజాయితీ పరుడు. ఎందుకంటే, గతంలో తనకు ప్రజా రాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు అని పోసాని చెప్పుకొచ్చారు.

కానీ పవన్ కళ్యాణ్....

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగా.. ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే, ఆ వ్యక్తి నిజాయితీ పరుడైనా అయి ఉండాలి, లేదా చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అని అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు దాట వేసే ప్రయత్నం చేసారు పోసాని.

జనసేన గురించి..

జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా.. ఆ పార్టీ గురించి ఇంతవరకూ తనకేమీ అర్థం కాలేదని, అర్థమయ్యాక దీనికి సమాధానం చెబుతానని పోసాని చెప్పుకొచ్చారు.

అందుకే ఓటమి

నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను' అని పోసాని 2009 ఎన్నికల సమయంలో జరిగిన తన ఓటమిని గుర్తు చేసారు. ఆ ఎన్నికల్లో ఆయన చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

అన్నయ్య మళ్లీ పార్టీ పెడితే

అన్నయ్య చిరంజీవి మళ్లీ ప్రజారాజ్యం పార్టీని మొదలు పెడితే తాను ఆయనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నానని, నిజాయితీగా ఉండే వారికి ఎప్పుడూ తనే సపోర్టు ఉంటుందని పోసారి కృష్ణ మురళి చెప్పుకొచ్చారు.

English summary
Tollywood actor Posani Krishna murali aboutt Pawan Kalyan and chiranjeevi.
Please Wait while comments are loading...