» 

పాపం పోసానికి మరో...

పాపం పోసాని పరిస్థితి ఏమి బాగా ఉన్నట్లు లేదు. ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన ఓడిపోయిన పోసాని రాజా వారి చేపల చెరువు సైతం గట్టెంక్కించలేకపోయింది. మెంటల్ కృష్ణ దెబ్బకు ఎవరూ ధియోటర్ల వైపుకు తొంగిచూడ లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు గాలి శీను పేరుతో మరో చిత్రం పోసాని ని హైలెట్ చేస్తూ ట్రైలెర్స్ వస్తున్నాయి. అందులో పోసాని ఎమ్మల్యేగా నటించారు. కామిడి ట్రాక్ అనుకుని చేసిన ఈ సీన్స్ నే హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేయటం పోసానికి మింగుడు పడటం లేదని సమాచారం. అందులోనూ ఆ సినిమా గతంలో వచ్చిన ఎఫ్.ఎమ్.(ఫన్ అవుర్ మస్తీ) అనే హిందీ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

ఆ చిత్ర సమర్పకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి ప్రముఖ పాత్రధారిగా స్వప్న మూవీస్‌ సంస్థ నిర్మించిన 'గాలి శీను' చిత్రం సెన్సార్‌ కార్యక్రమం పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.అలాగే 'వెంగమాంబ' చిత్రానికి దర్శకుడయిన ఉదయభాస్కర్‌ రూపొందించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి ఎం.ఎల్‌.ఎ.గా నటించారు. ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. సిటికి డాన్‌ కావాలనుకున్న వీధి రౌడి కథ ఈ సినిమా. ఆర్‌.కె., సత్యకృష్ణ పోషించిన పాత్రలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి అన్నారు. అయితే పోసానికి ఈ విషయం ముందే చెప్పి సీన్స్ తీసామని కాబట్టి తమకేమీ సమస్య ఉండదని దర్శక, నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక పోసాని అటు ఓడిపోయినందుకు బాద పడాలా లేక ఎమ్మేల్యేగా చేసిన కొద్ది పాటి సీన్స్ ని మరొకరు క్యాష్ చేసుకున్నందుకు బాధ పడాలా అనే సంగిద్గంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more about: posani krishna murali, rajavari chepala cheruvu, prajarajyam, mental krishna, gali seenu, ప్రజారాజ్యం, రాజా వారి చేపల చెరువు, పోసాని, మెంటల్ కృష్ణ

Telugu Photos

Go to : More Photos