» 

నవదీప్ 'వసూల్‌రాజా' (ఫొటో ఫీచర్)

Posted by:

హైదరాబాద్ : ఇప్పటిదాకా దాదాపు ఇరవై సినిమాలు పైగా చేసినా సరైన గుర్తింపు తెచ్చుకోని హీరో నవదీప్. ఈ చిత్రంతో నవదీప్ మాస్ హీరోగా టర్న్ అవుతాడంటున్నారు. శ్రీహరి, నవదీప్, రీతుబర్మేచా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వసూల్‌రాజా'. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. బి.ఎమ్.స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతోంది. మహంకాళి దివాకర్ సమర్పిస్తున్నారు. బత్తుల రతన్‌పాండు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పతాక సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ " 'వసూల్‌రాజా' గత మూడు రోజులుగా శ్రీహరి, నవదీప్, దండపాణి, రీతుబర్మేచా, విజయరంగరాజా, సమీర్, ఉత్తేజ్, సత్యం రాజేష్ తదితరులపై పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇంకా 30 శాతం టాకీ, రెండు పాటలను చిత్రీకరించాలి'' అని తెలిపారు. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట చిత్రం చేసిన రీతు బర్మేచా రెండవ చిత్రం ఇది. ఇందులో నవదీప్ కు లవర్ గా ఆమె కనిపించనుంది. ఈ చిత్రంతో తెలుగులో సెటిల్ అవుతానంటోందీ ముద్దుగుమ్మ.

శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. ఇందులో శ్రీహరి పాత్ర హైలెట్ అవుతుందంటున్నారు. ఈయన ఇందులో పోలీస్ ఆఫిసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

 

 

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ కి ఇది రెండో చిత్రం. మొదటి చిత్రం సాధ్యం. జగపతిబాబుతో చేసిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ఈ సారి హిట్ కొట్టే తీరుతానంటున్నాడు.

See next photo feature article

నిర్మాత మాట్లాడుతూ "పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఇది. శ్రీహరి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నవదీప్ పక్కా మాస్ పాత్రలో చేస్తున్నారు. చిన్నిచరణ్ సంగీతం, రామస్వామి సంభాషణలు సినిమాకు హైలైట్'' అని చెప్పారు. బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణప్రసాద్, నృత్యాలు: శేఖర్.

Read more about: vasool raja, teja, navdeep, వసూలు రాజా, నవదీప్, జై
English summary
Vasool Raja is being produced by Battula Ratan Pandu and Mahankali Diwakar under the banner BM Studios. Chinni Charan is composing the music for the movie, which will be released by the end of this month. Krishna Prasad is cranking the camera for the film, which is likely to hit the screens in the next month.
Please Wait while comments are loading...