twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ కు ఊహించని షాక్: అంత నీచమైన పని చేసానా? ఇంట్లో పెట్టి తాళం వేసానా? తేల్చుకుంటానంటున్నాడు

    విజయవంతమైన అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' చిత్రం వివాదంలో ఇరుక్కుంది.

    By Srikanya
    |

    ముంబై: అమీర్‌ఖాన్ తాజా బ్లాక్‌బ‌స్ట‌ర్ దంగ‌ల్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌లో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే 'దంగల్' అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాడు రెజ్లింగ్ కోచ్ పీఆర్ సోధి.

    రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత‌చ‌రిత్ర ఆధారంగా ఈ దంగ‌ల్ మూవీ తెర‌కెక్కింది. అన్ని అడ్డంకుల‌ను త‌ట్టుకొని పోగ‌ట్‌ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌ను రెజ్లింగ్ చాంపియ‌న్లుగా తీర్చిదిద్దిన వైనాన్ని చూపించారు డైరెక్ట‌ర్ నితీష్ తివారీ. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో చూపించే కోచ్ పాత్ర తనదే అని.. ఐతే తన పాత్రను వక్రీకరించి.. చెడుగా చూపించారని సోధి ఆరోపించాడు.

    నెగిటివ్ ఇమేజ్ తో ...

    నెగిటివ్ ఇమేజ్ తో ...

    70 ఏళ్ళ సోంధి 2010 కామన్వెల్త్ క్రీడల్లో గీతకు, బబితకు జాతీయ కోచ్ గా వ్యవహరించారు. ఇప్పుడు తన పాత్రను దంగల్ సినిమాలో నెగిటివ్ ఇమేజ్ తో తెరకెక్కించడంపై ఆయన మండిపోతున్నారు.

    షాక్ అయ్యా

    షాక్ అయ్యా

    ముఖ్యంగా దంగల్ సినిమాలో కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా గీత ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు మహవీర్ ను ఒక గదిలో బంధించి మ్యాచ్ చూడకుండా కోచ్ కుట్ర పన్నినట్లు చూపించే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సీన్ గురించి తెలిసి తాను షాక్ అయినట్లు ప్రస్తుతం కోచ్ సోంధి చెబుతున్నారు.

    తప్పుదారి పట్టించాలని..

    తప్పుదారి పట్టించాలని..

    సినిమాలో ఈ కోచ్ పేరు పీఆర్ కదమ్‌గా చూపించారు. అతను రెజ్లర్ గీత పాత్రధారిని తప్పుదోవ పట్టించాలని చూస్తాడు. ఆ కోచ్ పాత్ర బాగా ఇగో తో కూడుకున్నది.ఆమె తండ్రి చెప్పిన పాత టెక్నిక్‌ను వదిలిపెట్టాలని అంటాడు. చివర్లో గీత గోల్డ్ మెడల్ గెలిచే పోటీని తండ్రి చూడకుండా ఓ గదిలో పెట్టి తాళం వేసి మరీ ఇబ్బంది పెడతాడు. పైగా అమీర్ పాత్రంటే బాగా చులకన ఉన్నట్టు చిత్రీకరించారు.

    ఏం జరిగిందో ఆయన్నే ఆడగండి

    ఏం జరిగిందో ఆయన్నే ఆడగండి

    ఈ విషయమై నిజ జీవిత కోచ్ ఐన సొంధీ చెవిన భగ్గుమంటున్నారు. గీత, బబిత తండ్రి ఐన మహావీర్ సింగ్ పోపట్ తనకు ముందు నుంచి పరిచయం అని, తనేదో తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ రావడానికి కుట్రలు పన్ని నట్టు చూపడం పట్ల విచారం వ్యక్తం చేసారు. ఆ రోజు ఏం జరిగిందో మహావీర్ కుటుంబాన్నే అడిగి తెలుసుకోవచ్చు అని, తాను అలాంటి నీచమైన పని చేయలేదని స్పష్టం చేసారు.

    తక్కువ చేసి చూపించారు

    తక్కువ చేసి చూపించారు

    సోధి మాట్లాడుతూ...''సినిమాలో నా పేరును పీఆర్ సోధిగా చూపించారు. నన్ను తక్కువ చేసి చూపించారు. నాకు మహవీర్ చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన చాలా మంచివారు. తన కూతుళ్లకు నేను మూడేళ్లకు పైగా శిక్షణ ఇచ్చాను. ఒక్కసారి కూడా ఆయన మధ్యలో జోక్యం చేసుకోలేదు.

    మసాలా జోడించటం కోసం..

    మసాలా జోడించటం కోసం..

    అలాగే ..నేను ఇప్పుడు దంగల్ సినిమా చూడలేదు గాని నా పాత్ర ఆధారంగా తీసిన కొన్ని సీన్ల గురించి నా శిష్యులు చెప్పడంతో నేను షాక్ అయ్యానని తెలిపారు. అంతేకాకుండా సినిమాలో మసాలా జోడించడానికి ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం సరికాదని, నా పేరును నేరుగా ఉపయోగించకపోయినా, నన్ను ఉద్దేశించే ఆ పాత్రను తీర్చిదిద్దారని సోంధి పేర్కొన్నారు.

    గీత కూడా ఖండిస్తుంది

    గీత కూడా ఖండిస్తుంది

    ఇక జాతీయ కోచ్ కామన్వెల్త్ క్రీడల సందర్బంగా ఓ వ్యక్తిని గదిలో బంధించి ఉంటే దాని గురించి మీడియాకు, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని.. దీని గురించి అడిగితే ఇప్పుడు గీత కూడా ఈ ఆరోపణలను ఖండిస్తుందని చెప్పుకొచ్చారు.

    పిర్యాదు చేస్తాను

    పిర్యాదు చేస్తాను

    చివరగా ఈ విషయంలో నిర్మాతపై లీగల్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నానని, ముందుగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేస్తానని కోచ్ పీఆర్ సోంధి మీడియాతో అన్నారు.

    ఎందుకంత తప్పుగా..

    ఎందుకంత తప్పుగా..

    మరి నన్ను అంత తప్పుగా ఎందుకు చూపించారో అర్థం కాలేదు. నిజానికి మహవీర్ కాకుండా మరో నలుగురు కోచ్‌లు గీత.. బబితలకు శిక్షణ ఇచ్చారు. సినిమాలో అలా ఎందుకు చూపించలేదో'' అని సోధి అన్నాడు.

    ఏమౌతుందో

    ఏమౌతుందో

    సోధి.. 'దంగల్' టీం మీద లీగల్ యాక్షన్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఐతే సినిమాలో మహవీర్.. బబిత.. గీత పాత్రలు మినహా కల్పితం అని ముందే నోట్ ఇచ్చిన నేపథ్యంలో పీఆర్ సోధి విమర్శల్ని ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి మరి అంటోంది బాలీవుడ్.

    కలెక్షన్స్ లో...

    కలెక్షన్స్ లో...

    ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే,...ముందుగా ఊహించిన‌ట్లే మొద‌టి మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల మార్కును దాటింది. ఆదివారం ఒక్క‌రోజే రూ.42.35 కోట్లు వ‌సూలు చేసిందీ సినిమా. భార‌త సినీ చ‌రిత్ర‌లో ఒక్క‌రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది.

    ఈ సినిమా హైలెట్స్, మైనస్ లు ఇక్కడ

    ఈ సినిమా హైలెట్స్, మైనస్ లు ఇక్కడ

    ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది. సినిమా హైలెట్స్, మైనస్ లు ఏమిటనేది ఈ క్రింద రివ్యూలో చదవండి. ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి దూసుకుపోతోంది.

    అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్' మూవీ రివ్యూ)

    English summary
    Aamir Khan 's latest release “Dangal” has upset one person in particular. t’s none other than the real Geeta Phogat’s coach, PR Sodhi. Sondhi. He has stated that he might take some legal actions against the makers of the film for fictionalizing his character and putting him in bad light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X